S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/21/2017 - 01:50

హైదరాబాద్, డిసెంబర్ 20: మహిళ భద్రతకు తెలంగాణ పోలీస్ మరో కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. ఇంతకుముందే మహిళల రక్షణకు షీ టీమ్స్, భరోసా వంటి వాటివి ఉన్నప్పటికీ కొత్తగా ఏర్పాటు చేసిన సర్వీసుతో మహిళలకు మరింత భద్రత ఉంటుందని పోలీసులు తెలిపారు. మహిళలు ప్రయాణించే కారు, క్యాబ్, ఆటో నంబర్‌ను 9969777888కు ఎస్‌ఎంఎస్ చేస్తే, వెంటనే మరో ఎస్‌ఎంఎస్ వస్తుంది..

12/21/2017 - 01:50

హైదరాబాద్, డిసెంబర్ 20: నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, నేడు వైఎస్ జగన్ అంటే టిడిపికి వెన్నులో వణుకు పుడుతోందని వైఎస్‌ఆర్‌సిపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా తాము అదిరేది, బెదిరేది లేదని అన్నారు. బుధవారం నాడిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ నేతృత్వంలో రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉందని అన్నారు.

12/21/2017 - 01:49

నగరంలో రెండురోజులపాటు జరిగిన యూనియన్ ద్వితీయ మహాసభల్లో తీర్మానం చేసినట్టు వారు తెలిపారు. టీఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ ఎంతో క్రమశిక్షణ కలిగిందని, సంస్థ అభివృద్ధికే పాటుపడుతుందన్నారు. బుధవారం మహాసభల ముగింపు సందర్భంగా పలు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు.

12/21/2017 - 01:48

/దిల్‌సుఖ్‌నగర్, డిసెంబర్ 20: నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి తీసుకువచ్చి నగరంలో శిశువులను విక్రయిస్తున్న ముఠాను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. బాలల హక్కుల సంఘం అధికారులు, రాచకొండ ఎస్‌వోటీ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో ఆరుగురు ముఠా సభ్యులు పట్టుబడ్డారు. మరో ఇద్దరు పరార్ కాగా, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

12/21/2017 - 01:48

హైదరాబాద్, డిసెంబర్ 20: వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కోరుతూ జనవరి 6న ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణలో 2 గ్రేటర్ కార్పొరేషన్లు, 43 మున్సిపాలిటీలు, 22 నగర పంచాయతీల్లో 45 వేల మంది కాంట్రాక్ట్ పద్దతుల్లో పని చేస్తున్నారని యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కమర్ అలీ, పాలడుగు భాస్కర్‌లు తెలిపారు.

12/21/2017 - 00:38

హైదరాబాద్, డిసెంబర్ 20: క్రిస్మస్ పండుగ సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిజాం కాలేజీ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున విందు ఏర్పాటు చేసినట్టు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఈ విందుకు సీఎం హాజరవుతారని చెప్పారు. క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం రూ. 15 కోట్లు కేటాయించిందని తెలిపారు. నిజాం కాలేజీ మైదానంలో విందు ఏర్పాట్లను బుధవారం ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు.

12/21/2017 - 00:37

హైదరాబాద్, డిసెంబర్ 20: పిల్లలు చిన్నతనం నుండి సానుకూల దృక్పథం అలవరచుకోవాలని భారత రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్ ఉద్బోధించారు. బుధవారం నాడు సోమాజీగూడలోని రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలను రాష్టప్రతి సందర్శించారు. రాష్టప్రతి వెంట గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి , విద్యాశాఖ సీనియర్ అధికారులు ఉన్నారు.

12/21/2017 - 00:37

మహబూబ్‌నగర్, డిసెంబర్ 20: దేశంలో రాహుల్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయయాత్ర ప్రారంభమైందని, ఇందుకు ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల ఫలితాలే నిదర్శమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రాంచందర్ కుంతియా అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనగర్జన భారీ బహిరంగసభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథులుగా రాంచందర్ కుంతియా హాజరయ్యారు.

12/21/2017 - 00:33

హైదరాబాద్, డిసెంబర్ 20: సుప్రీం కోర్టు అన్ని బాలల సంరక్షణ గృహాలు ఈనెల 31వ తేదీ లోపు తప్పని సరిగా నమోదు చేసుకోవాలని జువైనెల్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్) చట్టం, 2015 సెక్షన్ 41 ప్రకారం..ఆదరణ, సంరక్షణ అవసరమైన బాలల కోసం నడుపుతోన్న సంరక్షణ గృహాలు, అనాథ శరణాలయాలు తప్పని సరిగా చట్టం అమలులోకి వచ్చిన ఆరు నెలల లోపు నమోదు చేసుకోవాలి.

12/21/2017 - 00:32

హైదరాబాద్, డిసెంబర్ 20: ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం అయ్యాయని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. అకాడమీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సభలకు తమ అంచనాలను మించి భాషాభిమానులు వచ్చారని, ఇది తమకు గొప్పబలం చేకూర్చిందన్నారు.

Pages