S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/20/2017 - 22:39

గజ్వేల్, డిసెంబర్ 20: ఉనికి కోసం పాకులాడుతున్న ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తుండగా, పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలు వారిని క్షమించవని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు హెచ్చరించారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో 3500 క్రిస్టియన్ కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

12/20/2017 - 22:38

నల్లగొండ, డిసెంబర్ 20: నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మిశ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వ పురస్కారం స్కోచ్ అవార్డును అందుకున్నారు. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిత్రారామచంద్రన్ చేతుల మీదుగా చైర్‌పర్సన్ లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు స్కోచ్ అవార్డును స్వీకరించారు.

12/20/2017 - 22:38

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 20: దేశానికి అన్నదాతలైన రైతుల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న సహకార వ్యవస్థ తెలంగాణలో భేషుగ్గా ఉందని ఉత్తరాఖండ్ మంత్రి ధన్‌సింగ్ రావత్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో సహకార బ్యాంకుల కంప్యూటరీకరణ విధానంపై అధ్యయనం చేసేందుకు వచ్చిన ఆయన గట్టుదుద్దెనపల్లి, కరీంనగర్ సహకార సంఘాల్లోని కంప్యూటర్ల పనితీరును బుధవారం పరిశీలించారు.

12/20/2017 - 22:37

నల్లగొండ, డిసెంబర్ 20: సమాజంలో జనాభాను అనుసరించి సరైన ప్రాతినిధ్యం దక్కని బీసీలు తమ హక్కుల సాధనకు రాజ్యాధికారమే లక్ష్యంగా సంఘటిత పోరాటాలు ఉధృతం చేయాలని బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అన్నారు. బుధవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో బీసీ వర్గానికి చెందిన ప్రధాని నరేంద్ర మోదీ పాలన హయాంలోనే బీసీలు తమ హక్కుల సాధనకు ఒత్తిడి తేవాలన్నారు.

12/20/2017 - 03:49

ఉట్నూరు, డిసెంబర్ 19: ఏజెన్సీ వ్యాప్తంగా శాంతి వాతావరణం నెలకొనే వరకు ఇక్కడే ఉంటూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఐజీ నాగిరెడ్డి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ డిఎస్పీ విష్ణు ఎస్ వారియస్‌తో కలిసి విలేఖరులతో మాట్లాడారు.

12/20/2017 - 03:48

కరీంనగర్, డిసెంబర్ 19: ఎంఐఎం రజాకార్ల వారసత్వ సంస్థ అని, టెర్రరిస్టుల రక్షణ కవచమని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు ఆరోపించారు. నైజాం రజకార్ల వారసత్వంతో ఆవిర్భవించిన ఎంఐఎంతో ముస్లిం మహిళలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.

12/20/2017 - 03:45

ఉట్నూరు,డిసెంబర్ 19: ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలన్న తమ ఉద్యమంలో మావోయిస్టుల మద్దతు ఉందని దుష్ప్రచారం చేయడం తగదని, తమ ఉద్యమం వెనక ఎవరూ లేరని ఆదివాసి హక్కుల పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు ఆత్రం తిరుపతి తెలిపారు.

12/20/2017 - 03:45

మిర్యాలగూడ, డిసెంబర్ 19: నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు ప్రాంతం, ఎత్తిపోతల పథకాల కింద యాసంగిలో ఆరుతడి పంటలనే రైతులు సేద్యం చేసుకోవాలని ఎన్‌ఎస్‌ఎల్‌బీసీ ఓ అండ్ ఎం సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ నర్సింహా కోరారు.

12/20/2017 - 03:44

మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 19 : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ ఆత్రం నరేష్ (31) సోమవారం అనుమానాస్పదంగా మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... స్నేహితులతో నరేష్ కలిసి వేములవాడ వెళ్లాడని, మంగళవారం ఉదయం అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆసుపత్రికి చేరుకుని స్నేహితులే హత్య చేశారంటూ ఆరోపించారు.

12/20/2017 - 03:43

డిచ్‌పల్లి, డిసెంబర్ 19: నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీహెచ్.నితీష అనే విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఆమె కుటుంబీకులు తెలిపారు. స్థానికంగా గల ఆదర్శ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న నితీష గత జనవరిలో రోజువారీలాగే స్కూల్‌కు వెళ్లగా, ప్రార్థనా సమయంలో ఒక్కసారిగా అనారోగ్యానికి గురై స్పృహతప్పి పడిపోయింది.

Pages