S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/18/2018 - 03:13

* పివి రమణారావు

04/18/2018 - 02:28

హైదరాబాద్, ఏప్రిల్ 17: రైతుబంధు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడిగా ఎకరానికి రూ. 8 వేల చొప్పున అందించనున్న ఆర్థిక సహాయంలో మొదటి విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని వచ్చే నెల మే 10వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అదే రోజు చెక్కులతో పాటు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నట్టు సీఎం వెల్లడించారు.

04/18/2018 - 03:14

* ప్రపంచ రికార్డు దిశగా పనుల పరుగులు * మీడియాకు పవర్ పాయింట్ ప్రజంటేషన్

04/18/2018 - 02:15

హైదరాబాద్, ఏప్రిల్ 17: వేసవి ప్రారంభమవడంతో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో తాగు నీటికోసం కృష్ణాపై ఆధారపడిన 30 పట్టణాలు, వేలాది గ్రామాల్లో కటకట కనిపిస్తోంది. రెండు రాష్ట్రాలకు ప్రాణాధారమైన కృష్ణా నదిపై శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటి మట్టాలు క్రమేపీ అడుగంటుతున్నాయ. ఈ రెండు రిజర్వాయర్లలో నీటి లభ్యతతో వచ్చే నాలుగు నెలలు రెండు ప్రభుత్వాలు నెట్టుకు రావాల్సిన పరిస్థితి.

04/18/2018 - 01:53

విజయవాడ, ఏప్రిల్ 17: గడచిన నాలుగేళ్లుగా బీజేపీ నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ పొత్తు తెగదెంపులు చేసుకోవటంతో క్షణక్షణానికి మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు సోమవారం రాత్రి తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. నేరుగా ఈ లేఖ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు అందిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆమోదించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

04/18/2018 - 03:16

కర్నూలు, ఏప్రిల్ 17: నల్లధనం, తెల్లధనం మొత్తం ఇప్పుడు కర్నాటకలోనే ఉందని బ్యాంకింగ్ రంగం నిపుణులు వెల్లడిస్తున్నారు.

04/18/2018 - 03:18

విజయవాడ, ఏప్రిల్ 17: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ 20న ధర్మపోరాట దీక్ష పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒకరోజు నిరసన దీక్ష చేయనున్నారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఈ దీక్షలో పాల్గొంటున్నారన్నారు.

04/18/2018 - 03:20

విజయవాడ, ఏప్రిల్ 17: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కాగితం అవసరం లేని పాలనా వ్యవస్థ తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ ఏడాది జూన్ నుంచి వివిధ శాఖల్లో ఈ-ప్రగతిని పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో భూ-సేవ, ఈ-ప్రగతిపై మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు.

04/18/2018 - 01:43

హైదరాబాద్, ఏప్రిల్ 17: తెలంగాణ అసెంబ్లీ నుంచి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బహిష్కరించి, సభ్యత్వాన్ని రద్దుచేస్తూ చేసిన అసెంబ్లీ తీర్మానం చెల్లదని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వంపై తలెత్తిన వివాదం కేసులో మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకర్ తీర్పునిచ్చారు.

04/18/2018 - 03:22

మైలవరం, ఏప్రిల్ 17: రాష్ట్రంలో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గం ఒక మాఫియా గ్యాంగ్ అని వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహనరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం కృష్ణాజిల్లా మైలవరంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన తెలుగుదేశం పాలనపై నిప్పులు చెరిగారు.

Pages