S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/20/2018 - 13:55

పుట్టపర్తి: సీఎం చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు మద్దతుగా ప్రభుత్వ చీఫ్ విప్ పల్లెరఘునాథ్‌రెడ్డి పుట్టపర్తిలో దీక్షకు దిగారు. టీడీపీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు.

04/20/2018 - 13:43

హైదరాబాద్‌: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వం రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని ఆ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశారు. కాంగ్రెస్ సినీయర్ నేత మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో వెంకట్ రెడ్డి, సంపత్, న్యాయవాది జంధ్యాల శంకర్‌తో కలిసి ఈసీకి తీర్పు కాపీని ఇచ్చారు.

04/20/2018 - 12:43

అమరావతి: ‘రాష్ట్రానికి న్యాయం చేయాల్సిందే’ అనే నినాదంతో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తలపెట్టిన ‘ధర్మ పోరాట దీక్ష’ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఉదయం 7 గంటలకు సీఎం చంద్రబాబు దీక్షలో కూర్చుకున్నారు. రాత్రి 7 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. సీఎం దీక్షలో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

04/20/2018 - 12:38

విజయవాడ: విజయవాడలో చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట‌ దీక్షలో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాని మోదీపై తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారు. మోదీ రాజ్యాంగంతో పాటు తన భార్యను కూడా గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. ఏపీకి అన్యాయం చేసిన నువ్వు ఒక ద్రోహివి. ఒకప్పుడు నీ బీజేపీకి రెండు సీట్లు కూడా లేవు. వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటు కూడా రాదు. చిల్లర రాజకీయాలు, కుప్పిగంతులు మానెయ్‌.

04/20/2018 - 12:24

హైదరాబాద్‌: సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఫిలిం ఛాంబర్‌ వద్ద నిరసన తెలిపారు. తన సోదరుడు నాగబాబు, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజాతో కలిసి శుక్రవారం ఫిలిం ఛాంబర్‌ వద్దకు వచ్చిన పవన్‌ మీడియా వ్యవహారశైలిపై నిరసన తెలిపారు. శ్రీరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయడం, తర్వాత పునరుద్ధరించడం తదనంతరం పరిణామాలపై ఆయన ‘మా’ సభ్యులతో చర్చించారు.

04/20/2018 - 12:16

హైదరాబాద్‌: గడిచిన కొద్దిరోజులుగా తీవ్రదుమారం రేపుతోన్న శ్రీరెడ్డి వివాదంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నాపై ఆరోపణలు చేస్తున్నవారికి, చేయిస్తున్న వారికి అమ్మలు, అక్కలు, కోడళ్లు ఉన్నారు. కానీ వారి ఇంట్లో మహిళలే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు. టీఆర్‌పీలు, రాజకీయ లాభాల కోసం వయసైపోతున్న నా 70 ఏళ్ల తల్లిని దూషిస్తున్నారు.

04/20/2018 - 04:08

విజయవాడ: వెయిట్ లిప్టర్‌గా పతకం సాధించడానికి రాహుల్ ఎంతో కష్టపడ్డాడని అందుకే ఈ గుర్తింపు వచ్చిందని, దాంతో రాష్ట్రంలో ఉన్న ఎంతో మంది క్రీడాకారులకు ఒక ఐకాన్‌గా నిలిచాడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కితాబిచ్చారు.

04/20/2018 - 02:47

హైదరాబాద్, ఏప్రిల్ 19: దక్షిణ రైల్వేలో జరుగుతున్న సిగ్నలింగ్ పనుల్లో భాగంగా అరక్కోణం వద్ద జరుగుతున్న ప్రీ నాన్ ఇంటర్‌లాకింగ్, నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా ఆ రూట్లో నడిచే ఐదు రైళ్లను మే 5, 6 తేదీల్లో రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

04/20/2018 - 02:21

హైదరాబాద్, ఏప్రిల్ 19: సీపీఎం జాతీయ మహాసభల్లో రాజకీయ తీర్మానం రగడ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ మెజారిటీ సభ్యుల ఆమోదంతో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సాధారణంగా పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో సీతారాం ఏచూరి రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉండగా కారత్ ప్రవేశపెట్టారు.

04/20/2018 - 02:19

హైదరాబాద్, ఏప్రిల్ 19: హైదరాబాద్ నగర పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలు భేష్ అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసించారు. నగరవాసులకు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అందిస్తున్న సేవలను అభినందించారు. తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అద్భుతంగా ఉందని కొనియాడారు. దేశంలోనే రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా రికార్టు సృష్టించిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను విజయన్ గురువారం సందర్శించారు.

Pages