S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/17/2017 - 03:44

హైదరాబాద్, డిసెంబర్ 16: తెలంగాణ విద్యుత్ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎటువంటి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన లేకుండానే విద్యుత్ నియంత్రణ మండలికి రూ.7611 కోట్ల రెవెన్యూలోటుతో నివేదిక ఇచ్చాయి. ఈ నివేదికలో విద్యుత్ చార్జీలను పెంచుతున్నట్లు ఎక్కడాప్రస్తావించలేదు. అలాగే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని కూడా పేర్కొనలేదు. వచ్చే ఏడాది ఎన్నికల బడ్జెట్ వస్తోంది.

12/16/2017 - 03:44

హైదరాబాద్, డిసెంబర్ 15: నాయి బ్రాహ్మణుల వృత్తి పరంగా మరింత ముందుకు సాగేందుకు అత్యాధునిక శిక్షణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని బిసి సంక్షేమ మంత్రి జోగు రామన్న తెలిపారు.

12/16/2017 - 03:42

హైదరాబాద్, డిసెంబర్ 15: అంగన్‌వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్, జియో ట్యాగింగ్ యోచనను ఉపసంహరించుకోవాలని తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్ (టీచర్స్), హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం పద్మ, పి జయలక్ష్మి డిమాండ్ చేశారు. ప్రభుత్వం అంగన్‌వాడీల ఉద్యోగ భద్రతకు నష్టం కలిగించే జివో నెం 14, పింఛన్ లేకుండానే అంగన్‌వాడీలను ఇంటికి పంపాలని తెలియజేస్తూ జిఓ నెం. 19ని జారీ చేసిందని వారు ఆరోపించారు.

12/16/2017 - 03:42

హైదరాబాద్, డిసెంబర్ 15: ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గోనే నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన భారత ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడుకు బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమ్మద్ మహమూద్ అలీ శుక్రవారం నాడు ఘనస్వాగతం పలికారు.

12/16/2017 - 03:41

హైదరాబాద్, డిసెంబర్ 15: ఈనెల 19,20 తేదీల్లో టీఎస్‌ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ ద్వితీయ మహాసభలు జరుగుతాయని ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ బాలు, కె రాజిరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో జరిగే సభలకు రాష్టవ్య్రాప్తంగా 800 మంది డెలిగేట్స్ హాజరవుతారని వారు తెలిపారు.

12/16/2017 - 03:41

హైదరాబాద్, డిసెంబర్ 15: హైదరాబాద్‌లో నిర్మిస్తామన్న ఈస్ట్-వెస్ట్ కారిడార్ ఏమైందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకూరు సుధాకర్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మెట్రోరైల్ ప్రారంభ సమయంలో దాంతో కేసీఆర్‌కు, కేటీఆర్‌కు ఏ సంబంధం లేదని, శంకుస్థాపన జరిగాక మెట్రోను అడ్డుకోవాలని బహిరంగ సభల్లో చెప్పారని ఆయన గుర్తు చేశారు.

12/16/2017 - 03:40

హైదరాబాద్, డిసెంబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు వీలుగా చాలా ముందుగానే ఎన్నికల వ్యూహాన్ని రచిస్తోంది. వివిధ రాజకీయ పార్టీలతో పొత్తు ఉంటే పరిస్థితి ఏమిటో, పొత్తు లేకుంటే పరిస్థితి ఏమిటనే దానిపై ఇప్పటికే విస్తృతంగా చర్చలు జరిపిన బిజెపి తాజాగా మరో మూడు రోజుల పాటు మేథోమధనం నిర్వహించనుంది. నియోజకవర్గాల వారి అభ్యర్ధుల వడపోత మొదలైంది.

12/16/2017 - 03:39

హైదరాబాద్, డిసెంబర్ 15: ప్రేమ విఫలమై ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్న సంఘటన వివరాల్లోకి వెళితే.. రాంనగర్‌కు చెందిన బాలాజీప్రతాప్ సింగ్ ఓ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. అదే కళాశాలలో ఓ యువతిని ప్రేమించాడు. అయితే ప్రేమించిన యువతి తనకు దక్కదనే మనస్థాపంతోనే బాలాజీ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

12/16/2017 - 03:22

హైదరాబాద్, డిసెంబర్ 15: మొక్కజొన్న, సోయాబీన్, ధాన్యం తదితర పంటలు అమ్మిన రైతులకు చెల్లింపుల్లో జాప్యాన్ని సహించేది లేదని మార్కెటింగ్ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్న మార్కెటింగ్, మార్క్‌ఫెడ్ ఇతర శాఖల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

12/16/2017 - 03:19

హైదరాబాద్, డిసెంబర్ 15: రక్షణ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్వావలంబన సాధిస్తామని లెఫ్టినెంట్ జనరల్ పరంజిత్ సింగ్ అన్నారు. ప్రతిష్టాకరమైన మిలిటరీ కాలేజి ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఆర్మీలో అత్యున్నత స్థాయికి చేరుకుని రక్షణ రంగంలో శాస్త్ర సాంకేతిక విభాగంలో రాణిస్తారన్నారు. శుక్రవారం ఇక్కడ ఎంసిఇఎంఇ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Pages