S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/22/2019 - 16:56

హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పౌరసత్వం చెల్లదంటూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు నాలుగు వారాల పాటు స్టే విధించింది. తదుపరి విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేసింది. గతంలో హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోలేదని చెన్నమనేని తరపున న్యాయవాది తన వాదన వినిపించారు.

11/22/2019 - 13:03

హైదరాబాద్: నగరంలో ఉల్లి ధరలు ఘాటెక్కాయి. మలక్‌పేటలో కిలో ఉల్లి రూ.100 లు పలుకుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ధరలు ఆకాశాన్నంటడంతో నగరవాసులు ఆచితూచి కొంటున్నారు. నగరంలో క్వింటాలు ఉల్లి ధర రూ.10 వేలు పలికింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతినటంతో కర్ణాటక నుంచి దిగుమతులు తగ్గాయి. దీంతో ఉల్లి ధరలు పెరిగాయని వ్యాపార వర్గాల వారు చెబుతున్నారు.

11/22/2019 - 06:38

హైదరాబాద్, నవంబర్ 21: త్వరలోనే విద్యా కమిటీల ఎన్నికలు జరుగుతాయని, విద్యా కమిటీలు, ప్రజా ప్రతినిధులను పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములను చేస్తే పాఠశాల విద్య అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని విద్యాప్రమాణాలు మెరుగు అవుతాయని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎస్‌సీఈఆర్‌టీలో జరిగిన జిల్లా విద్యాశాఖాధికారుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.

11/22/2019 - 06:37

హైదరాబాద్, నవంబర్ 21: దేశ వ్యాప్తంగా ఉన్న న్యాయ విశ్వవిద్యాలయాల్లో మూడేళ్ల, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల, ఏడాది వ్యవధి ఉన్న ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి మే 10వ తేదీన ద కామన్ లా అడ్మిషన్ టెస్టు (క్లాట్) -2020 నిర్వహించాలని గురువారం నాడు కాన్సార్టియం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెల చివరి వారంలో వెలువడనుంది. దరఖాస్తులను జనవరి 1వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు.

11/22/2019 - 06:37

హైదరాబాద్, నవంబర్ 21: రైతులకు ఆదాయం వచ్చేందుకు ఉద్యాన పంటలు దోహదపడతాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యాన విశ్వవిద్యాలయంలో మొదటి అంతర్ కళాశాల క్రీడాపోటీలను గురువారం ప్రారంభిస్తూ, ఉద్యాన యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవాన్ని త్వరలో నిర్వహిస్తామని ప్రకటించారు. ములుగులో కొత్త ఉద్యాన కళాశాలను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు.

11/22/2019 - 06:36

హైదరాబాద్, నవంబర్ 21: ఫొటోగ్రఫీ ప్రమాణాలను ఎప్పటికపుడు మెరుగుపరుచుకోవాలని ఫొటో జర్నలిస్టులకు మాజీ ఎంపీ కవిత సూచించారు. బతుకమ్మ థీమ్‌తో తెలంగాణ ఫొటో జర్నలిస్టుల సంఘం నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల విజేతలకు రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో కవిత బహుమతులను అందజేశారు. అంతకు ముందు రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

11/22/2019 - 06:35

హైదరాబాద్, నవంబర్ 21: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని టీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీతో పాటు ఎఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీలు వేర్వేరు ప్రకటనల్లో ముఖ్యమంత్రిని కోరాయి.

11/22/2019 - 01:45

హైదరాబాద్, నవంబర్ 21: జనాభా పెరుగుదల, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అనుగుణంగా హైదరాబాద్ మెట్రో డవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) అభివృద్ధి ప్రణాళిక ఉండాలని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సూచించారు.

11/22/2019 - 01:41

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 2018లో 22వేల రోడ్డు ప్రమాద సంఘటనల్లో 6,603 మంది మృతి చెందినట్లు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంక వివరాల్లో పేర్కొంది. సగటున రోజుకు 18 మంది రోడ్డు ప్రమాదాల్లో వ్యక్తులు మృత్యువాత పడుతున్నారు. ఈ ప్రమాదాల్లో 22,613 మంది గాయపడ్డారు. దేశంలో వరుస సంఖ్యలో చూస్తే రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిదివ స్థానంలో తెలంగాణ నిలిచింది.

11/22/2019 - 01:40

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని మార్చే ప్రతిపాదనపై ఏఐసీసీ ఇంతవరకు అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ, ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి తీవ్రమైన పోటీ నెలకొంది. ఉత్తమ్‌ను మార్చే పక్షంలో తమకు పీసీసీ అధ్యక్షపదవిని ఇవ్వాలని కోరుతూ పలువురు కీలక నేతలు అధిష్ఠానవర్గంపై ఒత్తిడి పెంచుకున్నారు.

Pages