S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/23/2016 - 08:08

హైదరాబాద్, మే 22 : రోహిణీ కార్తె ఈ నెల 25 న ప్రారంభమై జూన్ 9 వరకు ఉంటుంది. ఈ కార్తెలో ఎండలు మండుతాయా.. వర్షాలు కురుస్తాయా? అన్న ప్రశ్న రైతుల్లో, సాధారణ ప్రజల్లో తలెత్తుతోంది. సాధారణంగా రోహిణిలో విత్తనాల వేసేందుకు అవసరమైన వర్షాలు కురిస్తే రైతుల అదృష్టమే. ఎందుకంటే రోహిణిలో విత్తనాలు పడితే ఆ పంటలకు తెగుళ్ల బాధ పెద్దగా ఉండదు. చాలా సందర్భాల్లో రోహిణీలో ఎండలు మండుతుంటాయి.

05/23/2016 - 08:07

హైదరాబాద్, మే 22: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థ మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం పేరిట మోసానికి పాల్పడింది. కలాం టాలెంట్ టెస్ట్ పేరుతో వేలాది మంది విద్యార్థులను మోసం చేసింది. పరీక్ష రద్దు వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. నిర్వాహకుల వైఖరికి నిరసనగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ప్రశ్న పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

05/23/2016 - 08:04

హైదరాబాద్, మే 22: జవహర్‌లాల్ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో ఆదివారం ఓ సందర్శకుడు లయన్ ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. అప్రమత్తమైన జూ అధికారులు అతడిని ఎన్‌క్లోజర్‌లో నుంచి బయటకు తీసుకువచ్చారు. రాజస్థాన్ సికర్ జిల్లా కుర్దియా గ్రామానికి చెందిన ముఖేష్ (35) సాయంత్రం 4.55 నిముషాలకు అఫ్రికన్ లయన్ ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. ఆ సమయంలో యానిమల్ కీపర్ పాపయ్య అక్కడే ఉండడంతో పెద్దప్రమాదం తప్పింది.

05/23/2016 - 08:05

హైదరాబాద్, మే 22: రాష్ట్ర విభజన జరిగి రెండు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో పరిణామాలను ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే ఎంతో తేడా కనిపిస్తుంది. రెండు రాష్ట్రాల రాజకీయాల్లో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పటికీ సయోధ్య లేదు.

05/23/2016 - 02:14

హైదరాబాద్, మే 22: గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్టల్ర మధ్య కుదరాల్సిన ఒప్పందాలకు రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ మోకాలడ్డుతోంది. గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, తొలుత మహారాష్ట్ర నుంచి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకుంది. గోదావరి జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలకు సైతం రంగం సిద్ధమైంది.

05/23/2016 - 02:08

హైదరాబాద్, మే 22: వచ్చే ఏడాది మార్చి నుంచి పోస్టల్ పేమెంట్ (లావాదేవీ) బ్యాంకులు ప్రారంభమవుతాయని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటి శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. మహిళల రక్షణకు మొబైల్ ఫోన్లలో ‘ప్యానిక్ బటన్’, జిపిఎస్ వంటి విప్లవాత్మకమైన మార్పులు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో రాబోతున్నాయని ఆయన చెప్పారు.

05/23/2016 - 05:07

సూళ్లూరుపేట, మే 22: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పునర్వినియోగ రాకెట్ (ఆర్‌ఎల్‌వి- టిడి) ప్రయోగానికి శాస్తవ్రేత్తలు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు. ఇందుకు కూడా షార్ కేంద్రమే వేదికైంది.

05/23/2016 - 01:19

హైదరాబాద్, మే 22: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తారస్థాయికి చేరుకున్న రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్‌డిఎస్) వివాదానికి నెలాఖరులోగా తెరపడబోతుంది. ఈ అంశంపై తుంగభద్ర, కృష్ణాబోర్డులు రెండు మూడు రోజుల్లో సమావేశం కాబోతున్నాయి. ఆర్‌డిఎస్ వివాదాన్ని పరిష్కారించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే.

05/23/2016 - 01:12

హైదరాబాద్, మే 22:కాపు భవనాలకు చంద్రన్న భవన్‌గా నామకరణం చేసే విషయంలో ఆ సామాజికవర్గం, ఇతర పార్టీనేతల నుంచి వెల్లువెత్తిన నిరసనలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తలొగ్గారు.

05/23/2016 - 00:57

హైదరాబాద్, మే 22: ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ పదవికి పరాంకుశం వేణుగోపాల్ రాజీనామా చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు ఆదివారం తన కార్యాలయానికి వచ్చి కొన్ని కారణాలను వివరిస్తూ పదవికి రాజీనామా చేయాలని కోరారని వేణుగోపాల్ చెప్పారు. అయితే ఆ కారణాలను మీడియాతో పంచుకోలేనన్నారు.

Pages