S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/06/2018 - 01:57

హైదరాబాద్, మార్చి 5: ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకుంది. శాఖలవారీగా ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి రాజ్యాంగ నిబంధనలు, శాసన సభ నియమావళి అంగీకరించదని అధికారుల సూచించడంతో, కేసీఆర్ తన ప్రతిపాదనను విరమించుకున్నారు.

03/06/2018 - 01:52

అమరావతి, మార్చి 5: ప్రధాన ప్రతిపక్షం లేదని సభను ఆషామాషీగా తీసుకోవద్దని తెదేపా అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ప్రజాసమస్యలను ప్రస్తావించి, మంత్రులను ప్రశ్నించి సమాధానాలు రాబట్టాల్సిందేనన్నారు. సోమవారం అసెంబ్లీలో పార్టీ వ్యూహకమిటీ బృందంతో సమావేశమయ్యారు. సభకు వైసీపీ సభ్యులు రానంతమాత్రాన తేలిగ్గా తీసుకోవద్దని, ప్రతి అంశంపై చర్చించాల్సిందేనన్నారు.

03/06/2018 - 01:42

హైదరాబాద్, మార్చి 5: తెలంగాణ రాష్ట్ర శాసన మండలి, శాసనసభ సంయుక్త సమావేశం 12న ఉదయం 10 గంటలకు నిర్వహించేందుకు గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. శాసనమండలి తొమ్మిదో సమావేశం, శాసనసభ తొమ్మిదో సమావేశం నిర్వహించేందుకు గవర్నర్ నిర్ణయించారు. ఉభయ సభలను ఉద్దేశించి ఆరోజు గవర్నర్ ప్రసంగించిన తర్వాత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈమేరకు సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.

03/06/2018 - 02:01

నిజామాబాద్, మార్చి 5: తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పేరిట కొత్త డ్రామాకు తెరలేపారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా నిజామాబాద్‌లో పర్యటిస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సోమవారం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు.

03/06/2018 - 01:36

హైదరాబాద్, మార్చి 5: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకరావడం కోసం జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆ దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కూడా కేసిఆర్ నేతృత్వంలో ఏర్పాటు చేయబోయే తృతీయ ఫ్రంట్‌కు మద్దతు ప్రకటించారు.

03/06/2018 - 01:27

విజయవాడ, మార్చి 5: విభజన కారణంగా ఏపీ తీవ్రం గా నష్టపోయింది. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలమేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని స్పష్టం చేశారు.

03/05/2018 - 13:05

హైదరాబాద్: తెలంగాణకు చెందిన మూడు రాజ్యసభ స్థానాల కోసం జరగబోయే ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 12 చివరి తేదీ కాగా.. ఈనెల 23న పోలింగ్ ఉంటుంది. మార్చి 13 నుంచి నామినేషన్ల పరిశీలన ఉండగా.. మార్చి 15 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఎలక్షన్ కమిషన్ వెసులుబాటు కల్పించింది.ఈ నెల 23న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ ఉంటుంది.

03/05/2018 - 16:28

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఉభయ తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ అన్నారు. సోమవారంనాడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభనుద్దేశించి ప్రసంగిస్తూ.. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. విభజన చట్టంలోని అంశాలన్నింటినీ అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతుందని అన్నారు.

03/05/2018 - 04:49

విజయవాడ, మార్చి 4: విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటును భర్తీచేసే క్రమంలో 45 నెలలుగా కేంద్రం మోసపూరిత మాటలతో కాలం వెళ్లదీస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు.

03/05/2018 - 04:46

హైదరాబాద్, మార్చి 4: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో 9, 10 షెడ్యూళ్లలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించేందుకు సోమవారం ఢిల్లీకి రావాలని కేంద్ర హోంశాఖ రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులను ఆహ్వానించింది. వాస్తవానికి ఈ సమావేశం గత నెల 23వ తేదీన జరగాల్సి ఉంది. కాని అప్పట్లో వాయిదా పడింది.

Pages