S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/14/2017 - 23:44

హైదరాబాద్, డిసెంబర్ 14: రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న వేలాది మంది ఆశా వర్కర్లకు ప్రభుత్వం పెంచిన ఆరు వేల రూపాయల వేతనాన్ని వచ్చే నెల నుంచి నేరుగా వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖ డైరక్టరేట్ ద్వారా వేతనాలు అందేవని, వచ్చే నెల నుంచి నేరుగా వారికి అందుతాయని అన్నారు.

12/14/2017 - 23:44

హైదరాబాద్, డిసెంబర్ 14: రాష్ట్రంలో త్వరలో 50 శాతం సబ్సిడీపై 2.18 లక్షల పాడిగేదెలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలంగాణ పశు సంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దేశంలోనే గొల్ల, కురుమలు అత్యంత ధనికులుగా అభివృద్ధి చెందాలనేది ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయమని అన్నారు.

12/14/2017 - 23:43

హైదరాబాద్, డిసెంబర్ 14: బంగారు తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్రప్రభుత్వం రూపొందిస్తున్న 2024 విజన్ డాక్యుమెంట్‌లో 2024లో రాష్ట్ర బడ్జెట్ రూ.5 లక్షల కోట్లు ఉండే విధంగా అభివృద్ధిని చేపట్టాలని నిర్దేశించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో బంగారు తెలంగాణ డాక్యుమెంట్ సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రం అవతరించినప్పటి నుంచి మిగులు బడ్జెట్‌తో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది.

12/14/2017 - 01:20

హైదరాబాద్, డిసెంబర్ 13: రాష్ట్రంలోని మూడు జిల్లాలకు జిల్లా కన్స్యూమర్ ఫోరం అధ్యక్షులను ప్రభుత్వం నియమించింది. ఆదిలాబాద్ జిల్లా కన్స్యూమర్ ఫోరం అధ్యక్షుడిగా రిటైర్డ్ జిల్లా జడ్జి కె. రమేష్‌ను నియమించారు. హైదరాబాద్-2 జిల్లా ఫోరం అధ్యక్షుడిగా ప్రముఖ న్యాయవాది వక్కంటి నరసింహారావును, రంగారెడ్డి జిల్లా ఫోరం ప్రెసిడెంట్‌గా చిట్నేని లలితా కుమారిని నియమించారు.

12/14/2017 - 01:19

హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో జనవరి 1వ తేదీ నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేసినా, రానున్న వేసవిలో విద్యుత్ కొరతకు అవకాశం లేదు. మూడేళ్ల క్రితం విద్యుత్ కొరతతో సతమతమైన తెలంగాణ ఈ రోజు మిగులు విద్యుత్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తే పారిశ్రామిక, గృహ రంగాలకు కోతలు తప్పవనే ఆందోళనలు ఉండవని విద్యుత్ నిపుణులంటున్నారు.

12/14/2017 - 01:18

హైదరాబాద్, డిసెంబర్ 13: హోంగార్డులకు వేతనం పెంచడంతోపాటు వారి సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు ప్రకటించడం పట్ల పోలీస్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. మానవతాదృక్పథంతో సివిల్ కానిస్టేబుళ్లతో సమానంగా హోంగార్డుల సంక్షేమాన్ని కాంక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

12/14/2017 - 01:18

హైదరాబాద్, డిసెంబర్ 13: ఘన వ్యర్థపదార్ధాల నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయ స్థాయి సమావేశం ఈ నెల 15న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు ఆయా వర్గాలు తెలిపాయి. ఏడవ ఐకాన్ ఎస్‌డబ్ల్యూఎం 2017 పేరుతో ఘన వ్యర్ధ పదార్ధాల వినియోగంపై హైదరాబాద్‌లోని పిజెటిఎస్‌ఏ యూనివర్శిటీలో ఈ నెల 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు అంతర్జాతీయ సమావేశం జరుగుతుందని తెలిపింది.

12/14/2017 - 01:17

హైదరాబాద్, డిసెంబర్ 13: ఒబిసిల సమస్యల పరిష్కారానికి వచ్చే ఏడాది జనవరిలో హైదరాబాద్‌లో భారీ మహాసంగ్రామ సభను నిర్వహించనున్నట్టు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తెలిపారు. ఒబిసి మోర్చ పదాధికారుల సమావేశం నాంపల్లిలోని బిజెపి కార్యాలయంలో బుధవారం నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి ఒబిసి మోర్చ అధ్యక్షుడు కాటం నర్సింహ యాదవ్ అద్యక్షత వహించారు.

12/14/2017 - 01:17

హైదరాబాద్, డిసెంబర్ 13: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో దళితుల శిరో ముండనం కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు ఇవ్వకుండా హైకోర్టు స్టే మంజూరు చేసింది. ఈ సంఘటన 1997లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది.

12/14/2017 - 01:15

ఆంధ్ర రచయిత నరసింహమూర్తిని ఆహ్వానించి అందెశ్రీని ఆహ్వానించ లేదు
విమర్శించిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి

Pages