S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/21/2018 - 01:19

హైదరాబాద్, ఏప్రిల్ 20: అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకు అత్యధునిక డ్రోన్ కెమెరాలను వినియోగించాలని పురపాలక శాఖ నిర్ణయించింది. అనధికార ఇసుక రీచులను డ్రోన్ల సాయంతో గుర్తించి గనులశాఖ సత్ఫలితాలు సాధించడంతో, వీటిని మున్సిపల్‌శాఖ కూడా వినియోగించాలని నిర్ణయించింది. డ్రోన్ కెమెరాలను వినియోగించడం ద్వారా ఒక్క అనధికార నిర్మాణాలనే కాదు, ఆస్తి పన్ను మదింపులో జరిగే మోసాలనూ గుర్తించవచ్చు.

04/21/2018 - 01:06

హైదరాబాద్, ఏప్రిల్ 20: సినీ పరిశ్రమలో అవకాశాల పేరిట అమ్మాయిలను లోబరుచుకుంటు న్నారంటూ తలెత్తిన వివాదం చివరికి రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక వైపు బీజేపీపైనా, మరో వైపు తెదేపా, వైకాపాలపై తనదైన శైలిలో రాజకీయ ఆరోపణలతో విరుచుకుపడుతున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై తెలుగుదేశం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు తెలిసింది.

04/21/2018 - 01:04

హైదరాబాద్, ఏప్రిల్ 20: సీపీఎంలో ఎలాంటి విభేదాలు లేవని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ స్పష్టం చేశారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ తీర్మానంపై చర్చ ముగిసిందని, పార్టీ ముఖ్య నేతల నుంచి వచ్చిన పలు సవరణలపై విస్తృతంగా చర్చ జరిపామన్నారు. ముఖ్యమైన సవరణలపై ఓటింగ్ నిర్వహించి అనంతరం రాజకీయ ముసాయిదాను వెల్లడిస్తామన్నారు.

04/21/2018 - 01:01

విజయవాడ, ఏప్రిల్ 20: చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆశావహుల ఉత్కంఠకు తెరదించుతూ తిరుమల తిరుపతి దేవస్థానముల (టీటీడీ) పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. ఇటీవలే టీటీడీ చైర్మన్‌గా సుధాకర్ యాదవ్‌ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పాలకమండలిని ప్రకటించింది.

04/21/2018 - 00:55

ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ యావదాంధ్ర దీక్షాకంకణం కట్టుకుంది. కేంద్ర నిర్లిప్త ధోరణిపై నిప్పులు చెరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో శుక్రవారం జరిగిన ధర్మ పోరాట దీక్షలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న జనం రాష్ట్ర ప్రయోజనాలపై రాజీలేదన్న బలమైన సందేశాన్ని అందించారు. మంత్రులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు తండోపతండాలుగా తమతమ ప్రాంతాల్లోని దీక్షా శిబిరాలకు తరలి వచ్చిన జనం కేంద్రంపై రణన్నినాదం చేశారు.

04/21/2018 - 00:50

విజయవాడ, ఏప్రిల్ 20: రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ చరిత్రలోనే తొలిసారిగా కేంద్ర ప్రభుత్వంపై తాను సాగిస్తున్న ధర్మ పోరాటానికి ప్రజలంతా మద్దతివ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఐదుకోట్ల ప్రజలు తన వెనుక ఉంటే వచ్చే ఎన్నికల్లో 25 పార్లమెంటు సీట్లను కైవసం చేసుకుని దేశ ప్రధాని ఎవరో మనమే నిర్ణయిద్దామన్నారు.

04/20/2018 - 16:45

హైదరాబాద్‌: తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను శుక్రవారం మహిళా సంఘాలు కలిశాయి. చిత్ర పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి..
హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి... త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని మహిళా సంఘాలకు హామీ ఇచ్చారు.

04/20/2018 - 16:37

విజయవాడ: చంద్రబాబు ధర్మాపోరాట దీక్షలో సినీనటుడు బాలకృష్ణ మోదీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నది నిజం కాదా ఆని ఆయన ప్రశ్నించారు. జగన్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి చంద్రబాబు ఈ దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఏడాది ఖచ్చితంగా విశాఖ రైల్వే జోన్ వస్తుందని అన్నారు.

04/20/2018 - 16:36

హైదరాబాద్: మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం జనసేన కార్యాలయంలో లాయర్లతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆడవాళ్లను అవమానించేందుకే చంద్రబాబుకు ఓటేసిందని విమర్శించారు. సాయంత్రం ఐదు గంటలకు జనసేన కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

04/20/2018 - 16:33

విజయవాడ: చంద్రబాబు చేస్తున్న దీక్ష కొంగ జపం వంటిదని ఏపీ పీసీసీ ప్రెశిడెంట్ రఘువీరారెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ..ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసినవారిని జైల్లో పెట్టించిన చంద్రబాబు ఇపుడు యూటర్న్ తీసుకుని దీక్ష చేయటం హాస్యాస్పదం అని అన్నారు.

Pages