S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/19/2018 - 13:57

హైదరాబాద్: సినిమా రంగంలో నాలుగు కుటుంబాల మాఫియా నడుస్తోందని, మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని.. లైంగిక దోపిడీకి చెక్‌ పెట్టాలని పీవోడబ్ల్యూ నేత సంధ్య డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ జీవితారాజశేఖర్‌ పెట్టిన కేసులకు ఎవరూ భయపడరని అన్నారు. జీవిత మహిళలను అవమానపరుస్తున్నారని.. భాష మార్చుకోవాలని సూచించారు.

04/19/2018 - 13:08

గుంటూరు:కేంద్రం తీరును నిరసనగా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ తలపెట్టిన స్పీకర్ సైకిల్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. యలమందల వద్ద సైకిల్ తొక్కుతూ స్పీకర్ కిందపడిపోయారు. దీంతో ఆయన తలకు స్వల్ప గాయమైంది. స్పీకర్ సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నారు. వేలాది మందితో భారీ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. కేంద్రం దిగి వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పీకర్ కోడెల శివప్రసాద్ స్పష్టం చేశారు.

04/19/2018 - 12:53

రంగారెడ్డి: హైదరాబాద్ లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన సమీర్, ముస్తఫాలు స్థానికంగా పలువురి వద్ద తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని సేకరించి కర్ణాటకకు తరలిస్తున్నారు. ఓఆర్ఆర్ టోల్ గేట్ వద్ద రాజేంద్ర నగర్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా బియ్యం అక్రమ తరలింపును గుర్తించి పట్టుకున్నారు. ఏడు టన్నుల బియ్యంతో పాటు రూ. 6 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

04/19/2018 - 12:42

అమరావతి: ఉండవల్లి సీఎం గ్రీవెన్స్‌ హాల్‌లో మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. దీక్షలు, రేపటి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించనున్నారు. మంత్రులు కళా వెంకట్రావు, దేవినేని ఉమ, నారా లోకేష్‌, నక్కా ఆనంద్‌బాబు, కొల్లు రవీంద్ర సమావేశంలో పాల్గొన్నారు.

04/19/2018 - 03:37

హైదరాబాద్, ఏప్రిల్ 18: సీపీఎం 22వ అఖిల భారత మహాసభలు బుధవారం అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఐదు రోజులపాటు నగరంలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగే సభలకు 16 మంది పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులతోపాటు వివిధ వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు, పలు రాష్ట్రాలకు చెందిన పార్టీ అగ్ర నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

04/19/2018 - 02:50

హైదరాబాద్, ఏప్రిల్ 18: దక్షిణ మధ్య రైల్వే 2017-18లో ఉత్తమ పనితీరుకు జాతీయ స్థాయిలో అత్యున్నత గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక పండిత్ గోవింద్ బల్లబ్ పంత్ షీల్డులతో పాటు వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గాను దేశంలోని 17 రైల్వే జోన్లలో దక్షిణ మధ్య రైల్వే జోన్ 17 షీల్డ్‌లను సొంతం చేసుకుంది. ఈ 17లో 6 సామర్ధ్య షీల్డులను సాధించి ఇతర జోన్‌లకు ఆదర్శంగా నిలిచింది.

04/19/2018 - 02:46

హైదరాబాద్, ఏప్రిల్ 18: అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవం ఈ నెల 20న నిర్వహిస్తున్నట్టు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే సీతారామారావు తెలిపారు. యూనివర్శిటీ ప్రాంగణంలోని ఓపెన్ ప్లాజాలో స్నాతకోత్సవం జరుగుతుందని, దీనికి ఛాన్సలర్ హోదాలో ఇఎస్‌ఎల్ నర్సింహన్ హాజరవుతారని ఆయన చెప్పారు.

04/19/2018 - 03:43

హైదరాబాద్, ఏప్రిల్ 18: జూన్ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలులోకి తీసుకరానున్నట్టు సీఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రిజిస్ట్రేషన్ విధానంతోపాటు భూ లావాదేవీలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి ‘్ధరణి’ వెబ్‌సైట్‌నూ అప్పటి నుంచే అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించారు.

04/19/2018 - 03:47

వరంగల్, ఏప్రిల్ 18: సీఎం కేసీఆర్ మోసకారి, అబద్దాల కోరంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మలివిడత ప్రజా చైతన్య బస్సు యాత్ర ముగింపు సందర్భంగా బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో బుధవారం రాత్రి నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

04/19/2018 - 01:43

హైదరాబాద్, ఏప్రిల్ 18: దేవాదాయ శాఖను ‘దేవుడు’ కరుణించినట్టు కనిపించటం లేదు. తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖకు పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో పాలన కుంటుపడుతోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఐఏఎస్ అధికారి బి వెంకటేశ్వర్లు కొంతకాలం కమిషనర్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత నుంచీ ఇన్‌చార్జిలతోనే పాలన కాలయాపన అవుతోంది.

Pages