S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/19/2018 - 01:35

విశాఖపట్నం, ఏప్రిల్ 18: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మరో రెండు రోజులు తప్పవు. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతల్లో గణనీయమైన పెరుగుదల కన్పిస్తుండగా, తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని పలు పట్టణాల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

04/19/2018 - 01:34

కాకినాడ, ఏప్రిల్ 18: కఠిన నిబంధనల మధ్య ఏపీ ఎంసెట్-2018 నిర్వహించడానికి కాకినాడ జేఎన్‌టీయూ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఎంసెట్ నిర్వహణలో ఏ విధమైన విమర్శలకు తావులేకుండా, ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి అక్రమాలకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎంసెట్ నిర్వహణలో వివిధ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

04/19/2018 - 03:48

చిత్రం: వైశాఖ శుద్ధ తృతీయ పర్వదినం సందర్భంగా బుధవారం సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి
భక్తకోటికి నిజరూపంలో దర్శనమిచ్చారు. వరాహ వదనంతో, మానవ శరీరంతో, సింహవాలంతో విలక్షణ మూర్తిగా దర్శనమిచ్చిన స్వామిని కనులారా వీక్షించిన భక్తులు పరవశించిపోయారు. చందనోత్సవం సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకొస్తున్న అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు.

04/19/2018 - 03:50

విజయవాడ, ఏప్రిల్ 18: కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణతో రాజధాని నగరం అమరావతి నిర్మాణంపై ప్రజానీకంలో అనేక సందేహాలు తలెత్తాయని, వాటిని పటాపంచలు చేసేలా నిర్మాణ పనులు వేగం పుంజుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

04/19/2018 - 03:52

విజయవాడ, ఏప్రిల్ 18: ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీలో నిరాహార దీక్ష చేసి విజయవాడకు చేరుకున్న వైకాపా ఎంపీలతో పార్టీ అధినేత జగన్ బుధవారం సమావేశమయ్యారు. హోదా సాధనకు భవిష్యత్తులో అనుసరించాల్సిన కార్యాచరణపై ఈ సందర్భంగా చర్చించారు. విమానాశ్రయం నుంచి జగన్ పాదయాత్ర చేస్తున్న నూజివీడు నియోజకవర్గానికి ఎంపీలు చేరుకున్నారు. శోభాపురం వద్ద ఎంపీలతో జగన్ భేటీ అయ్యారు.

04/19/2018 - 03:55

కళ్యాణదుర్గం, ఏప్రిల్ 18: తెలుగుదేశం పార్టీ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి సిద్ధమైందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. సీఎం చేసేది ధర్మదీక్ష కాదు 2019 ఎన్నికల దీక్ష అని ఆయన ఎద్దేవాచేశారు. బుధవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన బీజేపీ, టీడీపీలపై విరుచుకుపడ్డారు.

04/19/2018 - 03:57

విజయనగరం, విశాఖపట్నం, ఏప్రిల్ 18: విజయనగరం జేసీ-2గా పనిచేస్తున్న కాకర్ల నాగేశ్వరరావు, ఆయన బంధువుల ఇళ్లపై బుధవారం ఏకకాలంలో ఏసీబీ అధికారులు జరిపిన దాడిలో సుమారు రూ.30 కోట్ల విలువైన ఆస్తులు, బంగారం లభ్యమయ్యాయి. ఏసీబీ అధికారులు మాత్రం డాక్యుమెంట్ల విలువ రూ.5 కోట్లుగా చెబుతున్నారు. మార్కెట్ విలువ దీనికి ఆరింతలు ఎక్కువ ఉన్న మాట వాస్తవం.

04/19/2018 - 04:00

హైదరాబాద్, ఏప్రిల్ 18: ‘ఆరెస్సెస్ చేతుల్లో కేంద్రం కీలుబొమ్మ’గా ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. దేశంలో మతోన్మాదం పెచ్చుమీరిందని, కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విభజించు- పాలించు విధానాన్ని అమలు చేస్తోందని విరుచుకుపడ్డారు. సీపీఎం జాతీయ మహాసభలు బుధవారం నగరంలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

04/18/2018 - 16:48

భద్రాచలం: కేసీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోఉన్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇంతకాలం ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్‌ చివరకు రామయ్యను మోసం చేసారని రూ.100 కోట్లు కేటాయిస్తామని ఆ విషయాన్ని విస్మరించడం భద్రాద్రి అభివృద్దిపై దృష్టిసారించకపోవడం ఆయనకు భద్రాద్రిపై ఉన్న చిత్తశుద్దిని చెప్పకనే చెబుతోందన్నారు.

04/18/2018 - 16:10

హైదరాబాద్‌: జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మౌనదీక్ష చేసిన నటి మాధవీలతను అరెస్టు చేసిన బంజారాహిల్స్ పోలీసులు... మధ్యాహ్నం విడుదల చేశారు. నిర్మాత పుప్పాల రమేష్, హేమ... మాధవీలతకు సంఘీభావం తెలిపేందుకు పోలీసుస్టేషన్ కు వచ్చారు. పోలీస్‌స్టేషన్‌ బయట మాధవీలత మాట్లాడుతూ.. శ్రీరెడ్డి పరుష పదజాలం వాడటం సరికాదని...

Pages