S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/22/2019 - 01:37

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితాను గురువారం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి పేరుతో జీఓ (ఆర్‌టీ నెంబర్ 3022) జారీ అయింది. సాధారణ సెలవులుగా 28 పండగలు, జయంతి దినోత్సవాలు, ఉత్సవాల రోజులను ప్రకటించారు. వీటిలో ఐదు పండగలు, జయంతులు ఆదివారం లేదా రెండో శనివారం వచ్చాయి.

11/22/2019 - 01:36

హైదరాబాద్, నవంబర్ 21: ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని యథాతథంగా కొనసాగించడం అసాధ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, ఎలాంటి షరతులు లేకపోతే సమ్మె విరమించి, విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటనపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు.

11/21/2019 - 06:38

వరంగల్, నవంబర్ 20: రైతుల సంక్షేమమే ధ్యేయం అని చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం 2004 ముసాయిదా ప్రతికి కొన్ని మార్పులు చేసి 2019 విత్తన చట్టం ముసాయిదాను ప్రజల ముందు పెట్టిందని, ఈ విత్తన చట్టం రూపొందించడంలో బహుళ జాతి సంస్థల ప్రమేయం ఉందని, బహుళ జాతి సంస్థల ప్రయోజనం కోసమే ఈ చట్టం రూపొందించినట్టుగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.

11/21/2019 - 06:36

కౌడిపల్లి, నవంబర్ 20: గుండెపోటుతో మరో ఆర్టీసీ కండక్టర్ మృతి చెందాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్‌పూర్ గ్రామానికి చెందిన మెదక్ డిపో ఆర్టీసీ కండక్టర్ షేక్ జాఫర్ (33) గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆర్టీసీ కార్మికుల సమ్మెలో పాల్గొన్న కండక్టర్ షేక్ జాఫర్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

11/21/2019 - 06:06

అమ్రాబాద్, నవంబర్ 20: నల్లమల ప్రాంతంలోని రాయలగండి శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధులకోసం తవ్వకాలు చేపట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయానికి దళితులే పూజారులుగా ఉండటం విశేషం. ఈ ఆలయంలో గతంలో ఎన్నోమార్లు గుప్త నిధులకోసం తవ్వకాలు జరిపిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

11/21/2019 - 06:01

నాగర్‌కర్నూల్, నవంబర్ 20: మంచిగా పాలిస్తాడనే ఉద్దేశంతో ప్రజలు ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే దానిని పట్టించుకోకుండా అధికార అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ గెలిపించిన ప్రజలను పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే.లక్ష్మణ్ సీఏం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు.

11/21/2019 - 05:59

మహబూబ్‌నగర్, నవంబర్ 20: టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా లోని కొండారెడ్డిపల్లి, కోనేటిపురం గ్రామాలలో మంత్రి శ్రీనివాస్‌యాదవ్ పర్యటించారు.

11/21/2019 - 01:16

హైదరాబాద్, నవంబర్ 20: ఐటీ, ఫార్మా రంగాలకే కాకుండా గేమింగ్ టెక్నాలజీకి కూడా హైదరాబాద్ నగరం హబ్‌గా మారుతుందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఇక్కడికి వస్తున్న గేమింగ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి కూడా రాయితీలు ప్రకటించబోతున్నామని అన్నారు.

11/21/2019 - 01:13

హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె విరమిస్తున్నట్లు రాతమూలంగా లేఖ ఇస్తే యాజమాన్యం తప్పక స్పందిస్తుందని సంబంధిత ఉన్నతాధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఆర్టీసీ జేఏసీ నేతలు మీడియా ముందు సమ్మె విరమిస్తున్నామని ప్రకటనలు చూశామన్నారు. అయితే జేఏసీ నేతలు స్పష్టంగా సమ్మె ఉపసంహరించుకోవడానికి కారణాలు చెప్పాల్సి ఉంటుందన్నారు.

11/21/2019 - 01:13

హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా ముందుకు వస్తే సమ్మె విరమించడానికి తాము సిద్ధమేనని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆహ్వానం కోసం వేచిచూస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలికినట్లేనని ఆయన ప్రకటించారు. ఎలాంటి నిబంధనలకు తావులేకుండా కేసీఆర్ పిలుపు ఇస్తే సమ్మెకు గుడ్‌బై చెప్పడానికి జేఏసీ సానుకూలంగా ఉందన్నారు.

Pages