S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/18/2018 - 13:58

సికింద్రాబాద్: కార్ఖానలోని ఆయిల్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారంనాడు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఫైరింజిన్లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఆస్తి నష్టం బాగా సంభవించినట్లు భావిస్తున్నారు.

04/18/2018 - 13:08

విజయవాడ: రాష్ట్రంలో 13లక్షల ఎకరాలకు నీరిచ్చామని నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన ప్రకటన పట్ల వైసీపీ నేత ఆళ్ల నాని ఎద్దేవా చేశారు. ఇంతవరకు ఒక్క ఎకరానికి కూడా నీరివ్వలేదని అన్నారు. జగన్ చేస్తున్న పాదయాత్రకు వస్తున్న జనాన్ని చూస్తుంటే ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని అన్నారు.

04/18/2018 - 13:06

హైదరాబాద్: సామాజిక కార్యకర్త సంధ్యపై నటి జీవితా రాజశేఖర్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను, తన కుటుంబాన్ని అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పరువునష్టం కేసు వేయనున్నట్లు జీవిత తెలిపారు.

04/18/2018 - 13:03

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వం తనకు కేటాయించిన గన్‌మెన్లను వెనక్కిపంపారు. కొన్నిరోజుల క్రితం తనకు రక్షణగా గన్‌మెన్లను కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్యకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తిచేశారు. పవన్ కోరిక మేరకు నలుగురు గన్‌మెన్లను ప్రభుత్వం కేటాయించింది. ఇద్దరు చొప్పున రెండు షిప్టుల్లో పనిచేసేలా కేటాయించారు.

04/18/2018 - 11:58

హైదరాబాద్‌: సీపీఎం 22వ జాతీయ మహాసభలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. నగరంలోని ఆర్టీసీ కల్యాణమండపంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం సీపీఎం పతాకాన్ని ఆవిష్కరించి మహా సభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరవీరులకు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు, మహాసభల ప్రతినిధులు నివాళులర్పించారు.

04/18/2018 - 11:47

సింహాచలం : సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ)ను పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజాము 4 గంటల నుంచి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దివ్యరూపాన్ని భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు, భార్య సునీలా గజపతిరాజు, సుధా గజపతి రాజు, మాజీ ఎంపీ ప్రదీప్‌ చంద్రదేవ్‌ తదితరులు స్వామివారి తొలి దర్శనాన్ని చేసుకున్నారు.

04/18/2018 - 04:48

ఖమ్మం, ఏప్రిల్ 17: కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలను రద్దుచేస్తూ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం చెల్లదని పేర్కొంటూ, శాసన సభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెంపపెట్టు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

04/18/2018 - 04:33

హైదరాబాద్, ఏప్రిల్ 17: దేశవ్యాప్తంగా పాఠశాల, ఉన్నత పాఠశాల, ప్లస్ టు స్థా యి వరకూ నిర్వహించే బోర్డు పరీక్షల సంస్కరణలకు సీబీఎస్‌ఈ జాతీయ కమిటీని నియమించింది. ఈ కమిటీ మే 31 నాటికి తొలి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ప్రాతిపదికగా కొన్ని సంస్కరణలకు సీబీఎస్‌ఈ నడుం బిగిస్తోంది. ఇవే సంస్కరణలను రాష్ట్రాలకు సైతం సిఫార్సు చేసి వా టి అమలుకు సూచనలు చేయనుంది.

04/18/2018 - 04:24

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: గోదావరి నదీ జలాల వివాదంపై బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకి అనుగుణంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగుతుందా లేదా అనే అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర జల వనరుల శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది.

04/18/2018 - 03:12

* సంచలన తీర్పునిచ్చిన హైకోర్టు * కాంగ్రెస్‌లో ఆనందోత్సాహాలు * ప్రభుత్వానికి చెంపపెట్టు: కాంగ్రెస్

Pages