S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/19/2017 - 04:08

హైదరాబాద్, డిసెంబర్ 18: అమెరికా కాన్సులెట్ జనరల్ కథెరిన్ బి హడ్డా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్‌రెడ్డితో భేటీ అయ్యారు.

12/19/2017 - 04:06

హైదరాబాద్/సనత్‌నగర్, డిసెంబర్ 18: బాలానగర్ పారిశ్రామిక వాడలో విషాదం చోటుచేసుకుంది. బయోకెమికల్ ఇండస్ట్రీ నుంచి విషవాయువు లీకైంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం కంపెనీలోని డ్రైనేజీని శుభ్రం చేసేందుకు ముగ్గురు కార్మికులు మ్యాన్‌హోల్‌లోకి దిగారు. అయితే అందులోని విషవాయువు కారణంగా ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

12/19/2017 - 04:06

హైదరాబాద్, డిసెంబర్ 18: టిఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఐక్యం కావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా ఈ నెల 20న జడ్చర్లలో ‘జన గర్జన’ పేరిట నిర్వహించనున్న బహిరంగ సభతో టిఆర్‌ఎస్ వ్యతిరేక శక్తుల ఐక్యతకు నాంది పలుకుతుందని ఆయన తెలిపారు.

12/19/2017 - 04:04

హైదరాబాద్, డిసెంబర్ 18: కాంగ్రెస్ పార్టీ ఎంతగా దుష్ప్రచారం చేసినా, రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకుని కట్టుకథలు చెప్పినా గుజరాత్ ప్రజలు ఆయన మాటలను నమ్మలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన సోమవారం నాడు పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. ఫలితాలు బిజెపి కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.

12/19/2017 - 00:54

హైదరాబాద్, డిసెంబర్ 18: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మంద కృష్ణమాదిగ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై కేసు నమోదైంది. ఎస్సీ వర్గీకరణ పేరుతో ఆదివారం అర్ధరాత్రి అనూహ్య ర్యాలీ నిర్వహించిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. తెలుగు మహాసభల బ్యానర్లు, హోర్డింగ్‌లను ధ్వంసం చేసి, పోలీసులపై కుర్చీలు, కర్రలతో దాడి చేశారు. పోలీసు బైకులకు నిప్పుపెట్టారు.

12/19/2017 - 00:52

హైదరాబాద్, డిసెంబర్ 18: మద్యం డిపోల్లో అవినీతికి, అవకతవకలకు ఆస్కారం లేకుండా తనఖీలు నిర్వహించడానికి విజిలెన్స్ అండ్ ఆడిట్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ జి దేవిప్రసాద్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్సైజుశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ పరిధిలో ఈ విభాగం పని చేస్తుందని పేర్కొన్నారు.

12/19/2017 - 00:52

హైదరాబాద్, డిసెంబర్ 18: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సంబరపడాల్సినంత విజయం ఏమీ లేదని సిపిఎం పోలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది. బిజెపి పట్ల పెరిగిన ప్రజావ్యతిరేకత కారణంగానే తక్కువ సీట్లు వచ్చాయని పేర్కొంది. గత ఎన్నికల్లో 165 సీట్లు కలిగి ఉంటే ఈసారి 115 స్ధానాలు వరకు గెలుచుకుంటుందని బిజెపి వర్గాలు అంచనా వేస్తే ఆ స్ధాయిలో విజయం సాధించలేదని పేర్కొంది.

12/19/2017 - 00:51

హైదరాబాద్, డిసెంబర్ 18: అస్సాం రైఫిల్స్ (సాయుధ దళం)లో పని చేసిన సైనికోద్యోగుల పిల్లలకు ఉన్నత విద్యలో రిజర్వేషన్లు కల్పించాలని సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సిఎం కెసిఆర్‌ను కోరారు. ఇందుకోసం 1993లో జారీ చేసిన 192 జివోను సవరించాలని చాడ సిఎంకు రాసిన లేఖలో కోరారు.

12/19/2017 - 00:50

హైదరాబాద్, డిసెంబర్ 18: ఈనెల 19 నుంచి టీఎస్‌ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ ద్వితీయ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్టు ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ బాలు, కె రాజిరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో రెండు రోజులపాటు జరిగే మహాసభలకు రాష్టవ్య్రాప్తంగా 800 మంది ప్రతినిధులు హాజరవుతారని వారు తెలిపారు.

12/19/2017 - 00:49

హైదరాబాద్, డిసెంబర్ 18: గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడం పట్ల ప్రధాన నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాన మంత్రికి అభినందన సందేశాన్ని పంపించారు. రెండు రాష్ట్రాల్లో విజయం సాధించడం పట్ల తెలంగాణ ప్రజల పక్షాన, టిఆర్‌ఎస్ పార్టీ పక్షాన అభినందనలు తెలుపుతున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Pages