S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/20/2019 - 17:54

హైదరాబాద్: ఆదర్శవంతమైన యజమానిగా కార్మికులను చూస్తారని హైకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొన్న విధంగా కోర్టు తీర్పును గౌరవిస్తూ ఏలాంటి షరతులు, ఆంక్షలు విధించకుండా కార్మికులను విధుల్లోకి ఆహ్వానిస్తే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ ప్రతిష్టను ఇనుమడింపజేయటంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని అన్నారు.

11/20/2019 - 17:53

హైదరాబాద్: తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలనకు స్వస్తిపలికే వరకు బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆయన నాగర్‌కర్మూల్‌లో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరంతరం ప్రజల మధ్య ఉంటామని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె వల్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల మధ్య తిరగలేకపోతున్నారని అన్నారు.

11/20/2019 - 13:11

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, నటుడు వెంకటేశ్ ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. రామానాయడు స్టూడియోతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సురేష్‌బాబు పలు సినిమాలను పంపిణీ చేసే బాధ్యతలు కూడా చేస్తున్నారు. ఆయనకు పలు సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి.

,
11/20/2019 - 06:19

కరీంనగర్, నవంబర్ 19: అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యోదంతం నుంచి ఇంకా రెవెన్యూ అధికారులు, సిబ్బంది తేరుకోకముందే భూ సమస్యలు పరిష్కరించడం లేదని ఆగ్రహించిన ఓ రైతు మంగళవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహశీల్‌లో సిబ్బందిపై పెట్రోల్‌తో దాడి మరోమారు కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

11/20/2019 - 05:59

సూర్యాపేట, నవంబర్ 19: నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న చివరి ఎకరా భూమి వరకు సాగునీటిని అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, అంకెల గారడీతో కాకుండా అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూచించారు.

11/20/2019 - 06:27

నిజామాబాద్, నవంబర్ 19: పసుపు దిగుబడులు ఈసారి భారీగానే పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. గడిచిన వారం రోజులుగా ఉద్యానవన శాఖ అధికారులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పసుపు పంటను పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్ చివరి వారం నుండి అక్టోబర్ మాసాంతం వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియడంతో దాని ప్రభావం పసుపు పంటపై పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

11/20/2019 - 05:41

దుబ్బాక, నవంబర్ 19: సీఎం కేసీఆర్ ప్రభుత్వంను కోర్టు బోనులో నిలబెట్టిన చరిత్ర ఆర్టీసీ కార్మికులకే దక్కిందని, ఆర్టీసీ ఆస్తులను సీ ఎం కేసీ ఆర్ దోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మాదిగ రిజరేష్వన్ పోరాట సమితి వ్యవస్ధాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. మంగళవారం దుబ్బాకలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన దీక్షకు మద్దతు ప్రకటించారు.

11/20/2019 - 05:39

మోత్కూర్, నవంబర్ 19: పాఠశాలలో ఉండాల్సిన విద్యార్థిని సొంత పనులకు ఉపయోగించుకున్న ఆరోపణ ఎదుర్కొంటున్న మోత్కూర్ కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల ఎస్‌వో యాదమ్మను మంగళవారం జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, డీఈవో జైని చైతన్య ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట ఎంఈవో రాజారాములు ముత్తిరెడ్డిగూడెం ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సునీత విచారణ జరిపారు.

11/20/2019 - 05:35

నర్సంపేట, నవంబర్ 19: వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ షేక్ యాకూబ్‌పాష (53) మంగళవారం సాయంత్రం గుండెపోటుతో మృతిచెందాడు. జఫర్‌గడ్‌కు చెందిన షేక్ యాకూబ్‌పాష నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా గత 30 ఏళ్ల నుండి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 30 ఏళ్ల క్రితమే నర్సంపేట డివిజన్‌లోని చెన్నారావుపేట మం డలం ఉప్పరపల్లికి వచ్చి స్థిరపడ్డాడు.

11/20/2019 - 04:50

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ
మంగళవారం నానక్‌రామ్ గూడలోని తన నివాసంలో మొక్కలు నాటగా హాజరైన ఎంపీ సంతోష్‌కుమార్

Pages