S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/29/2018 - 02:17

పరకాల, జనవరి 28: 2019లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలో పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఇనగాల వెంకట్రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెరాస, వివిధ పార్టీల నుండి 2వేల మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.

01/29/2018 - 02:13

హైదరాబాద్, జనవరి 28: తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టడానికి యుఏఇకి చెందిన రెండు బహుళ జాతి కంపెనీలు ముందుకు వచ్చాయి. వైద్యరంగంలో రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు (యుఏఇ) చెందిన డాక్టర్ బిఆర్ శెట్టీస్ గ్రూప్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.2500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి లూలు గ్రూప్ కంపెనీలు ముందుకు వచ్చాయి.

01/29/2018 - 02:11

ఏపీని పోలియోరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే మహా సంకల్పంతో క్రమం తప్పకుండా పల్స్‌పోలియో నిర్వహిస్తున్నట్టు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం ఓ చిన్నారికి పోలియో చుక్కల మందువేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

01/29/2018 - 02:06

భీమవరం, జనవరి 28: గలగలలాడే గోదావరి.. కళకళలాడే వరి చేలు, కోనసీమ కొబ్బరి చెట్లతో నిత్యం సాగు హడావుడి కనిపించే గోదావరి జిల్లాలు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. హరిత విప్లవానికి, నీలి విప్లవానికి పేరొందిన ఉభయ గోదావరి జిల్లాలు రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.

01/29/2018 - 02:04

విజయవాడ (క్రైం), జనవరి 28: నకిలీ ధృవీకరణ పత్రాలతో కోట్ల రూపాయల విలువైన భూమిని కాజేయాలనే కుట్ర విజయవాడ కేంద్రంగా సీఐడీ విచారణలో వెలుగుచూసింది. ఓ స్వాతంత్య్ర సమరయోధునికి చెందిన భూమిని కైవసం చేసుకునేందుకు అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అనుచరుడు, 47వ డివిజన్ కార్పొరేటర్ గండు మహేష్ చక్రం తిప్పాడు. భూమిని ఎమ్మెల్యే భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం.

01/29/2018 - 01:34

విజయవాడ (క్రైం), జనవరి 28: ఆంధ్రప్రదేశ్ కస్టమ్స్ విభాగంలో విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనపరిచిన కస్టమ్స్ సూపరింటెండెంట్ నందిపాటి శ్రీనివాస్‌కు ప్రతిష్ఠాత్మకమైన ‘కస్టమ్స్ మెరిట్ సర్ట్ఫికెట్’ లభించింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలో 33 స్మగ్లింగ్ కేసులను ఛేదించినందుకు ఏపి కస్టమ్స్ కమిషనర్ కోక సుధ ఈ పురస్కారానికి శ్రీనివాస్‌ను ఎంపిక చేశారు.

01/29/2018 - 01:32

హైదరాబాద్, జనవరి 28: దేశంలో మతవిద్వేషాలు, వర్గాలపోరు ప్రేరేపించడం, అశ్లీల సాహిత్యాన్ని ప్రచారం చేసే సామాజిక మాధ్యమాలపై కేంద్ర హోంశాఖ వేటు వేస్తోంది. అభ్యంతరమైన రాతలను సామాజిక మాధ్యమాలపై ప్రచారం చేసే 1329 యుఆర్‌ఎల్ (యూనిఫైడ్ రిసోర్చ్ లోకేషన్)లను కేంద్రం 2017 సంవత్సరంలో బ్లాక్ చేసింది. 2016లో ఈ తరహా 964 సామాజిక మాధ్యమాలపై కొరడా ఝుళిపించింది.

01/29/2018 - 01:05

హైదరాబాద్, జనవరి 28: కృష్ణా బోర్డు విస్తరించనుంది. ఆంధ్ర, తెలంగాణలోని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనలకు వేగం పెంచింది. వీటిపై నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో రెండు రాష్ట్రాల అధికారులతో చర్చించేందుకు వర్తమానం పంపింది. ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే కృష్ణా బోర్డు విస్తరిస్తోం ది.

01/29/2018 - 01:03

విజయవాడ, జనవరి 28: సూర్యారాధన ఒక మతానికి సంబంధించింది కాదని, సైంటిఫిక్ అంశమని సీఎం చంద్రబాబు అన్నారు. కులమతాలకు అతీతంగా సూర్యారాధన కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన సూర్యారాధనకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చరిత్రలో తొలిసారి ప్రభుత్వం తరపున ప్రకృతిని ఆరాధించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.

01/28/2018 - 03:56

హైదరాబాద్, జనవరి 27: పెద్దనోట్లు రద్దయి ఏడాది గడచిపోయినా ఇంకా వాటిని చలామణి చేసేందుకు కొన్ని ముఠాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రయత్నంలో పోలీసులకు కొందరు చిక్కుతున్నారు. హైదరాబాద్ దక్షిణ మండలం పోలీసు పరిధిలోని బహదూర్‌పురా పోలీసులు ఏకంగా 2.53 కోట్ల రద్దయిన పెద్దనోట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Pages