S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/29/2019 - 13:08

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమమైంది. మున్సిపాల్టీలపై విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. వార్డుల విభజన, ఓటరు జాబితా సవరణపై జూలైలో ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఎత్తివేసింది. వార్డుల విభజన, సవరణ మళ్లీ చేపట్టాలని ఆదేశించింది. 14 రోజుల్లో అభ్యంతరాలు, సవరణలు ముగించాలని, కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

11/29/2019 - 13:07

హైదరాబాద్: శంషాబాద్‌లో దారుణ హత్యకు గురైన వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకరెడ్డి కుటుంబాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని అన్నారు. ఈ దారుణ ఘటనను ఆమె తీవ్రంగా ఖండించారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ పరామర్శించారు.

11/29/2019 - 13:04

హైదరాబాద్: నగరవాసులకు మరో మెట్రోరైలు మార్గం అందుబాటులోకి వచ్చింది. రాయదుర్గం-హైటెక్ సిటీ మైట్రోరైలును మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రులు హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

11/29/2019 - 13:00

హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకరెడ్డి మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా నలుగురు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. ప్రియాంకరెడ్డి స్కూటీకి ఉద్దేశ్యపూర్వకంగానే పంక్చర్ చేసి ఆమె స్కూటీని బాగు చేయిస్తామని డ్రామాలు ఆడారని పోలీసులు భావిస్తున్నారు. లారీ డ్రైవర్, క్లీనర్, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లు తెలిసింది.

11/29/2019 - 06:36

నాగార్జునసాగర్, నవంబర్ 28: నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం క్రమేణా తగ్గుముఖం పడుతోంది.

11/29/2019 - 06:34

గోదావరిఖని, నవంబర్ 28: సింగరేణి బొగ్గు పరిశ్రమ వస్తే బతుకులు మారుతాయనుకున్నాం... గనుల ఏర్పాటుకు వేలాది ఎకరాల పంట భూములను ఇచ్చాం... పచ్చని పొలాలు పోయాయి... వందల కుంటలు కనుమరుగయ్యాయి... ఊళ్లన్నీ బొందల గడ్డలయ్యాయి... ఒక్కరికీ ఉపాధి కల్పించింది లేదు... నిర్వాసిత గ్రామాలను అభివృద్ధి చేసిందీ లేదు... అంతటా... అన్నింటా... మా బతుకులకు అన్యాయమే జరిగింది... సింగరేణి నమ్ముకుంటే...

11/29/2019 - 06:30

నిజామాబాద్, నవంబర్ 28: అధికార తెరాస పార్టీ తరఫున ఏకైక మైనార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆమిర్ వ్యవహార శైలి పట్ల ఆది నుండే వివాదాలు తెరపైకి వస్తూ ఆయన ప్రతిష్టను మసకబారేలా చేస్తున్నాయి. సదరు ఎమ్మెల్యే అనుసరిస్తున్న తీరు వల్ల అనేక సందర్భాల్లో తెరాస నాయకత్వం కూడా ఇరకాట స్థితికి లోనుకావాల్సి వచ్చిందంటే వివాదాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

11/29/2019 - 06:29

నాగర్‌కర్నూల్, నవంబర్ 28: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీలో ప్రభుత్వం తీసుకున్న తాత్కాలిక ఉద్యోగులు బస్సులు నడుపుతూ చేసిన ప్రమాదాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నాగం జనార్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

11/29/2019 - 06:23

మహబూబ్‌నగర్, నవంబర్ 28: మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూర్ పశువైద్యాధికారిగా పనిచేస్తున్న ప్రియాంకరెడ్డి దారుణహత్యకు గురి కావడం పాలమూరు జిల్లాలో కలకలం రేపింది. గురువారం ఈ ఘటన వెలుగులోకి రావడంతో అంతా అవాక్కయ్యారు. కొల్లూర్ పశువైద్యాధికారిగా గత ఏడాది నుండి ప్రియాంకరెడ్డి పనిచేస్తుంది. విధులకు క్రమం తప్పకుండా హాజరయ్యేదని కొల్లూర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

11/29/2019 - 01:20

హైదరాబాద్, నవంబర్ 28: ఆర్టీసీ కార్మికులకు ఊరట లభించింది. విధుల్లో చేరడానికి పిలుపు వచ్చింది. 55 రోజులుగా సాగిన సమ్మె సుఖాంతమైంది. సమస్యకు ప్రభుత్వం ముగింపు పలికింది. సమ్మెలో ఉన్న కార్మికులు శుక్రవారం ఉదయం నుంచి వచ్చి డ్యూటీలో చేరాల్సిందిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. విధు ల్లో చేరేందుకు ఎలాంటి షరతులు విధించడం లేదని కూడా సీఎం స్పష్టం చేశారు.

Pages