S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/27/2019 - 01:18

హైదరాబాద్, నవంబర్ 26: ప్రభుత్వ విధానాలు సామాన్యులకు చేరి, వారికి అభివృద్ధి ఫలాలు అందినప్పుడే రాజ్యాంగ రూపకల్పనకు నిజమైన ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, అధికారులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు.

11/27/2019 - 01:23

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకునే విషయంపై గురువారం కీలక నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమ్మెపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర మంత్రివర్గం గురు, శుక్రవారం భేటీ కాబోతుంది. వరుసగా రెండు

11/26/2019 - 16:09

హైదరాబాద్:విధుల్లోకి చేరాలని వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో తెలంగాణలోని పలు డిపోల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. నర్సంపేట డిపోలో 16మంది కార్మికులను అరెస్టు చేశారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలో డిపోల్లోకి వెళుతున్న కార్మికులను అడ్డుకున్నారు. హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.

11/25/2019 - 17:17

హైదరాబాద్:గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాజభవన్‌లో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై ఇరువురు చర్చించారు. కొత్త రెవెన్యూ చట్టం, ఆర్టీసీ ప్రైవేటీకరణ తదితర అంశాలను గవర్నర్ తమిళసైకి సీఎం కేసీఆర్ వివరించారు.

11/25/2019 - 05:16

హైదరాబాద్, నవంబర్ 24: గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని సీఎం కేసీఆర్ ప్రకటించారని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి రూపాందించారని మంత్రి తెలిపారు.

11/25/2019 - 05:15

హైదరాబాద్, నవంబర్ 24: అవినీతిపరులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో రెడ్ కార్పెట్ పరుస్తున్నారని అంబటి రాయుడు చేసిన ట్వీట్‌ను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఏకీభవించినట్లు ప్రకటించారు. హెచ్‌సీఏలో అవినీతి పేరుకుపోయిందన్న మాట వాస్తవమేనని నేడిక్కడ విడుదల చేసిన పత్రిక ప్రకటనలో సాట్స్ చైర్మన్ స్పష్టం చేశారు.

11/25/2019 - 05:14

హైదరాబాద్, నవంబర్ 24: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర క్రీడలు, పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నగరంలోని పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్‌లో ఫ్రీడం హైదరాబాద్ 10కె రన్‌ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

11/25/2019 - 05:14

హైదరాబాద్, నవంబర్ 24: తాము విధుల్లో స్వచ్ఛందంగా చేరతామన్నా ససేమిరా అంటూ సీఎం కేసీఆర్ మొండివైఖరిని ప్రదర్శస్తున్నారని జేఏసీ నేతలు మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సోమవారం సేవ్ ఆర్టీసీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు చేపట్టనున్నట్లు జేఏసీ ప్రకటించింది.

11/25/2019 - 05:13

హైదరాబాద్, నవంబర్ 24: ప్రతి పౌరునికి విద్యా, వైద్యం, ఆహారం, ఇల్లును సమకూర్చే బాధ్యత ప్రభుత్వాలదేనని 12 శతాబ్ధంలోనే బసవేశ్వరుడు చెప్పారని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బసవేశ్వరుని బోధనలు ప్రభుత్వాలకు ధిక్సూచి లాంటివని చెప్పారు. బసవేశ్వరుని బోధనలు ఆచారించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ప్రజాప్రతినిధులకు సూచిస్తుంటారని హరీశ్‌రావు అన్నారు.

11/25/2019 - 05:13

హైదరాబాద్: భారతీయ రైల్వేలో ఆటోమేటిక్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ను దశలవారీగా అమలు చేయనున్నట్లు రైల్వే బోర్డ్ చైర్మన్ వినోద్‌కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో ఆదివారం ఐఆర్‌ఐఎస్‌ఈటీ 62వ వార్షికోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సభికులను నుద్దేశించి మాట్లాడుతూ రైల్వేలో ఆధునిక సాంకేతికను తీసుకురావడానికి ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.

Pages