S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/19/2017 - 00:49

హైదరాబాద్, డిసెంబర్ 18: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా సూర్యాపేట జిల్లాకు చెందిన చిలకరాజు రాములు, ఉపాధ్యక్షుడిగా వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన కోకల సోమశేఖర్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆది, సోమవారాల్లో వరంగల్ జిల్లా హన్మకొండలో ఎ నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగిన టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ ఎన్నిక జరిగినట్టు యుటిఎఫ్ ప్రధానకార్యదర్శి చావ రవి తెలిపారు.

12/18/2017 - 04:34

వెంకటాపురం (రామప్ప), డిసెంబర్ 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం ఇంచన్ చెర్వుపల్లి గ్రామంలో దేవాదుల ప్రాజెక్టులో భాగంగా కోస్టల్ కంపెనీ చేపట్టిన సొరంగంలో ఆదివారం మట్టి పైకప్పు కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం...

12/18/2017 - 00:34

హైదరాబాద్, డిసెంబర్ 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా అక్రమంగా రాష్ట్రంలో బి, జి, -3 పత్తి విత్తనాలు సరఫరా చేసిన మోన్‌శాంటో కంపెనీపై చర్యలు తీసుకుని, రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది.

12/18/2017 - 00:34

హైదరాబాద్, డిసెంబర్ 17: హైదరాబాద్‌కు చెందిన పిహెచ్‌సీ రిటైల్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సహా పలువురు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా అధికారులపై సీబీఐ (చెన్నై) కేసు నమోదు చేసింది. నకిలీ ధ్రువీకణ పత్రాలు సమర్పించి రూ. 133.95 కోట్ల రుణం పొందిన వారిపై విచారణ సాగుతోంది.

12/18/2017 - 00:32

హైదరాబాద్, డిసెంబర్ 17: క్రీడలకు సంబంధించి మార్కెట్‌లో జోరుగా సాగే బెట్టింగ్‌లు, ఇంకా రకరకాల గ్యాంబ్లింగ్ జూదాలను చట్టబద్ధత చేస్తే నల్లధనం చలామణిని అరికట్టవచ్చని లా కమిషన్ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. అలాగే ముసాయిదా బిల్లును కూడా రూపొందించింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌లకు చట్టబద్ధత కల్పించినా, వీటిపై నియంత్రణ కఠినంగా ఉండాలని కేంద్రాన్ని లా కమిషన్ కోరింది.

12/18/2017 - 00:29

హైదరాబాద్, డిసెంబర్ 17: ఉస్మానియా యూనివర్శిటీ బోధనేతర కాంట్రాక్ట్ సిబ్బంది డిమాండ్లను పరిష్కరించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సిఎం కెసిఆర్‌కు లేఖ రాశారు. ఒయూలో 1800 మంది బోధనేతర సిబ్బంది కాంట్రాక్ట్ ఉద్యోగులు గత 33 రోజులుగా నిరవధిక సమ్మె జరుపుతున్నారని, ఇటు యూనివర్శిటీ అధికారులు గానీ, అటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గానీ తగు విధంగా స్పందించకపోవడం అన్యాయమని తెలిపారు.

12/18/2017 - 00:29

హైదరాబాద్, డిసెంబర్ 17: విద్యుత్ ఉత్పాదనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా మొదటి స్థానంలో నిలిచిందని, దీనికి ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికత కారణమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. విద్యుత్ పొదుపులోనూ తెలంగాణ అగ్రస్థానంలో నిలువనున్నట్లు చెప్పారు.

12/17/2017 - 05:06

హైదరాబాద్, డిసెంబర్ 16: హైదరాబాద్ ప్రపంచ మహాసభలు నిర్వహించడంపై చూపించిన శ్రద్ధలో కనీసం పదో వంతు శ్రద్ధ చూపించినా బాచుపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులకు మేలు జరిగేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రపంచ మహాసభలకు తాము వ్యతిరేకం కాదని, అంతటి శ్రద్ధను సిఎం యూనివర్శిటీలపైనా చూపించాలని పేర్కొన్నారు.

12/17/2017 - 05:05

హైదరాబాద్, డిసెంబర్ 16: మనం మారుదాం, మన నగరాన్ని మారుద్దాం అనే స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో కలిగించేందుకు మన నగరం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు స్పష్టం చేశారు. కుత్భుల్లాపూర్‌లో ఈ కార్యక్రమాన్ని శనివారం మంత్రి ప్రారంభించారు. ఈ నగరం నాది, మనది అనే సామాజిక స్పృహతోనే స్వచ్ఛ హైదరాబాద్ సాధ్యమవుతుందని అన్నారు.

12/17/2017 - 05:03

హైదరాబాద్/గచ్చిబౌలి, డిసెంబర్ 16: లిప్ట్ మరమత్తులు చేస్తుండగా ప్రమాదవ శాత్తు చైన్ లింక్ తెగిపోవడంతో క్రిందపడి ఇద్దరు లిఫ్ట్ టెక్నీషయన్స్ మృతి చేందిన సంఘలన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎన్‌సీసీ కార్పొరేట్ కార్యలయంలో జరిగింది. పోలీసులు బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి.

Pages