S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/28/2019 - 01:35

హైదరాబాద్: తెలంగాణలో మొట్టమొదటి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఆధార్) సేవా కేంద్రం హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభమైంది. ఈ కేంద్రం ప్రతిరోజూ 1,000 వరకు వివిధ ఆధార్ సంబంధ అర్జీలను పరిష్కరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

11/28/2019 - 01:31

హైదరాబాద్, నవంబర్ 27: ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకోవడానికి ప్రభుత్వం గురువారం జరిగే కేబినెట్‌లో తీసుకునే స్పష్టతపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మూకుమ్మడిగా కార్మికులందరినీ విధుల్లోకి ప్రభుత్వం ఆహ్వానిస్తుందా? లేదా కొంతమందిని తీసుకుంటుందా? అన్నది రాష్ట్ర కేబినెట్ తేల్చనుంది.

,
11/27/2019 - 06:12

నిజామాబాద్: ఆర్టీసీ సంక్షోభం మరో కార్మికుడి ప్రాణాలను బలిగొంది. కొలువు ఉంటుందో, లేదోననే మనోవేదనకు గురైన ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుకు గురై అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఎడపల్లి మండలం మంగల్‌పాడ్ గ్రామానికి చెందిన కే.రాజేందర్ (55) జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.

11/27/2019 - 06:04

నాగర్‌కర్నూల్, నవంబర్ 26: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఒకటవ టనె్నల్ నిర్మాణ పనులను నిర్దేశించిన సమయం డిసెంబర్ 2021నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇరిగేషన్ అధికారులను, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. టనె్నల్ నిర్మాణ పనులపై ఎప్పటికప్పుడూ తనకు తెలియజేయాలని ఆదేశించారు.

11/27/2019 - 06:01

వనపర్తి, నవంబర్ 26: విద్యార్థుల్లో దాగివున్న విజ్ఞానాన్ని పెంపోందించేందుకు వైజ్ఞానిక శిబిరాలు ఎంతో ఉపయోగపడుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నదని అన్నారు.

11/27/2019 - 05:59

వరంగల్, నవంబర్ 26: ఆర్టీసీ కార్మికుల పట్ల ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ వ్యవహరిస్తున్న తీరు గర్హనీయమని సీపీఐ రాష్టక్రార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి చేరుతున్నామన్నా వారిని విధుల్లోకి తీసుకోబోము అంటూ సునీల్ శర్మ పేర్కొనడం పట్ల చాడ అభ్యంతరం వ్యక్తం చేశారు.

11/27/2019 - 05:57

సూర్యాపేట, నవంబర్ 26: తన పేరున ఉన్న భూమికి సంబంధించిన పట్టాను ఇచ్చేందుకు ఏళ్ల తరబడిగా తిప్పుకొని చివరకు మీ పేరుపై భూమిలేదంటూ రెవిన్యూ అధికారులు చెప్పడంతో తహశీల్దార్ కార్యాలయంలోనే క్రిమిసంహారక మందుతాగి మహిళా రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. ఇందుకు సంబంధించి బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..

11/27/2019 - 05:54

ధన్వాడ, నవంబర్ 26: మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని పలు వార్డులలో మిషన్ భగీరథ నీళ్లు తాగిన ప్రజలు మంగళవారం అస్వస్థతకు గురికావడంతో పలువురు ధన్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ధన్వాడలోని పలు వార్డులలో మిషన్ భగీరథ నీళ్ల వల్లే ప్రజలకు అస్వస్థతకు గురికావడం జరుగుతోందని స్థానికులు తెలిపారు.

11/27/2019 - 05:54

ఝరాసంగం, నవంబర్ 26: మంగళవారం కార్తీక అమావాస్య కావడంతో ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. మండలంలోని వివిధ ఆలయాల్లో తెల్లవారు జాము నుండే భక్తులు దర్శనాల కోసం బారులు తీరారు.దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన ఝరాసంగంలోని కేతకి సంగమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది..

11/27/2019 - 05:53

వెంకటాపురం, నవంబర్ 26: ములుగు జిల్లా వెంకటాపురం ఎజెన్సీపై మావోయిస్టులు గురి పెట్టారు. వెంకటాపురం, వాజేడు మావోయిస్టు ఏరియా కమిటి పేరుతో ఆదివారం నేతలను టార్గెట్ చేస్తూ లేఖలు విడుదల చేశారు.

Pages