S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/21/2018 - 04:01

విజయవాడ(బెంజిసర్కిల్): వీరపుత్రులకు జన్మనిచ్చిన పుణ్యభూమి...మహా ప్రవక్తలు పుట్టిన వేదభూమి...పౌరుషానికి ప్రతీతి అయిన బ్రహ్మనాయుడు నడయాడిన నేల...బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గడ్డ ఈ తెలుగు గడ్డ అని హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్నారు.

04/21/2018 - 01:59

హైదరాబాద్, ఏప్రిల్ 20: నగరంలోని ఫిలిం చాంబర్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. హీరో, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తల్లిపై నటి శ్రీరెడ్డితో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేయించినందుకు పవన్‌కళ్యాణ్, మెగాస్టార్ కుటుం బం తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై చిత్ర రంగ పెద్దలతో మాట్లాడేందుకు శుక్రవారం పవన్ కళ్యాణ్ ఫిలిం చాంబర్ వద్దకు చేరుకున్నారు.

04/21/2018 - 01:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ధర్మపోరాట దీక్ష పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలను తప్పుదోవ పటిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అన్నారు. ఢిల్లీలో ఆకుల విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అవినీతి నిర్మూలన కోసం దీక్ష చేయాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యా ఖ్యలు సంస్కారహీనంగా ఉన్నాయని మండిపడ్డా రు.

04/21/2018 - 01:50

హైదరాబాద్, ఏప్రిల్ 20: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధర్మాపోరాట దీక్ష పేరిట చేస్తున్న నిరాహార దీక్షను ఎలా నమ్మాలని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రశ్నించారు.

04/21/2018 - 01:50

హైదరాబాద్, ఏప్రిల్ 20: అంబేద్కర్ ఓపెన్ వర్శిటీని హైటెక్ బాటలోకి తీసుకువెళ్తున్నట్టు వైస్ ఛాన్సలర్ ప్రొ. కే సీతారామారావు తెలిపారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవం లో వైస్ ఛాన్సలర్ ప్రొ. కే సీతారామారావు మాట్లాడారు. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో మరో 10 ప్రాంతీయ సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నట్టు సీతారామారావు తెలిపారు.

04/21/2018 - 01:48

విజయవాడ, ఏప్రిల్ 20: ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీల అమలు కో సం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబునాయుడు స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంట ల వరకు చేపట్టిన ధర్మపోరాట దీక్ష అంచనాలకు మంచి విజయవంతమైంది.

04/21/2018 - 01:46

హైదరాబాద్, ఏప్రిల్ 20: హైదరాబాద్ సచివాలయంలో ఆంధ్రాకు కేటాయించిన సచివాలయ భవనాలను తమకు ఇస్తే ఉపయోగించుకుంటామని, ఈ విషయమై సానుకూలంగా స్పందించాలని తెలంగాణ ప్రభుత్వం కోరనుంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం సచివాలయంలో ఖాళీగా ఉన్న ఆంధ్ర సచివాలయ భవనాలను తమకు ఇవ్వాలని కోరగా, ఇంతవరకు ఏపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

04/21/2018 - 01:45

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత దాడులు సరికాదని, ఆయన చేస్తు న్న ఆందోళన సరైనదేనని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ పేర్కొన్నారు. పవన్ తప్పు చేస్తే రాజకీయంగా విమర్శించాలని ఆయన స్పష్టం చేశా రు. జస్టిస్ లోయ మరణంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తనకు విస్మయం కల్గించిందని అన్నారు.

04/21/2018 - 01:44

హైదరాబాద్, ఏప్రిల్ 20: సీపీఎం పార్టీ జాతీయ మహాసభల సందర్భంగా రాజకీయ తీర్మానంపై జరిగిన చర్చలో చివరి నిమిషంలో ఏచూరి తన పట్టు నెగ్గించుకున్నారు. పార్టీ 22వ జాతీయ మహాసభల సందర్భంగా అతి కీలకమైన రాజకీయ తీర్మానాన్ని ప్రకాష్ కారత్ ప్రవేశపెట్టా రు. ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో దేశాన్ని పాలిస్తున్న బీజేపీని గద్దె దించడమే ప్రధాన అజెండాగా ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మాణంపై మహాసభల్లో సుదీర్ఘంగా చర్చించారు.

04/21/2018 - 01:25

సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ప్రత్యేక విమానంలో మహారాష్టల్రోని షిర్డీకి వెళ్లారు. షిర్డీ సంస్థాన్‌లో బాబా సమాధిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సాయిబాబాను దర్శించుకుంటున్న సీఎం కేసీఆర్

Pages