S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/20/2019 - 04:46

హైదరాబాద్, నవంబర్ 19: ప్రతిరోజు లక్షలాది మంది నగరవాసులను తమ గమ్యస్థానాలకు చేర్చుతున్న మెట్రోరైలు మంగళవారం సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగిపోయింది. నాగోల్ నుంచి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే రైలు సరిగ్గా రాత్రి ఏడు గంటలకు అమీర్‌పేట స్టేషన్ సమీపంలోని పిల్లర్ నెంబర్ 1449కు చేరుకోగానే, ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో ఆగిపోయింది.

11/20/2019 - 02:03

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆరు నగరాల శివార్లలో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలన్న రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదనకు కదలిక వచ్చింది. ఆరు చోట్ల విమానాశ్రయాల ఏర్పాటుపై ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాథమిక అధ్యయనం పూర్తి చేసింది. ప్రస్తుతం సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదిక కోసం రాష్ట్రప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఈ నివేదికను పూర్తి చేసే విషయమై అథారిటీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

11/20/2019 - 01:28

హైదరాబాద్, నవంబర్ 19: ఆర్టీసీ సమ్మె పై హైకోర్టు తీర్పు ప్రతి అందాకే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. కోర్టు తీర్పు ప్రతి తమకు ఇంకా అందలేదని, పైగా దీనిపై తుది తీర్పు బుధవారం వెలువడనుండటంతో అప్పటివరకు ఆగుతామని చెప్పారు. తాము తుది నిర్ణయం తీసుకునే వరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

11/19/2019 - 17:19

హైదరాబాద్: ఆర్టీసీ ప్రవేటీకరణపై క్యాబినెట్‌లో నిర్ణయించటంలో తప్పు ఎలా అవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్టీసీ, ప్రైవేటురవాణా వ్యవస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొంది. సెక్షన్ 102 ప్రకారం ప్రభుత్వం అనుసరించాల్సిన ప్రక్రియ ఏమిటో వివరించాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

11/19/2019 - 17:17

హైదరాబాద్: గత 40 రోజులకు పైగా 50 వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్ హైకోర్టు చేసిన సూచనలు పక్కనపెట్టి నియంతలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. స్వచ్ఛగా తమ భావాలను వ్యక్తంచేసే తెలంగాణ సమాజం కేసీఆర్ చేతిలో నలిగిపోతుందని అన్నారు.

11/19/2019 - 13:51

హైదరాబాద్: నగరు శివారు తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోదాడి జరిగి న హత్యోదంతాన్ని మరువక ముందే మరో ఘటన ఇదే తరహాలో చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి రెవెన్యూ సిబ్బందిపై కనకయ్య అనే రైతు పెట్రో దాడికి పాల్పడ్డాడు. భూమి పట్టాలు ఇవ్వటం లేదంటూ అటెండర్ దివ్య, ఇతర సిబ్బందిపై పెట్రోల్ పోశాడు. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదు.

,
11/19/2019 - 05:31

నల్లగొండ టౌన్, నవంబర్ 18: కార్తీక మాసం సోమవారం పురస్కరించుకుని భక్తుల రద్దీతో ఆలయాలు కిటకిటలాడాయి. మహాశివుడికి అభిషేకాలు, అర్చనలతో శివాలయాలు కిటకిటలాడాయి.

11/19/2019 - 05:26

డిచ్‌పల్లి రూరల్, నవంబర్ 18: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ నసీం నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఉత్తర్వులను అందుకున్న ఆమె, ఆ వెంటనే పూర్వ రిజిస్ట్రార్ డీ.బలరాములు నుండి బాధ్యతలు చేపట్టారు. ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్‌గా సుదీర్ఘకాలం బోధనా అనుభవం కలిగిన ప్రొఫెసర్ నసీం ఇదివరకు తె.యూలో పరిపాలనా బాధ్యతలు సైతం నిర్వర్తించారు.

11/19/2019 - 05:23

ఖమ్మం, నవంబర్ 18: నిత్యం తుపాకీ మోతలతో దద్దరిల్లుతూ అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటున్న ఏజన్సీలో ఎవరి సహకారం లేకుండానే తమంత తామే ప్రాజెక్టులు నిర్మించుకునే స్థాయికి గిరిజనులు చేరుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పలు గ్రామాలు చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సరిహద్దులో ఉంటాయి. ఆ ప్రాంతంలోకి వెళ్ళాలంటే ఎవరైనా భయపడుతుంటారు.

11/19/2019 - 05:23

కరీంనగర్, నవంబర్ 18: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఫోన్ సంభాషణ లీక్ కావడం, మంత్రి గంగుల కమలాకర్ ఫిర్యాదుతో ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగి సమగ్ర సమాచారం సేకరిస్తుండడం మరోసారి చర్చనీయాంశమవుతోంది. వారిద్దరి మధ్య ఏం జరిగింది? వారి సంభాషణ సారాంశం ఏమిటి? అవి నిజంగా వారి గొంతులా? లేక ఫేకా అనే కోణంలో వారు దర్యాప్తు సాగిస్తున్నారు.

Pages