S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/24/2019 - 07:12

హైదరాబాద్, నవంబర్ 23: ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తే చార్జీలు పెరుగుతాయని, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని టీపీసీసీ ధ్వజమెత్తింది. శనివారం ఇక్కడ టీపీసీసీ ప్రతినిధి సతీష్ మాదిగ విలేఖర్లతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నియంతృత్వ చర్యల వల్ల రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. ప్రభుత్వ స్కూళ్లను తగ్గించాలని, చాలా చోట్ల మూసివేయాలనే నిర్ణయం వల్ల తెలంగాణ ప్రజల జీవన స్థితి అధ్వాన్నంగా మారుతుందన్నారు.

11/24/2019 - 15:18

హైదరాబాద్: మహారాష్టల్రో శివసేన అధికారం కోసం కక్కుర్తి పడిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నాడు ఆయన రాజధానిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధిక సీట్లు సాంపాదించినా బీజేపీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందని, శివసేన కలిసి వస్తే ప్రభుత్వం ఏర్పాటుచేయాలని చూస్తే అందుకు శివసేన కలిసి రాలేదని అన్నారు.

11/24/2019 - 07:10

హైదరాబాద్, నవంబర్ 23: పశువులు, గొర్రెల పెంపకం, సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వ చేపట్టిన పథకాలు, కార్యక్రమాల అమలులో ఉన్నతస్థాయి నుండి కింది స్థాయి వరకు సిబ్బంది శ్రద్దతో పనిచేయాలని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని పశుసంవర్థ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హెచ్చరించారు.

11/24/2019 - 15:17

హైదరాబాద్: తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక రంగం అనూహ్యంగా అభివృద్ధి చెందుతోందని కేంద్రం ఆధీనంలోని వార్షిక పరిశ్రమల సర్వేలో పేర్కొంది. ప్రతి ఏడాది వార్షిక పరిశ్రమల సర్వేను నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ నిర్వహిస్తుంది. ఈ సర్వే ప్రకారం 2014-15లో రాష్ట్రంలో పరిశ్రమలు 14,427 ఉండగా, 2017-18 నాటికి 15,263కు పెరిగాయి.

11/24/2019 - 01:47

హైదరాబాద్, నవంబర్ 23: ఆర్టీసీ కార్మికల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణం నిర్ణయం తీసుకోవాలని, వారిని వెంటనే విధుల్లోకి అనుమతించాలని జెఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు. సమ్మె విరమించడానికి జెఏసీ సుముఖంగా ఉందని స్పష్టం చేసినప్పటికీ, సీఎం ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కార్మికుల సహనాన్ని పరీక్షించవద్దని ఆయన సీఎంకు హితవు పలికారు.

11/23/2019 - 16:17

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆదివారం డిపోల ఎదుట మానవహారం నిర్వహిస్తామని ప్రకటించారు. రేపు ఎంజీబీఎస్‌లో మహిళా ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు చేపడతారని తెలిపారు. ఆర్టీసీ జేఏసీ నిర్ణయాన్ని ఎండీకి పంపిస్తామని, సీఎం కేసీఆర్‌ ఆర్టీసీపై మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామన్నారు.

11/23/2019 - 16:16

హైదరాబాద్: హైదరాబాద్ గచ్చిబౌలిలో బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ పై నుంచి కారు ఒక్కసారిగా కింద పడింది. ఫ్లై ఓవర్ కింద నడుచుకుంటూ వెళుతున్న సత్యవేణి(40) అనే మహిళ మృతిచెందింది. ఆమె కూతురు ప్రణీత, మరో ఇద్దరు బాలరాజు, కుప్ర అనే యువతి తీవ్రంగా గాయపడ్డారు. కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మృతిరాలి కుటుంబానికి రూ. 5 లక్షలు పరిహారంగా అందించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.

11/22/2019 - 17:54

హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీలోని కొన్ని రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. రాష్ట్రంలో 5,100 రూట్ల ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు విశే్వశ్వరరావు వేసిన పిటిషన్‌పై నేడు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదించారు.

11/22/2019 - 16:59

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం కేసీఆర్ కార్మికులను విధుల్లోకి చేర్చుకునే అంశంపై మాట్లాడకపోవటం శోచనీయమైని జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఈరోజు కోర్టు తీర్పు తరువాత కార్మికులపై ప్రకటన చేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. రేపు అన్ని డిపోల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు.

11/22/2019 - 16:57

హైదరాబాద్: సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రామన్నపేట నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా యాదగిరి రెడ్డి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సిద్ధాంతాలకు కట్టుబడి ఆదర్శవంతమైన, నిరాడంబరమైన జీవితాన్ని గడిపారని కొనియాడారు.

Pages