S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/02/2017 - 02:07

హైదరాబాద్, సెప్టెంబర్ 1: భూ బకాసురులకు దోచిపెట్టేందుకే కొత్త రైతు వ్యవస్థను తెలంగాణ సర్కార్ తీసుకు రావాలని చూస్తోందని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

09/02/2017 - 02:05

హైదరాబాద్, సెప్టెంబర్ 1: దేశంలో రానున్న రోజుల్లో నవోదయ విద్యాలయాలు అన్నీ సౌరవిద్యుత్ కాంతులతో నిండనున్నాయి. సంప్రదాయ విద్యుత్ వినియోగాన్ని తగ్గించి సౌరవిద్యుత్ , ఇతర ప్రత్యామ్యాయ ఇంధన వనరులపై ఆధారపడాలని నవోదయ విద్యాలయాల సంఘటన్ భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ సైతం నవోదయ విద్యాలయాలకు సౌరవిద్యుత్ సరఫరాకు వీలుగా అవసరమైన నిధుల కేటాయింపునకు ముందుకువచ్చింది.

09/02/2017 - 02:05

హైదరాబాద్, సెప్టెంబర్ 1: వరంగల్లు అర్బన్ జిల్లా ఐనవోలు మల్లిఖార్జున స్వామి దేవాలయ ట్రస్టు బోర్డును నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఏడాది వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ ట్రస్టుకు ఆలయ ఉప ప్రధాన అర్చకుడు నందనం శివరాజయ్య ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఉంటారని తెలిపింది.

09/02/2017 - 02:04

హైదరాబాద్, సెప్టెంబర్ 1: విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫర్ ఇండియన్ కాపీ రైట్స్ అనే నకిలీ సంస్థను సృష్టించి, దానిలో జూనియర్ ఇన్‌వెస్టిగేటర్స్ ఉద్యోగాల భర్తీ అంటూ ఎర వేసి రూ.3 కోట్లు వసూలు చేసిన నలుగురు నిందితులను టాస్క్ఫోర్స్ అధికారులు కటకటాల వెనక్కి పంపారు.

09/02/2017 - 02:03

హైదరాబాద్, సెప్టెంబర్ 1: శాస్త్ర పరిశోధనా ఫలితాలు సామాన్యులకు చేరిన నాడే దాని ప్రయోజనం ఒనగోరుతుందని, శాస్త్ర పరిశోధనా సంస్థల్లో జరుగుతున్న పరిశోధనలు, వాటి ఫలితాలపై కూడా సామాన్యులకు అవగాహన కల్పించాలని రక్షణ శాఖ సలహాదారు డాక్టర్ సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. సిఎస్‌ఐఆర్ రజతోత్సవాలు సందర్భంగా జహీర్ మెమోరియల్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రత్యేక ప్రదర్శనా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

09/02/2017 - 02:03

హైదరాబాద్, సెప్టెంబర్ 1: వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ నెల 5వ తేదీ మంగళవారం ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలకు ఈ సెలవు వర్తిస్తుందని ప్రభుత్వం శుక్రవారం జివో జారీ చేసింది. ఈ సెలవుకు బదులు ఈ నెల 9 రెండవ శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు యధావిధిగా పని చేస్తాయని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

09/02/2017 - 02:02

హైదరాబాద్, సెప్టెంబర్ 1: రాష్ట్రంలో నిషేధిత భూముల రిజిష్ట్రేషన్లకు సంబంధించి తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా భూ పరిపాలన శాఖ కమిషనర్, సభ్యులుగా రిటైర్డు జడ్జి సయ్యద్ లతీఫ్ ఉర్ రహ్మాన్, సభ్య కన్వీనర్‌గా భూ రికార్డులు, సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

09/02/2017 - 03:31

హైదరాబాద్, సెప్టెంబర్ 1: కర్నాటక రాష్ట్రంలోని నారాయణపూర్ జలాశయం నుంచి జూరాల జలాశయానికి 7 టిఎంసిల నీటిని విడుదల చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ద రామయ్య హామీ ఇచ్చారని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో సిఎల్‌పి నాయకుడు కె. జానారెడ్డి, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు మహ్మద్ షబ్బీర్ అలీ, మాజీ మంత్రులు డికె అరుణ, జి.

09/01/2017 - 23:52

హైదరాబాద్, సెప్టెంబర్ 1: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలోని టీచర్లు, లెక్చరర్లు, వివిధ యూనివర్శిటీల్లోని బోధన, బోధనేతర సిబ్బంది, వివిధ సంస్థల్లో ఉద్యోగులు ఎలుగెత్తి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు వారంతా పింఛను విద్రోహదినం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యోగులు సామూహిక సెలవు పాటిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

09/01/2017 - 23:51

హైదరాబాద్, సెప్టెంబర్ 1: సురక్షిత మంచినీటి సరఫరా, వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మిషన్ భగీరథ బేస్ లైన్ సర్వే సలహా కమిటీ అభిప్రాయపడింది. మిషన్ భగీరథ ప్రాజెక్టు మరింత ప్రభావవంతంగా అమలు కావడానికి బేస్ లైన్ సర్వే నివేదిక ఉపయోగపడుతుందని కమిటీ వివరించింది. అమీర్‌పేట సెస్ సంస్థ కార్యాలయంలో శుక్రవారం మిషన్ భగీరథ బేస్ లైన్ సర్వే సలహా కమిటీ సమావేశం జరిగింది.

Pages