S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/24/2018 - 23:57

హైదరాబాద్, జనవరి 24: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ తొందరపాటు నిర్ణయాలు చివరికి కొంపముంచుతున్నాయి. మాటమీద నిలబడలేక ప్రభుత్వానికి అపఖ్యాతి తెస్తున్నాయి. ముందూ వెనుక ఆలోచించకుండా అధికారుల నిర్ణయాలు ముందుకువెళ్తే నుయ్య, వెనక్కు వస్తే గొయ్య అన్న చందంగా తయారవుతున్నాయి. గత మూడేళ్లుగా ఏదో చేయాలనే తపన సత్ఫలితాలు ఇవ్వకముందే రివర్స్ అవుతున్నాయి.

01/24/2018 - 23:56

హైదరాబాద్, జనవరి 24: అవినీతి, అక్రమాలపై పోరాటం చేస్తామన్న సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదని ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు విమర్శించారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అవినీతి కనిపించలేదా? అని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో పవన్‌ను ప్రశ్నించారు. అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టుకు పేరు మార్చి రూ.50 కోట్ల అక్రమాలకు పాల్పడడం కనిపించ లేదా?

01/24/2018 - 23:55

హైదరాబాద్, జనవరి 24: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన పతకాల్లో తెలంగాణ పోలీస్‌కు 21 పతకాలు లభించాయి. వీరిలో ఇద్దరికి రాష్టప్రతి పోలీసు పతకాలు, ఆరుగురికి గ్యాలంటరీ పోలీసు పతకాలు, 13 మందికి ఉత్తమ సేవాపతకాలు వచ్చాయి. ఆర్‌బివిఆర్‌ఆర్ తెలంగాణ పోలీసు అకాడమి డైరక్టర్ జితేందర్, హైదరాబాద్‌లో పని చేస్తున్న డిఎస్‌పి నరేందర్ నారాయణలకు రాష్టప్రతి విశిష్ట సేవా పతకాలు లభించాయి.

01/24/2018 - 23:55

హైదరాబాద్, జనవరి 24: గురుకుల టీచర్ల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ధృవపత్రాల పరిశీలన పూర్తయి నెలన్నర రోజులు గడిచినా ఇంత వరకూ తుది ఫలితాలను ప్రకటించకపోవడంపై అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

01/24/2018 - 23:54

హైదరాబాద్, జనవరి 24: రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతున్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. టిఆర్‌ఎస్ రాచరిక పాలనకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు సాగించేందుకు లౌకిక, ప్రజాస్వామ విశాల వేదికకు త్వరలో అంకురార్పణ జరగనున్నదని ఆయన తెలిపారు.

01/24/2018 - 23:54

హైదరాబాద్, జనవరి 24: పార్టీ వీడి ఇతర పార్టీల్లోకి ఫిరాయించిన వారిని చూస్తుంటే జాలి వేస్తున్నదని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అనేది ఫిరాయింపుదారులకు వర్తిస్తుందని ఆయన తెలిపారు. పార్టీ కార్యాలయం (ఎన్టీఆర్ భవన్)లో నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల్లో భాగంగా బుధవారం 4వ బ్యాచ్ శిక్షణా తరగతులు ముగిసాయి.

01/24/2018 - 23:53

హైదరాబాద్, జనవరి 24: డేటింగ్ పేరుతో చక్కగా మాట్లాడి లక్షలు లాగేసే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి నగరానికి చెందిన అభిషేక్ అనే అనే యువకుడు రూ.4.08 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆన్‌లైన్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసే క్రమంలో ఇంటర్నెట్‌లో దర్శనమిచ్చిన ఒక వెబ్‌సైట్‌ను సందర్శించగా డేటింగ్ కోసం సభ్యత్వం స్వీకరించవచ్చనని ఉండడంతో తన పేరు మొబైల్ నెంబర్ నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ నెంబర్‌కు ఒక కాల్ వచ్చింది.

01/24/2018 - 23:52

హైదరాబాద్, జనవరి 24: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి సీకే మిశ్రా పేర్కొన్నారు. తెలంగాణలో అధికారిక పర్యటనకోసం వచ్చిన మిశ్రా బుధవారం సిద్ధిపేట సమీపంలోలోని కోమటిబండ పక్కనే ఉన్న అవెన్యూ ప్లాంటేషన్‌ను చూశారు. ఈ ప్లాంటేషన్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు.

01/24/2018 - 03:52

సిద్దిపేట, జనవరి 23 : జేఏసీలో ఎలాంటి రాజకీయ పార్టీలకు చోటు లేదని.. ప్రజాసంఘాలకు మాత్రమే స్థానం ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. మంగళవారం టీజేఏసీ చైర్మన్ మంచిర్యాల సదస్సుకు వెళ్తూ మార్గమధ్యలో సిద్దిపేట రంగధాంపల్లి జిల్లా ఫోరం నేతలు ఘన స్వాగతం పలికారు. సిద్దిపేట జిల్లా ఆరవ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు.

01/24/2018 - 03:50

హైదరాబాద్, జనవరి 23: నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యే మహానగరవాసులకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 30కిలోమీటర్ల మెట్రో కారిడార్‌లో ఫీడర్ సర్వీసులను మెరుగుపర్చాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్‌పీ సింగ్ ఆదేశించారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ మంగళవారం మెట్రో, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

Pages