S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/19/2018 - 17:51

చిత్తూరు: చంద్రబాబు చేసేది ధర్మ పోరాట దీక్ష కాదు.. దొంగ దీక్ష అని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. బాబు నాలుగేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు నాటకాలాడుతున్నారని భూమన మండిపడ్డారు. చంద్రబాబుకి దమ్ముంటే తుని ఘటనపై విచారణ జరిపించుకోవాలని సవాల్‌ విసిరారు.

04/19/2018 - 17:08

రాజమండ్రి : తెలుగు సినిమా పరిశ్రమను కుదిపేస్తున్న శ్రీరెడ్డి అంశంపై రాజమండ్రి ఎంపీ, సీనియర్‌ నటుడు మురళీమోహన్ స్పందించారు. ‘ఒక భారతీయ మహిళ అయివుండి అర్థనగ్న ప్రదర్శన చేయటం తప్పు. క్రమశిక్షణతో లేనివారికి మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌లో సభ్యత్వం ఇవ్వరు. నేను మా అధ్యక్షునిగా ఉంటే శ్రీరెడ్డికి ఖచ్చితంగా సభ్యత్వం ఇవ్వను’ అన్నారు.

04/19/2018 - 17:04

హైదరాబాద్: సాగునీటి రంగ నిపుణులు ఆర్ విద్యాసాగర్ రావు ప్రథమ వర్థంతికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. రామంతపూర్‌లోని హోటల్ భద్ర గ్రాండ్‌లో విద్యాసాగర్ రావు వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్.. విద్యాసాగర్ రావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, ఎంపీలు సుమన్, నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

04/19/2018 - 16:53

హైదరాబాద్: వైసీపీ నేతలు పెద్ద ప్లాన్ వేశారని, పోరాటం చేస్తున్న తనను వాడుకోవాలని ప్రయత్నించారంటూ నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలను వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఖండించారు. గురవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీరెడ్డి వెనుకో..మరో రెడ్డి వెనుకో ఉండాల్సిన అవసరం వైసీపీకి లేదని అన్నారు.
ఇటువంటి వ్యాఖ్యలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

04/19/2018 - 16:51

హైదరాబాద్:సినిమా రంగంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు. ఆయన గురువారంనాడు మీడియాతో మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీ అంటే ఎంతో గౌరవమని, తల్లిలాంటిదని పేర్కొన్నారు. ఈ పరిణామాలపై ఎన్జీఓలు,మహిళలతో కలిసి ఓ కమిటీని ఏర్పాటుచేయబోతున్నామని, వేధింపులపై ఫిర్యాదులు వస్తే ఈ కమిటీ విచారించి చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

04/19/2018 - 16:42

హైదరాబాద్:సెప్టెంబర్‌నాటికి హైటెక్ సిటీ మార్గంలో మెట్రో పనులు పూర్తవుతాయని మెట్రో ఎండీ ఎస్సీఎన్ రెడ్డి వెల్లడించారు. ఎయిర్‌పోర్టు వరకు మెట్రో పనులు పొడిగించాలని సీఎం చంద్రశేఖర్ సూచించారని ఆయన తెలిపారు. అమీర్ పేట - ఎల్బీ నగర్ మెట్రో మార్గం ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.

04/19/2018 - 16:36

అమరావతి: విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ఒక్కరోజు దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను దేవినేని ఉమామహేశ్వరరావు తదితర మంత్రులు పర్యవేక్షించారు. బాబు దీక్షకు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు దీక్ష చేస్తారని, తెలుగోడి సత్తా ఢీల్లీకి చాటుతామని వెల్లడించారు.

04/19/2018 - 16:34

హైదరాబాద్:పంజాగుట్ట పోలీసు స్టేషన్‌ను కేరళ సీఎం విజయన్ గురువారంనాడు సందర్శించారు. దేశంలో రెండో ఆదర్శ పీఎస్‌గా గుర్తింపుతెచ్చుకున్న పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో పోలీసింగ్ విధానం, సాంకేతిక పరిజ్ఞానం సేవలను గురించి కేరళ సీఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పోలీసు సిబ్బందిని అభినందించారు.

04/19/2018 - 16:34

హైదరాబాద్:్ఢల్లీ వెళ్లి తమ పార్టీ అధ్యక్షుడురాహుల్ గాంధీని కలుస్తానని కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి తెలిపారు. ఆయన గురువారంనాడు మీడియాతో మాట్లాడుతూ వందమంది కేసీఆర్‌లు వచ్చినా తనను ఏమీ చేయలేరని అన్నారు. రైతుల కోసం పోరాడినందుకు నన్ను అసెంబ్లీ నుంచి బహిష్కరించారని ఆయన ఆరోపించారు.

04/19/2018 - 16:33

హైదరాబాద్: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణలు చేసిన శ్రీరెడ్డిపై నటుడు శివబాలాజీ రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్‌పై ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పవన్ అభిమానులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతుందని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని ఆయన ఆరోపించారు.

Pages