S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/04/2018 - 02:00

హైదరాబాద్, మార్చి 3: ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు స్వచ్చంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. శనివారం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన టోమో థెరపీ వైద్య సేవలను ఆసుపత్రి సీఇఓ, ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి ప్రారంభించారు. క్యాన్సర్ రోగులకు బసవతారకం ఆసుపత్రి అందిస్తున్న సేవలు అద్బుతమని కొనియాడారు.

03/04/2018 - 01:57

అమరావతి, మార్చి 3: దేశం నివ్వెరపోయేలా, తిరుగులేని కమ్యూనిస్టుల కోట బద్దలయ్యేలా వెల్లడయిన త్రిపుర, నాగాలాండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమల వికాసానికి ఓ తెలుగు వ్యక్తి కారకులయ్యారు. అసలు అక్కడ ఒక్క కౌన్సిలర్ కూడా లేని తన పార్టీని, ఏకంగా అధికారంలోకి తీసుకువచ్చే స్థాయిలో వ్యూహరచన చేసిన ఆ తెలుగు నేత ఇప్పుడు పార్టీలో ట్రబుల్‌షూటర్ అవతారమెత్తారు.

03/04/2018 - 01:55

మారేడుమిల్లి, మార్చి 3: తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం లోతట్టు ఎగువ ప్రాంతమైన వైరామవరం మండలం కానివాడ పంచాయతీ పరిధిలోని మూడు గ్రామాల్లో ఎనిమిది మంది గిరిజనులు తీవ్రజ్వరంతో మృత్యువాత పడ్డ సంఘటన అలస్యంగా వెలుగులోనికి వచ్చింది. శనివారం ఈ సంఘటన సమాచారం అందిన వెంటనే రంపచోడవరం శాసనసభ్యురాలు వంతల రాజేశ్వరి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.

03/04/2018 - 01:53

హైదరాబాద్, మార్చి 3: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన నాటకాలు ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చాయని ఏపీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్ర రావు అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన బహిరంగ లేఖను శనివారం విలేఖరుల సమావేశంలో విడుదల చేశారు.

03/04/2018 - 01:00

హైదరాబాద్, మార్చి 3: రాష్ట్ర విభజన చట్టం అమలు నేపథ్యంలో ఏపీకి రావాల్సిన నిధుల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు విరుద్ధంగా ఉన్నాయని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా కేంద్రం కేటాయించిన నిధుల అంశంపై ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ సంయుక్త కమిటీ నివేదికను ప్రజల ముందుంచిన సందర్భంగా ఆయన, మిగిలిన స్టీరింగ్ కమిటీ సభ్యులతో కలిసి మాట్లాడారు.

03/04/2018 - 00:55

ఒంగోలు, మార్చి 3: ప్రత్యేక హోదా కోసం పోరాటం క్లైమాక్స్ చేరుకుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఈనెల 5న ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం ధర్నా చేస్తున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గాల సమన్వయకర్తలకు జగన్ దిశానిర్ధేశం చేశారు.

03/04/2018 - 00:53

ఖమ్మం, మార్చి 3: తెలంగాణ- చత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్ నుండి మావో అగ్రనేతలు సహహా అనేకమంది తప్పించుకున్నారనే సమాచారంతో పోలీసులు అడవిని గాలిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 10మందిలో ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. మిగిలిన వారంతా చత్తీస్‌గఢ్ రాష్టవ్రాసులే.

03/04/2018 - 00:51

హైదరాబాద్, మార్చి 3: రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశంపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీయాలంటూ తమ పార్టీ ఎంపీలకూ సూచించామన్నారు.

03/04/2018 - 00:50

హైదరాబాద్, మార్చి 3: భారతదేశ రాజకీయాల్లో మార్పుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, అవసరమైతే థర్డ్‌ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తానని తెలంగాణ సీఎం కే చంద్రశేఖరరావు ప్రకటించారు. ప్రగతిభవన్‌లో శనివారం తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. దేశాన్ని శాస్ర్తియంగా అభివృద్ధి మార్గాన నడిపించడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు.

03/03/2018 - 17:42

హైదరాబాద్: ప్రత్యేక ప్యాకేజీ అంటే పాచిపోయిన లడ్డూలతో సమానమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన శనివారంనాడు ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ఒకర్ని తప్పు పట్టాలనే ఉద్దేశం లేదు. అనుభవజ్ఞులు కాబట్టి ఆనాడు

Pages