S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/30/2017 - 05:22

సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్.వి.రమణ కూతురు నిశ్చితార్దానికి హాజరయన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

07/30/2017 - 05:15

హైదరాబాద్, జూలై 29: దేశ వ్యాప్తంగా త్వరలోనే ఒకే బస్ బాడీ కోడ్ విధానం రాబోతోందని టిఎస్‌ఆర్‌టిసి ఎండి రమణారావు తెలిపారు. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ బస్‌బాడీ ప్రమాణీకరణ నిమిత్తం జాతీయ రోడ్డు రవాణా సంస్థ ఆదేశాలకు అనుగుణంగా ఒకే బస్‌బాడీ కోడ్ విధానం అమల్లోకి రానుంది. రానున్న బస్‌బాడీ ఎ.ఐ.ఎన్-052 కోడ్ విధానంపై అవగాహన కోసం టిఎస్‌ఆర్‌టిసి శనివారం వర్క్‌షాప్ నిర్వహించింది.

07/30/2017 - 05:14

హైదరాబాద్, జూలై 29: తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల సంక్షేమానికి మూడు పథకాలను రూపొందించారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ సమావేశం శనివారం ఇక్కడ జరిగింది. ప్రభుత్వ న్యాయశాఖ జాయింట్ సెక్రటరీ బాచిన రామాంజనేయులును న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్‌కు కార్యదర్శిగా నియమించారు. చైర్మన్‌గా అడ్వకేట్ జనరల్ ఉంటారు.

07/30/2017 - 05:13

సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహర్ శనివారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కలుసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ దంపతులను గవర్నర్ దంపతులు సాదరపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు అనేక అంశాలపై ఇష్టా గోష్టిగా ముచ్చటించారు.

07/30/2017 - 05:10

హైదరాబాద్, జూలై 29:కెసిఆర్ అద్భుతమైన నాయకుడని ప్రముఖ దర్శకులు రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో ముఖ్యమంత్రిని ప్రశంసలతో ముంచెత్తారు. డ్రగ్స్ కేసులో సినిమా వారి సంబంధాలపై వర్మ ప్రతి రోజూ ట్విట్టర్‌లో తన శైలిలో స్పందిస్తున్నారు. తొలి రోజు విచారణ జరుపుతున్న పోలీసు అధికారుల తీరును విమర్శించారు. విచారణ అనంతరం సినీ తార చార్మి ఝాన్సీ లక్ష్మీబాయిలా కనిపించిందని పొగిడారు.

07/30/2017 - 05:09

హైదరాబాద్, జూలై 29: రాష్ట్ర ఖజనాకు సాలీనా రూ. 4000 కోట్ల ఆదాయం తెచ్చిపెడుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మహర్దశ పట్టనుంది. ఇటీవల వరుస స్కాంలతో తల్లడిల్లుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రధానంగా రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉంటున్నాయి. కనీస వౌలిక సదుపాయాలు లేవు. క్రయ విక్రయదారులు తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

07/30/2017 - 05:07

హైదరాబాద్, జూలై 29: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతుల పట్టాదార్ పాస్‌పుస్తకాలన్నీ డిజిటలైజేషన్ చేసి త్వరలో ఈ-పాస్‌పుస్తకాలను జారీ చేసేందుకు రెవెన్యూ శాఖ నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక మీదట పట్టాదార్ పాస్‌పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకుంటే రోజుల తరబడి వేచి చూసే అవసరం లేకుండా వేగంగా ఈ-పాస్‌పుస్తకాలు జారీ అవుతాయి.

07/29/2017 - 02:51

సిరిసిల్ల, జూలై 28: రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దారి తీస్తున్న నేరెళ్ళ ఉదంతంపై బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిరిసిల్లలో తలపెట్టిన ‘దళిత బలహీన వర్గాల ప్రజా గర్జన’ బహిరంగ సభను పోలీసులు విచ్ఛిన్నం చేశారు. ఈ సభను విజయవంతం చేయడానికి రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన దళిత సంఘాల నేతలు పాల్గొనడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

07/29/2017 - 02:49

భిక్కనూరు, జూలై 28: అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను గుర్తించి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ మం డల కేంద్రమైన భిక్కనూరులో దళితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. స్థానిక సినిమా టాకీస్ చౌరస్తాలో బైఠాయించి ఐదున్నర గం టల పాటు రాస్తారోకో నిర్వహించడం తో రోడ్డుకిరువైపుల వాహనాలు నిలిచిపోయి. ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులెదురయ్యాయి.

07/29/2017 - 02:48

కరీంనగర్, జూలై 28: ఖద్దర్ చొక్కా ధరించే నేతల్లో ఆశలు రేపిన ‘కొత్త’ ఆశలు ఆవిరయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఉండొచ్చనే ఆశతో అధికార తెరాసలోకి పలు పార్టీల నుంచి వలసలు పెరిగాయి. దీంతో ఒకా నొక దశలో ఆయా పార్టీల్లో నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కన్పించింది.

Pages