S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/03/2017 - 02:37

హైదరాబాద్, సెప్టెంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా దళితుల పట్ల తెరాస ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని, ఆయా వర్గాల హక్కులను హరిస్తూ వేధింపులకు గురిచేస్తోందని విమర్శించారు. అంతే కాకుండా తెరాస నేతల పంచాయతీలకు పోలీసు స్టేషన్లు వేదికగా మారాయని ఆరోపించారు.

09/03/2017 - 02:36

హైదరాబాద్, సెప్టెంబర్ 2: టిఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ పార్టీ కోవర్టులు ఉన్నారని ఆ పార్టీ నాయకులే అంగీకరించారని టి.పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క అన్నారు. వ్యూహాలు తమకు ఉంటాయని ఆయన తెలిపారు. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డికి తనకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని, కలిసి పని చేస్తున్నామని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో అన్నారు.

09/03/2017 - 02:35

హైదరాబాద్, సెప్టెంబర్ 2: భారత ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు ఆదివారం నాడు హైదరాబాద్ రానున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ న్యాయసదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమం నల్సార్ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరగనుంది.

09/03/2017 - 02:35

హైదరాబాద్, సెప్టెంబర్ 2: ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఐదు సీట్లు కూడా రావని, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క బోగస్ మాటలు మాట్లాడుతున్నాడని ఎంపి బాల్క సుమన్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ విమర్శించారు. శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రులు, టిఆర్‌ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని భట్టి విక్రమార్క చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు.

09/03/2017 - 02:34

హైదరాబాద్, సెప్టెంబర్ 2: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ నుండి ఒకరికి తప్పకుండా చోటు దక్కుతుందని భావిస్తున్న తరుణంలో ఆశావహుల్లో ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి పి మురళీధరరావు, జాతీయ జలవనరుల కమిషన్ సభ్యుడు వెదిరె శ్రీరాం, శాసనసభ బిజెపి పక్ష నాయకుడు జి కిషన్‌రెడ్డి పేర్లు పార్టీ జాతీయ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం.

09/03/2017 - 02:33

హైదరాబాద్, సెప్టెంబర్ 2: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్లు (ఎస్‌ఐ) పోస్టుల భర్తీకి 2016 నవంబర్ 19, 20 తేదీల్లో నిర్వహించిన తుది రాత పరీక్ష ఫలితాలను రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది.

09/03/2017 - 00:21

హైదరాబాద్, సెప్టెంబర్ 2: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాల లభ్యత సంతృప్తికరంగా ఉంది. రాష్ట్రంలో 10.13 మీటర్ల లోతులో భూగర్భ జలాల లభ్యత సగటు నమోదైంది. నిరుడు ఇదే సీజన్‌లో 12.11 మీటర్ల లోతులో భూగర్భ జలాల సగటు నమోదైంది. రాష్ట్రంలో కురిసిన వర్షాలు, మిషన్ కాకతీయ వల్ల చెరువులు అభివృద్ధి చేయడం వల్ల 1.98 మీటర్లపైకి భూగర్భ జలాలు వచ్చాయి.

09/03/2017 - 00:20

హైదరాబాద్, సెప్టెంబర్ 2: తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా బక్రీద్ పండగ ప్రశాంతంగా పూర్తయింది. ఒకవైపు గణేశ్ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్న సమయంలోనే బక్రీద్ కూడా రావడంతో ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకున్నది. మసీదుల వద్ద, గణపతి మండపాల వద్ద పెద్దఎత్తున పోలీసు దళాలను మొహరించింది.

09/03/2017 - 00:20

హైదరాబాద్, సెప్టెంబర్ 2: నైరుతీ రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పంటల పరిస్థితి ఇప్పటి వరకు బాగానే ఉంది. వర్షాధార పంటలు ఇప్పటి వరకు బాగానే ఉన్నాయి. మహబూబ్‌నగర్, నిజామాబాద్, రామగుండం ప్రాంతాల్లో సాధారణం కన్నా కొద్దిగా తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ, పంటల దిగుబడిపై కొంత ప్రభావం కనిపించే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు.

09/03/2017 - 00:23

హైదరాబాద్, సెప్టెంబర్ 2: కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు అంతా తమతో టచ్‌లో ఉన్నారని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Pages