S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/21/2017 - 00:32

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు విదేశాల నుంచి నేరుగా నిధుల సమీకరణకు వెసులుబాటు కల్పించాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీ రామారావు విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం ఇక్కడ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సురేశ్ ప్రభులను కలిసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

12/21/2017 - 00:31

హైదరాబాద్, డిసెంబర్ 20: రాష్ట్రంలోని 72 పట్టణాల్లో 12 లక్షల భవనాలను జియో ట్యాగింగ్ చేయడంతో పాటు భూ ఉపరితలం నుంచి తీసిన చిత్రాలను ఆస్తిపన్ను ఖాతాలతో అనుసంధానం చేయడంతో తెలంగాణ మున్సిపల్ శాఖ రెండు స్కోచ్ గోల్డ్ అవార్డులను గెలుచుకుంది. భారత ప్రభుత్వ నేషనల్ రిమోట్ సెన్సింగ్ భాగస్వామ్యంతో ‘్భవన్’ ఉపగ్రహం సహాయంతో భవనాల చిత్రాలను తీసి జియో ట్యాగింగ్ చేసింది.

12/21/2017 - 00:30

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: కేంద్ర ప్రభుత్వం వద్ద నిరుపయోగంగా ఉన్న భూమిని తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న డబుల్ బెడ్ రూం పథకానికి కేటాయించాలని లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షం నాయకుడు జితేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జితేందర్ రెడ్డి బుధవారం లోక్‌సభలో స్థిరాస్తుల సేకరణ, వితరణ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ ఈ విజప్తి చేశారు.

12/21/2017 - 00:30

హైదరాబాద్, డిసెంబర్ 20: విదేశాల్లో చదువుకునే బిసి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ను మంజూరు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఉత్తర్వులను జారీ చేసిందని, దరఖాస్తు గడువును జనవరి 31 వరకూ పొడిగించినట్టు బిసి సంక్షేమ శాఖ కమిషనర్ టి విజయకుమార్ తెలిపారు.

12/21/2017 - 00:28

హైదరాబాద్, డిసెంబర్ 20: కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను కొనసాగిస్తూ వారి సేవలను క్రమబద్ధీకరించే విషయమై పరిశీలించాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. రెండు రాష్ట్రాల్లో 748 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ రామలింగేశ్వరరావు విచారించారు.

12/20/2017 - 23:31

లక్ష్య సాధనకు దగ్గరిదారులు ఉండవు. శిఖరాగ్రానికి చేరాలంటే కష్టపడటం ఒక్కటే దారి. అది చదువులోనైనా, జీవితంలోనైనా.. అని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ విద్యార్థిలోకానికి పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన కోవింద్, బుధవారం సోమాజీగూడలోని రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పాఠశాలకు వచ్చిన రాష్టప్రతిని పుష్పగుచ్ఛంతో ఆహ్వానిస్తున్న విద్యార్థిని

12/20/2017 - 23:29

హయత్‌నగర్, డిసెంబర్ 20: హైదరాబాద్ నగరశివారు హయత్‌నగర్‌లో ఓ ఇంజనీరింగ్ కళాశాల బస్సు బుధవారం బీభత్సం సృష్టించింది. బస్సు అదుపుతప్పిన ఘటనలో పనె్నండేళ్ల విద్యార్థిని మృత్యువాత పడితే పలువురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమం ఉంది. ఈ ఘటనలో మూడు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయ. ప్రశాంతంగా ఉన్న రోడ్డుపైకి పెనుభూతంలా దూసుకొచ్చిన కళాశాల బస్సును చూసి స్థానికులు కకావికలమయ్యారు.

12/20/2017 - 22:49

ఆదిలాబాద్, డిసెంబర్ 20: వాతావరణంలో నెలకొన్న మార్పుల ప్రభావంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చలి పులి వణికిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈదురు గాలులతో పాటు చలి తీవ్రత విజృంభించడంతో పిల్లలు, వృద్ధులు, మహిళలు, యాచకులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

12/20/2017 - 22:40

ఆదిలాబాద్,డిసెంబర్ 20: ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి అశాంతిని ప్రేరేపించేందుకు కొన్ని శక్తులు వదంతులు, పుకార్లతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని, వీరి మాటలు నమ్మకుండా ఇరువర్గాల ప్రజలు సంయమనం పాటించాలని వరంగల్ జోన్ ఐజీ వై.నాగిరెడ్డి సూచించారు.

12/20/2017 - 22:40

గజ్వేల్, డిసెంబర్ 20: తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి ఎన్‌ఆర్‌ఐల చేయూత ఉటుందని, సీఎం కేసీఆర్ కృషి ఫలితంగానే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నట్లు ప్రపంచ తెలుగుమహా సభల ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ మహేశ్‌బిగాల పేర్కొన్నారు.

Pages