S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/27/2017 - 01:50

హైదరాబాద్, సెప్టెంబర్ 26: కార్మిక, ఫ్యాక్టరీల శాఖలో వివిధ క్యాటగిరికి చెందిన 247 పోస్టుల డైరెక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి ఎన్ శివశంకర్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.

09/27/2017 - 01:49

హైదరాబాద్, సెప్టెంబర్ 26: పార్లమెంట్ సభ్యుల అభివృద్ధి నిధులు (ఎంపి లాడ్స్) ఇకనుంచి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు. ఈమేరకు కేంద్రం గత 18న మార్గదర్శకాలు జారీ చేసింది. ఎంపి లాడ్స్ నుంచి ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం నిధులు తప్పనిసరిగా ఖర్చు చేయాలన్న నిబంధనను విధించింది.

09/27/2017 - 01:47

జనగామ టౌన్, సెప్టెంబర్ 26: జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మోని (బతుకమ్మ) కుంటలో చేపడుతున్న అభివృద్ధి పనులు వివాదంగా మారుతున్నాయి. పురాతన కాలం నాటి కుంటకు సంబంధించిన విలువైన భూమిని ఆక్రమణకు గురికాకుండా మరమతు చేసి జిల్లా కేంద్రానికి ల్యాండ్‌మార్క్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుండగా తనపై అభాండాలు వేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అంటున్నారు.

09/27/2017 - 01:45

హైదరాబాద్, సెప్టెంబర్ 26: తెలంగాణ ఆడపడచులు ఆనందంగా, ఆహ్లాదంగా జరుపుకునే బతుకమ్మ పండగకు మంగళవారం ఎల్‌బి స్టేడియంలో సరికొత్త సొబగు చేకూరింది. రెండేళ్లుగా నిర్వహిస్తున్న ‘మహాబతుకమ్మ’ కొనసాగింపుగా ముచ్చటగా మూడోపర్యాయం మహాబతుకమ్మ నిర్వహించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల నుండి వచ్చిన దాదాపు 30 వేల మంది మహిళలు పాల్గొన్నారు.

09/27/2017 - 01:25

హైదరాబాద్, సెప్టెంబర్ 26: ప్రస్తుతం జాతీయస్థాయిలో పార్లమెంటుతో సహా అన్ని రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఏప్రిల్ 1నుంచి మార్చి 31 వరకు ఆర్ధిక సంవత్సరం విధానానే్న కొనసాగించాలని కేంద్ర ఆర్ధిక శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిన సమాచారంలో సూచించింది. ఆర్థిక సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉండాలని కొద్దికాలం క్రితం కేంద్రం ప్రతిపాదించటం తెలిసిందే.

09/27/2017 - 01:23

తిరుపతి, సెప్టెంబర్ 26: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యతవున్న వాహనసేవే గరుడ వాహన సేవ. ఈనెల 23న ధ్వజారోహణంతో ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. అయితే స్వామివారికే అత్యంత్ర ప్రీతిపాత్రమైన గరుడ సేవ రోజున మాత్రం ఈ సంఖ్య లక్షల్లో ఉంటుంది.

09/27/2017 - 02:17

విజయవాడ, సెప్టెంబర్ 26: రాష్ట్రంలో అక్టోబర్ 2న ప్రపంచ ఆవాస దినం, గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన లక్ష ఇళ్లను ప్రారంభోత్సవం చేయనున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు వెల్లడించారు.

09/27/2017 - 01:20

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 26: ఆంధ్ర, ఒడిశా బోర్డర్ (ఎఒబి)ను ఆనుకుని ఉన్న మూడు జిల్లాలను అనుసంధానిస్తూ కేంద్రం కొత్తగా ఒక జాతీయ రహదారిని మంజూరుచేసింది. ఈ రోడ్డు తూర్పు గోదావరి జిల్లా మన్యం ప్రాంతంలో తొలి జాతీయ రహదారి కావడం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ రహదారి నిర్మాణం వల్ల మన్య ప్రాంతానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు అనుసంధానమవుతాయి.

09/26/2017 - 03:44

తిరుపతి, సెప్టెంబర్ 25: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి జరుగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడవరోజైన సోమవారం ఉదయం 9గంటలకు సింహ వాహనంపై స్వామివారు యోగ నరసింహావతారంలో మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు.

09/26/2017 - 03:13

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో వచ్చే 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది. బంగాళాఖాతంలో తుపాను ద్రోణి ఏర్పడి ఉండటంతో వాతావరణంలో మార్పు వచ్చింది. దీని ప్రభావం వల్ల వచ్చే 24 గంటల్లో చాలాప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

Pages