S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/07/2018 - 07:18

హైదరాబాద్, మార్చి 6: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 20 మంది మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. మార్చి 8న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మహిళా దినోత్సవ వేడుకల్లో వార్డుతో పాటు రూ. లక్ష నగదును అందించనున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

03/07/2018 - 07:03

హైదరాబాద్, మార్చి 6: ఆంధ్రప్రదేశ్‌కు 9.303 టిఎంసి, తెలంగాణకు 24.467 టిఎంసి నీటిని విడుదల చేస్తూ కృష్ణా జలాల యాజమాన్య బోర్డు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 2న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు బోర్డు మెంబర్ సెక్రటరీ పరమేశం తెలిపారు.

03/07/2018 - 07:00

అమరావతి, మార్చి 6: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, గతంలో ప్రకటించిన ప్యాకేజీనే అమలు చేస్తామని కేంద్రం తేల్చేయడంతో భవిష్యత్తు కార్యాచరణపై టీడీపీ దృష్టి సారించింది. అందులో భాగంగా మంగళవారం సాయంత్రం పార్టీ ఎమ్మెల్యేలతో టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. చర్చలో కేంద్రం నుంచి బయటకు రావాలన్న దానికే పార్టీ మొగ్గుచూపింది.

03/07/2018 - 01:25

హైదరాబాద్, మార్చి 6: చార్మినార్‌లో దొంగలు రెచ్చిపోయారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఆభరణాలు తయారు చేసే కార్ఖానాలో చొరబడి ఐదు కేజీల ఆభరణాలను దోచుకొని పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సిటీ ఆర్ముడ్ రిజర్వు పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోని ఓ ఇంట్లో ఆభరణాలు తయారు చేసే కార్ఖనా కొనసాగుతుంది. మంగళవారం మధ్యాహ్నం సుమారు 15 మంది యువకులు కత్తులతో అందులోకి ప్రవేశించి సిబ్బందిని బెదిరించారు.

03/07/2018 - 01:10

భద్రాచలం టౌన్, మార్చి 6: తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో దండకారణ్యంలో ఈ నెల 2న చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్ వేడి ఇంకా చల్లారలేదు. మావోయిస్టులు ఏవైపు నుంచి దాడులు చేస్తారోనని ఇరు రాష్ట్రాల పోలీసులు ఊపిరిబిగబట్టిన నేపథ్యంలో చత్తీస్‌గఢ్‌లో మంగళవారం మావోలు రెచ్చిపోయారు.

03/06/2018 - 17:03

హైదరాబాద్: నగరంలోని చార్మినార్ సమీపంలో కాల్పుల కలకలం చెలరేగింది. నగల వ్యాపారి ఇంట్లో చొరబడిన దుండగులు కాల్పులు జరిపినట్లుగా సమాచారం. 10 నుంచి 15 మంది యువకులు మోటారు బైకులు, కారులో అక్కడకు వచ్చి ఖార్కానాలో పనిచేస్తున్న కార్మికులను తుపాకులతో బెదిరించి..గాలిలోకి కాల్పులు జరిపి... 5 కిలోల బంగారు ఆభరణాలు దోచుకుని పారిపోయారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

03/06/2018 - 16:28

అమరావతి: విభజన చట్టంలోని అంశాలన్నింటినీ అమలు చేయాల్సిందేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీఎల్పీ సమావేశం ముగిసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. బిజెపితో కలిసి ఉంటే రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని భావించామని తెలిపారు. ఢిల్లీలో ఏపీ ఎంపీలంతా గట్టిగా పోరాడుతున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. రెండు జాతీయ పార్టీలు ప్రజలను పట్టించుకోవటం లేదని ఆయన విమర్శించారు.

03/06/2018 - 16:26

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఏమి చేయాలో అది చేస్తుందని, ప్రత్యేక హోదా పొడిగింపు ఏ రాష్ట్రానికి జరుగలేదని శాసనసభలో బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టంలో లేనివి కూడా కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిందన అన్నారు. హోదా వస్తే ఏదో జరిగిపోతుందని చెప్పటం సరికాదని అన్నారు.

03/06/2018 - 16:24

అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తిలేదని, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయమని కోరుతున్నాం అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. విభజన చట్టంలో ఏమైతే ఉన్నాయో వాటిని మాత్రమే అమలు చేయాలని కోరుతున్నాం అని అన్నారు. బిజెపి నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. మిత్రపక్షం కాబట్టి సమ్యయమనంతో మాట్లాడుతున్నా అని అన్నారు.

03/06/2018 - 12:54

అమరావతి: విశాఖపట్నంలో టీడీపీ నిన్న జరిపిన ఆందోళనపై టీడీపీ, బిజెపి పార్టీలు అసెంబీ మీడియా పాయింట్ వద్ద మాటల యుద్ధం ఆరంభించాయి. ఎంగిలి కాఫీలు తాగే అలవాటు బిజెపికి లేదు. అరకు కాఫీని గతంలో విద్యాసాగర్‌రావు అభివృద్ధిచేశారు. బిజెపిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. రౌడీలను తెచ్చి టీడీపీ ఆందోళను చేయిస్తున్నది. గాలేరు-నగరి పూర్తిచేయనందుకు సిఎం మెడలు ఎవరు వంచాలి అని సోము వీర్రాజు ప్రశ్నించారు.

Pages