S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/20/2018 - 01:45

అమరావతి, జనవరి 19: పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ 25 శాతం నుంచి 30 శాతం వరకు వెనుకబడి ఉందని, అందరితో సమాన స్థాయికి చేరేవరకు ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రానికి న్యాయం జరగని పక్షంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వెనుకాడేది లేదని చెప్పారు.

01/19/2018 - 03:53

హైదరాబాద్, జనవరి 18: అధిక రద్దీని నివారించేందుకు గాను దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 20, 21 తేదీల్లో కాకినాడ నుంచి సికింద్రాబాద్ వరకు రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 20న కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ వరకు నెం.07002 ప్రత్యే క రైలు బయలుదేరుతుండగా, ఈ నెల 21న 07004 ప్రత్యేక రైలు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరుతుందని రైల్వే వెల్లడించింది.

01/19/2018 - 03:39

తిరుపతి, జనవరి 18: రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 24న తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందులో భాగంగా ఉదయం విఐపి బ్రేక్ దర్శనాలు, చంటిపిల్లల తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు, దివ్యాంగులకు, దాతలకు, మిలటరీ, ఎన్‌ఆర్‌ఐలకు సుపథం మార్గంలో కల్పించే ప్రత్యేక దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది.

01/19/2018 - 03:28

విజయవాడ, జనవరి 18: మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు సతీసమేతంగా గురువారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో, పూర్ణకుంభంతో వేదవాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ విద్యాసాగరరావు సతీమణి వినోదిని, కుమార్తె రజనిలతో కలిసి కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు.

01/19/2018 - 02:54

హైదరాబాద్, జనవరి 18: అనంతపురం జిల్లా పుట్టపర్తి పోలీసు స్టేషన్‌లో శ్రీ సత్యసాయి ట్రస్టీగా ఉన్న రత్నాకర్‌పై నమోదై ఉన్న కేసును మళ్లీ విచారించాలని హైదరాబాద్ హైకోర్టు గురువారం ఏపి సిఐడి శాఖను ఆదేశించింది. దివంగత సత్యసాయిబాబు బంధువు ఎం గణపతి రాజు దాఖల దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి బి శివశంకర్ రావు విచారించారు.

01/19/2018 - 02:53

హైదరాబాద్, జనవరి 18: అగ్రి గోల్డ్‌ను స్వాధీనం చేసుకోవడంపై స్టేటస్ రిపోర్టును ఇవ్వాలని హైకోర్టు గురువారం ఎస్సెల్ జీ గ్రూప్ సుభాష్ చంద్ర ఫౌండేషన్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం జారీ చేసింది. ఈ కేసును జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. అగ్రిగోల్డ్‌ను టేకోవర్ చేసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

01/19/2018 - 01:42

హైదరాబాద్, జనవరి 18: తెలంగాణలో టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు గురువారం చేసిన వ్యాఖ్య లు పార్టీలో కలకలం సృష్టించాయి.

01/19/2018 - 01:39

హైదరాబాద్, జనవరి 18: ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రెండో రోజు జపాన్‌లో పర్యటన కొనసాగింది. ఈ సందర్భంగా సుజుకి మోటార్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒసాము సుజికితో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఆటోమొబైల్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానాన్ని (టిఎస్-ఐపాస్) కేటీఆర్ వివరించగా సుజుకి ప్రశంసించారు.

01/19/2018 - 01:37

హైదరాబాద్, జనవరి 18: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏన్డీయే, యూపీఏ సహా ఎవరితో జతకట్టమని ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ‘మా అంతకు మేము ఉంటాం, మా అవసరం ఎవరికి అవసరమో వారొచ్చి అడిగితే అప్పుడు ఆలోచిస్తాం’అని తెలిపారు. హైదరాబాద్‌లో గురువారం ఇండియా టుడే నిర్వహించిన సౌత్ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూ చేసారు.

01/19/2018 - 01:32

అమరావతి, జనవరి 18: రియల్‌టైమ్ గవర్నెన్స్, దాని పనితీరును చూస్తుంటే తాను భారత్‌లో ఉన్నట్లు అనిపించలేదని, ఇది అద్భుతం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన అనిర్వచనీయమైన విజయమని కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్ ప్రశంసించారు. వెలగపూడిలోని సచివాలయంలో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (ఆర్టీజీసీ)ను గురువారం ఆయన బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఈ కేంద్రం ఎలా పనిచేస్తున్నది.

Pages