S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/29/2018 - 12:29

కడప: కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన కడప జిల్లా బంద్‌ ప్రశాంతంగా సాగుతోంది.బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దుకాణదారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు బంద్‌ పాటిస్తున్నారు.

06/29/2018 - 12:22

విశాఖపట్నం: రాజకీయ లబ్ది కోసమే సీఎం రమేష్ దీక్ష చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ లాబీలో టీడీపీ ఎంపీల సంభాషణలు వారి చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. బరువు తగ్గేందుకు దీక్షలు ఉపయోగపడతాయని మురళీమోహన్, అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుకోవడాన్ని ప్రజలంతా చూశారని ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు.

06/29/2018 - 12:18

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉపరితల ఆవర్తనం వల్ల జులై మొదటి వారంలో భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. ఒడిశా, పశ్చిమబెంగాల్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలతోపాటు తెలంగాణ జిల్లాల్లో జులై మొదటివారంలో భారీవర్షాలు కురవవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్ర నిపుణులు రాజారావు చెప్పారు.

06/29/2018 - 05:03

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం ఆగస్టు 12 నుంచి 16వ తేదీ వరకు జరుగుతుందని టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాస రాజు చెప్పారు. ఈ వైదిక కార్యక్రమాల ఏర్పాటుపై గురువారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో అధికారులతో సమావేశమయ్యారు.

06/29/2018 - 04:41

గుంటూరు (లీగల్), జూన్ 28: సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఈ సారి జరుగుతున్న ఎన్నికలు ఉత్కంఠపోరుతో రసవత్తరంగా జరుగుతున్నాయి.

06/29/2018 - 01:06

తిరపతి, జూన్ 28: తిరుమలలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు తన ఇష్ట వాహనమైన గరుత్మంతునిపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు నాలుగు మాడీ వీధుల్లో కోలాహలంగా భజనలు, కోలాటాలు, చెక్క భజనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

06/29/2018 - 04:18

హైదరాబాద్, జూన్ 28: ప్రపంచ టాప్-5 ఐటీ కంపెనీలు తమ కార్యాలయాలను హైదరాబాద్‌లో నెలకొల్పాయని ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. దేశంలోనే హైదరాబాద్ ఉత్తమ నివాస నగరంగా మారిందన్నారు. హైటెక్ సిటీలో ఈపామ్ డిజిటల్ ఇంజనీరింగ్ కేంద్రాన్ని గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సాంకేతికత ద్వారా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

06/29/2018 - 04:17

హైదరాబాద్, జూన్ 28: గట్టు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం శంకుస్థాపన చేస్తారు. గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు ఇప్పటికే చేపట్టిన తమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులను అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. ఇప్పటికే తుమ్మిళ్ల ప్రాజెక్టు పనులు ప్రారంభం కావడంతో శుక్రవారం తన పర్యటన సందర్భంగా సీఎం సమీక్షించనున్నారు.

06/29/2018 - 00:20

హైదరాబాద్, జూన్ 28: తెలంగాణ రాష్ట్రంలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,36,733 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేశారు. గురువారం ఇక్కడ జరిగిన రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ)లో ఈ మేరకు ఆమోదం లభించింది. ఎస్‌ఎల్‌బీసీ అధ్యక్షుడు, ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ జే స్వామినాథన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

06/29/2018 - 00:13

విశాఖ , జూన్ 28: సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో గురువారం వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులతో పవన్ సమావేశమయ్యారు. పార్టీకి జీవం జనసైనికులే అని స్పష్టం చేశారు. ‘నాయకులు ఉండొచ్చు. వెళ్లిపోవచ్చు కానీ జనసైనికులు ఎప్పుడూ నాతోనే ఉంటారు’అని ఆయన అన్నారు.

Pages