S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/22/2017 - 04:38

హైదరాబాద్, డిసెంబర్ 21: ఎస్సీ వర్గీకరణకు ప్రజా ప్రతినిధులతో కూడిన బృందాన్ని ప్రభుత్వం తక్షణమే ఢిల్లీకి తీసుకువెళ్లాలని బిజెపి శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

12/22/2017 - 04:38

హైదరాబాద్, డిసెంబర్ 21: జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనగర్జన సభ అట్టర్ ప్లాప్ అయిందని, ప్రజలు కాంగ్రెస్‌ను పట్టించుకోవడం లేదని తేలిపోయిందని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి విమర్శించారు.

12/22/2017 - 04:37

హైదరాబాద్, డిసెంబర్ 21: తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా అరుదైన, క్లిష్టమైన కణితికి రోబోటిక్ శస్తచ్రికిత్స నిర్వహించినట్లు అపోలో క్యాన్సర్ వైద్య సంస్థ తెలిపింది. డాక్టర్ హేమంత్ ఉదయరాజు, డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి నేతృత్వలోని వైద్య బృందం 30 ఏళ్ల వయస్సు కలిగిన యువకునికి అర్టో క్యావల్ పారాగాంగ్లియోమా అనే అరుదైన కణితిని నాలుగు గంటలకు పైగా శ్రమించి క్లిష్టమైన రోబోటిక్ శస్తచ్రికిత్సను నిర్వహించారు.

12/22/2017 - 04:36

హైదరాబాద్, డిసెంబర్ 21: హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో రిమాండ్‌గా ఉన్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను గురువారం తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం కలిశారు. ఎస్సీ వర్గీకరణలో జాప్యాన్ని నిరసిస్తూ ఇటీవల ట్యాంక్‌బండ్‌పై ఆందోళనకు దిగిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

12/22/2017 - 04:36

హైదరాబాద్, డిసెంబర్ 21: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులును నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఎస్సీ వర్గీకరణలో జాప్యాన్ని నిరసిస్తూ మోత్కుపల్లి ట్యాంక్ బండ్‌పై గల అంబేద్కర్ విగ్రహం వద్ద వౌనదీక్షకు దిగారు. దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అతణ్ని అరెస్టు చేసి రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

12/22/2017 - 04:18

హైదరాబాద్, డిసెంబర్ 21: తుపాకులగూడెం బ్యారేజి నుంచి జనవరిలో దేవాదులకు నీటిని ఎత్తిపోయడానికి బ్యారేజి పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు ఆదేశించారు. బ్యారేజి నిర్మాణ వర్కింగ్ ఏజెన్సీలు ఇక నుంచి మూడు షిప్ట్‌లలో పని చేయాలని మంత్రి సూచించారు.

12/22/2017 - 04:14

హైదరాబాద్, డిసెంబర్ 21: రాష్ట్రానికి మరిన్ని మెగా ప్రాజెక్టులు రానున్నాయని మంత్రివర్గ ఉప సంఘం వెల్లడించింది. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా రాయితీలు, ప్రోత్సహకాలను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం వల్లనే మెగా ప్రాజెక్టులు స్థాపించడానికి ఆసక్తి కనబరుస్తున్నారని అభిప్రాయపడింది. పరిశ్రమలశాఖ మంత్రి కె తారకరామారావు అధ్యక్షతన గురువారం మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది.

12/22/2017 - 04:13

హైదరాబాద్, డిసెంబర్ 21: వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం సూపరింటెండెంట్ ఇంట్లో గురువారం నాడు అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆలయ సూపరింటెండెంట్ నామాల రాజేందర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. రూ. 2.42 కోట్ల రూపాయల మేరకు అక్రమ ఆస్తులను గుర్తించారు. అయితే, వీటి విలువ మార్కెట్ విలువ ప్రకారం రూ.

12/22/2017 - 00:39

హైదరాబాద్, డిసెంబర్ 21: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16 ఎంపిటిసి స్థానాలకు 2018 జనవరి 11 న పోలింగ్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

12/22/2017 - 00:38

హైదరాబాద్, డిసెంబర్ 21: ప్రణాళికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న బిపి ఆచార్యను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేసారు. ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణారావుకు అప్పగించినట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Pages