S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/22/2017 - 00:36

హైదరాబాద్, డిసెంబర్ 21: విద్యుత్ పంపిణీ రంగంలో ప్రతిష్ఠాత్మకమైన సిబిఐపీ అవార్డుకు తెలంగాణ జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు ఎంపికయ్యారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సిబిఐపి) అవార్డుకు ప్రభాకరరావును ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అభినందించారు.

12/22/2017 - 00:35

హైదరాబాద్, డిసెంబర్ 21: వచ్చే నెల 3వ తేదీ నుండి ఉస్మానియా యూనివర్శిటీలో జరగాల్సిన 105వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ నిరవధికంగా వాయిదా పడినట్టు సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ గురువారం నాడు ప్రకటించింది. సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రొఫెసర్ అచ్యుత సామంత వ్యవహరిస్తుండగా, సహ అధ్యక్షుడిగా ఉస్మానియా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం వ్యవహరిస్తున్నారు.

12/22/2017 - 00:35

హైదరాబాద్, డిసెంబర్ 21: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి వణికిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో విపరీతమైన చలి ఉంది. హైదరాబాద్‌తో పాటు, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మెదక్, భద్రాచలం, యాదాద్రి తదితర జిల్లాల్లో సాయంత్రం ఐదు గంటల నుండి ప్రారంభమవుతున్న చలి ఉదయం 9 గంటల వరకు ఉంటోంది.

12/22/2017 - 00:34

హైదరాబాద్, డిసెంబర్ 21: తెలంగాణ కవులు, రచయితలు, కళాకారుల ప్రతిభ ప్రపంచ తెలుగు మహాసభలతో వెలుగులోకి వచ్చిందని రాష్ట్ర సాహితీ అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గురువారం ఇక్కడ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.

12/21/2017 - 01:53

హైదరాబాద్, డిసెంబర్ 20: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకం విజయవంతంగా మూడేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ పథకం గురించి ఎంతో సహకరించిన జర్నలిస్టులను సత్కరించేందుకు అవార్డులను ప్రకటించనున్నట్లు మిషన్ కాకతీయ ఒఎస్‌డి శ్రీధర్‌రావు దేశ్‌పాండే తెలిపారు.

12/21/2017 - 01:53

హైదరాబాద్, డిసెంబర్ 20: సొంత భవనాలు లేక దురవస్థలో తెలుగు యూనివర్శిటీ ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. బుధవారం నాడు ఆయన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు లేఖ రాశారు.

12/21/2017 - 01:53

హైదరాబాద్, డిసెంబర్ 20: ప్రపంచ తెలుగు మహాసభలను అద్భుతంగా నిర్వహించడం మంచి పరిణామమని, తాము స్వాగతిస్తున్నామని టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి అన్నారు. అయితే తెలుగు భాషకు జాతీయ స్థాయిలో ఎంతో ప్రాచుర్యం పొందిన ‘మా తెలుగు తల్లికి’ అనే పాటను, తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రపంచ మహాసభల్లో విస్మరించడం భాధాకరమని అన్నారు.

12/21/2017 - 01:52

హైదరాబాద్, డిసెంబర్ 20: మెదక్, నల్గొండ జిల్లాల్లో ఉన్న తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కార్యాలయాలు, సబ్ స్టేషన్లకు భవనం పైభాగాన సౌరవిద్యుత్ ఉత్పత్తయ్యే యూనిట్లను ఏర్పాటు చేసే ఆర్డర్‌ను హైదరాబాద్‌కి చెందిన ఫ్రేయర్ ఎనర్జీ కంపెనీ దక్కించుకుంది. రూ.3.4 కోట్లతో చేపట్టే ఈ సోలార్ కాంట్రాక్ట్ 12 నెలల్లో పూర్తి చేయాల్సి ఉందని ఫ్రేయర్ ఎనర్జీ సహ వ్యవస్ధాపకుడు సౌరభ్ మర్దా తెలిపారు.

12/21/2017 - 01:51

హైదరాబాద్, డిసెంబర్ 20: రాష్ట్ర వ్యాప్తంగా 2018 జనవరి 1 నుండి ఎరువులను ఇ-పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) మిషన్ల ద్వారా విక్రయించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లాసహకార అధికారులతో బుధవారం ఆయన సచివాలయం నుండి దూరదృశ్య సమీక్షా సమావేశం నిర్వహించారు.

12/21/2017 - 01:51

హైదరాబాద్, డిసెంబర్ 20: ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఎంఆర్‌పిఎస్ నాయకులు ఉసురుపాటి బ్రహ్మయ్య, మంద కుమార్ మాదిగ పిలుపునిచ్చారు.

Pages