S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/20/2018 - 02:24

విజయవాడ, ఏప్రిల్ 19: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ధర్మ పోరా ట దీక్షకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిం ది. విజయవాడలోని మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక రో జు నిర్వహించే ఈ దీక్షలను విజయవం తం చేసేందుకు వీలుగా రూ.20 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినట్లు తెలిసింది.

04/20/2018 - 02:09

విజయవాడ, ఏప్రిల్ 19: రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి చలించిపోయి, వారికి ఏదైనా మేలు తన వంతుగా చేసేందుకు ఒక యువకుడు నడుంబిగించాడు. రైతన్న సమస్యలను ఏపీ సీఎం దృష్టికి తీసుకువచ్చేందుకు రైతు కోసం పరుగు అనే పేరుతో పరిగెత్తే కార్యక్రమం చేపట్టాడు. మండుటెండను సైతం లెక్కచేయకుండా హైదరాబాద్ నుంచి వెలగపూడి సచివాలయానికి రోజుకు దాదాపు 60 కిలోమేటర్ల మేర పరుగెత్తుతూ, గురువారం విజయవాడ చేరుకున్నారు.

04/20/2018 - 02:02

హైదరాబాద్, ఏప్రిల్ 19: రాజ్‌భవన్‌లోగురువారం సాయంత్రం గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. శాసనసభలో ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసి వారి సభ్యత్వాలను హైకోర్టు పునరుద్ధరించిన నేపథ్యంలో గవర్నర్‌తో సీఎం భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

04/20/2018 - 04:10

సిద్దిపేట : భద్రాద్రి శ్రీరాముని సాక్షిగా టీ పీసీసీ నేత ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ..మొసలి కన్నీరు కారుస్తున్నారని.. పదవీ వ్యామోహంతో పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేయటానికి యత్నిస్తున్న కాంగ్రెస్ నేతలకు పుట్టగతులుండవని.. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు విమర్శించారు.

04/20/2018 - 01:54

హైదరాబాద్, ఏప్రిల్ 19: ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టుకు వన్యప్రాణి బోర్డు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సమాచారం పంపించింది.

04/20/2018 - 02:56

కాకినాడ: ఏపీ ఎంసెట్-2018కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈనెల 21వ తేదీలోగా 10వేల రూపాయల ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు తక్షణం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు కోరారు. గురువారం సాయంత్రానికి ఎంసెట్‌కు 2,74,920 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు.

04/20/2018 - 03:17

విజయవాడ: ప్రత్యేక హోదా సాధనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. నూజివీడు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ గురువారం జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామాలను పక్కదారి పట్టించడానికే చంద్రబాబు దీక్ష చేస్తున్నారని విమర్శించారు.

04/20/2018 - 02:55

విజయవాడ: దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా శరవేగంతో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తీసుకుంటున్న నేపథ్యంలో ఈనెల 20, 21 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను రోడ్డెక్కించేందుకు ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి వ్యూహరచన చేశారు.

04/20/2018 - 02:03

విజయవాడ, ఏప్రిల్ 19: నవ్యాంధ్రప్రదేశ్ నమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం నట్టేట ముంచింది. నాలుగేళ్ల నిరీక్షణ నిష్ఫలమయ్యేలా వ్యవహరించింది. ఐదుకోట్ల మంది ప్రజలను నిలువునా దగా చేసింది. చెంబెడు నీళ్లు, చారెడు మట్టి మొహాన కొట్టి దారుణంగా అవమానించింది. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచింది. ప్రజాస్వామ్య వ్యవస్థ పార్లమెంట్ సాక్షిగా మన వేదనను వెక్కిరించింది.. వంచించింది.. ప్రతి తెలుగువాడి గుండెను రగిలించింది.

04/20/2018 - 01:51

హైదరాబాద్, ఏప్రిల్ 19: ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో దేశాన్ని పాలిస్తున్న బీజేపీని గద్దె దించే అంశంలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. జాతీయ మహాసభల్లో భాగంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ తీర్మానంపై చర్చ జరుగుతుందని, కాంగ్రెస్‌తో కలిసి నడవాలా లేదా అన్న అంశంపై మాత్రమే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు.

Pages