S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/29/2017 - 02:48

గద్వాల, జూలై 28: ప్రియదర్శిని జూరాల ఆయకట్టు రైతులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సాగునీరు ఎట్టకేలకు శనివారం అధికారులు విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టు నుండి కుడి, ఎడమ కాలువలకు దాదాపు వెయ్యి క్యూసెక్కుల నీటిని సాగునీటి కోసం విడుదల చేస్తున్నట్టు జూరాల అధికారులు తెలిపారు.

07/29/2017 - 02:46

భిక్కనూరు, జూలై 28: భిక్కనూరు మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో వృద్ధురాలు హత్యకు గురైన సంఘటన సంచలనం రేకెత్తింది. రేపొమాపో కాటికి పోయే సమయంలో వృద్ధురాలిని హత్య చేయడాన్ని కాలనివాసులు చలించిపోయారు. మండల కేంద్రానికి చెందిన శివరాత్రి లచ్చమ్మ (74) గురువారం రాత్రి అన్నం తిని తన రేకుల షెడ్డులో నిద్రకు ఉపక్రమించింది. భర్త కొమురయ్య రాత్రి పదిన్నర గంటల సమయంలో బాగా తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు.

07/29/2017 - 02:45

తొర్రూరు, జూలై 28: మహబూబాబాద్ జిల్లా తొర్రూ రు మండలం మడిపల్లి గ్రామంలో దాదాపు 200బస్తాల్లో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న సుమారు రూ.2లక్షల విలువ చేసే 100క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శుక్రవారం తొర్రూరు పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. తొర్రూరు సిఐ వి.చేరాలు, ఎస్సై డి.రమణమూర్తి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..

07/29/2017 - 02:28

హైదరాబాద్, జూలై 28: వచ్చే ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం సాధించడం ఖాయమని ఉప రాష్టప్రతి అభ్యర్ధి ఎం వెంకయ్యనాయుడు జోస్యం చెప్పారు. నరేంద్రమోదీ ప్రధాని అవుతారని పేర్కొన్నారు. ఉప రాష్టప్రతి అభ్యర్ధిగా ప్రకటించిన తర్వాత నగరానికి తొలి సారి వచ్చిన వెంకయ్యనాయుడును పార్టీ నాయకులు అంతా మే ఫెయిర్ కనె్వన్షన్ సెంటర్‌లో ఆత్మీయ అభినందన సభను నిర్వహించారు.

07/29/2017 - 02:26

హైదరాబాద్, జూలై 28: ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి నాణ్యత విషయంలో రాజీ లేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. నాణ్యత తనిఖీలు ఇక మీదట పకడ్బందీగా ఉండాలని, ఎటువంటి లోపాలను ఉపేక్షించ వద్దని ఆదేశించారు. ప్రామాణికతకు, నాణ్యతకు మారుపేరుగా ఆర్‌అండ్‌బి నిర్మాణాలు ఉండాలని ఆదేశించారు.

07/29/2017 - 02:26

హైదరాబాద్, జూలై 28: క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టం (సిసిడిఎన్‌ఎస్) కమిటీ చైర్మన్ రాష్ట్ర డిజిపి అనురాగ్‌శర్మ అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. సిసిటిఎన్‌ఎస్ అభివృద్ధిపై చర్చించారు. కంప్యూటర్లలో సమగ్ర డేటా పొందుపరచాలని, ఎప్పటికప్పుడు డేటా వివరాలను జిల్లా అధికారులు సమీక్షించాలని డిజిపి అనురాగ్ శర్మ అధికారులను ఆదేశించారు.

07/29/2017 - 02:24

హైదరాబాద్, జూలై 28: తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వ్యాపారం జోరందుకోవడానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలేనని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెరాస ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లలో 57 పబ్‌లు ఏర్పాటయ్యాయని అన్నారు. ముంబయి, బెంగుళూరులో అనుమతించని డిజే షోలను తెలంగాణ ప్రభుత్వం స్వాగతించడం దారుణమని అన్నారు.

07/29/2017 - 02:23

హైదరాబాద్, జూలై 28: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పండుగలన్నీ ఘనంగా నిర్వహించుకుంటున్నామని పశు సంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. బోనాలను ప్రశాంతం నిర్వహించుకున్నామని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం నాడిక్కడ మంత్రి నివాసం వద్ద సనత్‌నగర్ నియోజకవర్గంలోని 200 దేవాలయాల కమిటీలకు రూ.53.55 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

07/29/2017 - 02:23

హైదరాబాద్, జూలై 28: సెర్ప్ ఉద్యోగుల సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని, ప్రాధాన్యత క్రమంలో అన్ని అంశాలను పరిశీలిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. శుక్రవారం సచివాలయంలో తెలంగాణ ఐకెపి, సెర్ప్ ఉద్యోగ సంఘంతో మంత్రి సమావేశమయ్యారు.

07/29/2017 - 01:57

హైదరాబాద్, జూలై 28: ప్రభుత్వ ముద్రణాలయాన్ని సమర్ధవంతంగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ కేంద్ర ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 146 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రభుత్వ ముద్రణాలయాన్ని మూసివేయాలని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు.

Pages