S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/30/2019 - 17:29

హైదరాబాద్: పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులను చర్లపల్లి జైలుకి తరలించారు. షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తుతో నలుగురు నిందితులను చర్లపల్లి జైలుకి తరలించారు. కాగా పోలీసు వ్యాన్‌లో నిందితులను తరలిస్తుండగా ఆందోళనకారులు ఆడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది.

11/30/2019 - 17:27

హైదరాబాద్: వైద్యురాలు ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలసి ఓదార్చారు.

11/30/2019 - 13:58

హైదరాబాద్: పశు వైద్యురాలు ప్రియాంకారెడ్డి హత్య ఘటన నిందితులకు పోలీసు స్టేషన్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు వైద్యులు సైతం పోలీసు స్టేషన్‌కు వచ్చారు. ఈ హత్యపై పోలీసు స్టేషన్ బయట నిరసనలు వెల్లువెత్తటంతో ఇటువంటి పరిస్థితుల్లో నిందితులను బయటకు తీసుకువెళ్లటం మంచిదికాదని భావించి ఇలాంటి ఏర్పాట్లు చేశారు. నలుగురికి అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

11/30/2019 - 13:56

హైదరాబాద్: ప్రియాంకరెడ్డి ఘటనలో నిందితులకు ఉరి శిక్ష వేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆయన ఈరోజు కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైద్యురాలి హత్య కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు సకాలంలో స్పందిస్తే ఇంత దారుణ ఘటన జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.

11/30/2019 - 13:50

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశు వైద్యురాలు ప్రియాంకారెడ్డి హత్యోదోంతంపై ఒక వైపు నిరసనలు వెల్లువెత్తుతుండగా.. పోలీసుల నిర్లక్ష్య ధోరణిపై కూడా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయటానికి వెళితే పోలీసులు వెనువెంటనే స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేదికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రియాంక కుటుంబ సభ్యులు ఫిర్యాదుకు వెళ్తే..

11/30/2019 - 13:49

హైదరాబాద్: పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై నిరసనలు వెల్లువెత్తాయి. షాద్ నగర్ పోలీసు స్టేషన్ ఎదుట ప్రజాసంఘాలు ఆందోళన నిర్వహించాయి. మహిళలు, స్థానికులు సైతం ఈ ఆందోళనలో పాల్గొన్నారు. నిందితులను ఉరి తీయాలంటూ నినాదాలు చేశారు. పోలీసు స్టేషన్ ఎదుట ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తటంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. శంషాబాద్ కళాశాల, పాఠశాలల విద్యార్థులు సైతం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

11/29/2019 - 17:17

హైదరాబాద్: హత్యకు గురైన పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పరామర్శించారు. ప్రియాంకరెడ్డి హత్య దారుణమని, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. సీపీ సజ్జనార్ కేసును పర్యవేక్షిస్తున్నారని అన్నారు. కాగా మహమూద్ అలీ మాట్లాడుతూ ప్రియాంక రెడ్డి తన చెల్లికి కాకుండా పోలీసులకు ఫోన్ చేసి ఉంటే వెంటనే రక్షించబడేదని అన్నారు.

11/29/2019 - 17:16

హైదరాబాద్: కేవలం హక్కుల కోసమే యూనియన్లు లేవని, ఆర్టీసీ అధికారులు ఇష్టమొచ్చినట్లు దోచుకున్నారని, వెంటనే కార్మిక సంఘాల యూనియన్లకు ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ చరిత్రలో ఇది ఒక చారిత్రిక సమ్మె అని అన్నారు. యూనియన్లు ఉండాలా వద్దా అనేది లేబర్ కోర్టు నిర్ణయిస్తుందని అన్నారు.

11/29/2019 - 14:01

హైదరాబాద్ : బస్ భవన్‌లోని గుర్తింపు సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) కార్యాలయానికి తాళాలు వేశారు. విజిలెన్స్ డైరెక్టర్ రామచందర్‌రావు ఆదేశాల మేరకు తాళాలు వేసినట్లు బస్ భవన్ భద్రతా సిబ్బంది వెల్లడించింది. రాష్ట్ర స్థాయిలో టీఎంయూకు చెందిన 26 మంది, ఎంప్లాయిస్ యూనియన్‌కు చెందిన ముగ్గురు, ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు చెందిన ఒకరికి విధుల నుంచి మినహాయింపు ఉండేది.

11/29/2019 - 13:09

హైదరాబాద్: వెటర్నరీ వైద్యురాలు ప్రియాంక రెడ్డి దారుణ హత్యపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్ ఒక దర్యాప్తు బృందాన్ని హైదరాబాద్‌కు పంపిస్తున్నట్లు తెలిపింది. ఈరోజు సాయంత్రం లోగా జాతీయ మహిళా కమిషన్ సభ్యులు హైదరాబాద్‌కు చేరుకుంటారు. వారు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతారు.

Pages