S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/25/2018 - 00:37

సిద్దిపేట, జనవరి 24: రిజర్వాయర్ ఆయకట్టు రైతు లు ఎంతసంతోషంగా ఉంటారో అంతకంటే ఎక్కువగా భూ నిర్వాసితులను సంతోషంగా ఉంచేందుకు కృషిచేస్తానని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.

01/25/2018 - 00:36

న్యూఢిల్లీ,జనవరి 24:ఆంధ్రప్రదేశ్‌లో కాపు, తెలగా,బలిజ,ఒంటరి కులాలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రానికి పంపిణ బిల్లుపై కేంద్రహోంశాఖలో కదలిక మొదలైనది.కాపు రిజర్వేషన్లను రాజ్యాంగలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో పొందుపరచాలని కొరతూ శాసన సభలో పాస్ చేసిన బిల్లును కేంద్ర హోం మంత్రిత్వాశాఖకు ఏపీ ప్రభు త్వం పం పించింది.ఇటివల ఈ బిల్లు చేరుకొవడంతో దీనిపై న్యాయశాఖ,సామాజిక సాధికారికశాఖ,సిబ్బంది వ్యవహారలశాఖల

01/25/2018 - 00:35

గజ్వేల్, జనవరి 24: మిషన్ భగీరథ పథకం దేశంలోనే అద్భుతమైన పథకాల్లో మొదటి స్థానం దక్కించుకుంటుందని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, ఢిల్లీ సర్కార్ చీఫ్ సెక్రెటరీ సీకే మిశ్రా తెలంగాణ రాష్ట్ర సర్కార్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిదిలోని కోమటిబండలో బుధవారం మిషన్‌భగీరథ ప్రాజెక్టు ను ఆయన పరిశీలించారు.

01/25/2018 - 00:27

ఖమ్మం, జనవరి 24: రాజకీయాల్లో మార్పు కోసమే జనసేన పార్టీని స్థాపించామని, ప్రజాసమస్యలపై ఎవరినైనా నిలదీస్తూ బాధ్యతతో కూడిన రాజకీయం చేస్తానని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం ఖమ్మంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పార్టీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మానవత్వంతో కూడిన రాజకీయాలు తన అభిమతమని చెప్పారు.

01/25/2018 - 00:12

హైదరాబాద్, జనవరి 24: హైదరాబాద్‌లో ఉన్న నోవార్టిస్ కంపెనీ ల్యాబోరేటరీ విస్తరణ, సిబ్బంది రెట్టింపు చేయడానికి అంగీకరించింది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం, నోవార్టిస్ సంస్థకు మధ్య ఒప్పందం కుదిరింది. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన ఐటీ, పరిశ్రమల మంత్రి కె తారకరామారావు బుధవారం అక్కడ నోవార్టిస్ కంపెనీ పబ్లిక్ పాలసీ హెడ్ పెట్రా లక్స్‌తో సమావేశమయ్యారు.

01/25/2018 - 00:07

హైదరాబాద్, జనవరి 24: వచ్చే ఎన్నికల బడ్జెట్ కెసిఆర్ కలలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ఆర్థిక శాఖ రూపొందిస్తోంది. వచ్చే బడ్జెట్‌లో వ్యవసాయం, సంబంధించిన రంగాలు, సాగునీటిపారుదల, విద్యుత్ రంగం కలిపి మొత్తం రూ.50 వేల కోట్ల నిధులను బడ్జెట్‌లో కేటాయించాలనేప్రతిపాదనలు ఆర్థిక శాఖకు చేరుకున్నాయి.

01/24/2018 - 23:59

హైదరాబాద్, జనవరి 24: గతంతో పోలిస్తే టిఎస్‌ఆర్టీసిలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి అన్నారు. సంస్థ అధికారులు రోడ్డు భద్రతపై తీసుకుంటున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు.

01/24/2018 - 23:58

హైదరాబాద్, జనవరి 24: తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, వంతెనల అభివృద్ధికి రెండో దశ ప్రాజెక్టులో భాగంగా రూ.100 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఈ నిధులతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, వంతెనల నిర్మాణానికి వినియోగించాల్సి ఉం టుంది. అయితే ఈ పనుల్లో కేంద్రం 60 శాతం ఖర్చు భరిస్తుంది, మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా భరించాల్సి ఉంది.

01/24/2018 - 23:58

హైదరాబాద్, జనవరి 24: లైంగిక వేధింపుల కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న గాయకుడు గజల్ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఈ కేసులో అరెస్టు కాకుండా తప్పించుకుతిరుగుతున్న రెండో నిందితురాలు పార్వతి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ చేపట్టి బెయిల్ మంజూరు చేసింది.

01/24/2018 - 23:57

హైదరాబాద్, జనవరి 24: బతుకమ్మ పండుగ సందర్భంగా ఎల్‌బి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొనడానికి వచ్చి ప్రమాదవశాత్తూ మృతి చెందిన సృజన కుటుంబానికి రూ. 10 లక్షల సహాయాన్ని సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ బుధవారం అందజేసారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షలు, తెలంగాణ జాగృతి సంస్థ తరఫున మరో రూ. 5 లక్షలు కలిపి మొత్తంగా రూ.

Pages