S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/29/2017 - 01:57

హైదరాబాద్, జూలై 28: ఇటీవల జరిగిన ఎస్‌సిటి స్‌ఐ,(కమ్యూనికేషన్స్) ఎస్‌సిటి ఎస్‌ఐ (పిటివో) (కమ్యూనికేషన్స్) నియామక ఫలితాలు శనివారం విడుదల కానున్నట్టు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తీతీతీ.ఆఒఔ్ప.జశ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చైర్మన్ పేర్కొన్నారు.

07/29/2017 - 01:56

హైదరాబాద్, జూలై 28: గో సంరక్షణకు తాను అంకితమై పనిచేస్తానని, పోలీసు కేసులకు భయపడేది లేదని గోషా మహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. శుక్రవారం నాడు రాష్ట్ర మంత్రి కె తారకరామారావును కలిసేందుకు సచివాలయానికి వచ్చిన రాజాసింగ్ అక్కడ పాత్రికేయులతో మాట్లాడుతూ ఎంఐఎం ప్రోద్బలంతో తనను పాత కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

07/29/2017 - 01:56

హైదరాబాద్, జూలై 28: రాష్ట్రంలో చేపట్టిన హరితహారం కార్యక్రమం మూడవ దశ 35 శాతానికి పైగా పూర్తయ్యిందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. తాజా లెక్కల ప్రకారం మొత్తం 31 జిల్లాల్లో ఇప్పటి వరకు 40 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. రుతుపవనాల విరామం ఉన్నందున మొక్కల రక్షణకు తగిన తీసుకోవాలని, ఎక్కువ మొక్కలు నాటాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు సూచించారు.

07/29/2017 - 01:53

హైదరాబాద్, జూలై 28: ఎక్సైజ్ సిట్ అధ్వర్యంలో డ్రగ్స్ మాఫియా మూలాలపై దర్యాప్తు కొనసాగుతుండగానే, కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ శుక్రవారం ఓ భారీ డ్రగ్ రాకెట్‌ను ఛేదించింది. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) హైదరాబాద్ విభాగం అధికారులు, మెదక్, నల్గొండ జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. భారీ ఎత్తున మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.

07/29/2017 - 01:50

బోధన్, జూలై 28: మహారాష్ట్ర సర్కారు అనుమతితో మంజీరా నదిలో వెలసిన ఇసుక క్వారీల నుండి తరలుతున్న ఇసుక టిప్పర్లు తెలంగాణ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి గొతున్నాయి. ఇందుకు టిఎస్‌ఎండిసి సిబ్బంది తమవంతు సహకారాన్ని అందిస్తున్నట్లు స్పష్టమయ్యింది. శుక్రవారం బోధన్ తహశీల్దార్ గంగాధర్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది పక్కా ప్రణాళికతో తనిఖీలు నిర్వహించగా ఈ అక్రమాలు వెలుగు చూశాయి.

07/28/2017 - 23:35

హైదరాబాద్, జూలై 28: రాష్ట్రంలో చేపట్టిన రైతు సమగ్ర సర్వే సమాచారాన్ని వచ్చే నెల 17 నాటికి కంప్యూటరీకరణ పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ పార్థసారథి జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడిక్కడ వ్యవసాయ శాఖ కార్యాలయం నుంచి జిల్లా అధికారులతో కమిషనర్ పార్థసారథి, డైరక్టర్ డా.ఎం.జగన్మోహన్ సమీక్ష నిర్వహించారు.

07/28/2017 - 23:35

హైదరాబాద్, జూలై 28: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అస్తవ్యస్తంగా ఉన్న భూముల రికార్డులను సరి చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసినా ఫలితం కనిపించడం లేదు. రెవెన్యూ శాఖలో వివిధ కేటగిరీల సిబ్బంది కొరత ఉండడంతో ఈ ఉద్దేశం నీరుగారుతోంది. రెవెన్యూ శాఖ వద్ద సరైన భూముల రికార్డులు లేకపోవడంతో రికార్డులను సరిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

07/28/2017 - 23:35

హైదరాబాద్, జూలై 28: సింగపూర్ నాన్‌యాంగ్ టెక్నాలజికల్ యూనివర్శిటీ (ఎన్‌టియు) పరిశోధనలకు పెద్ద పీట వేస్తోందని, భారతీయ విద్యార్ధులను దృష్టిలో ఉంచుకుని ఎన్‌టియు ఇండియా కనెక్టు పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు యూనివర్శిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి వి ఆర్ చౌదరి తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన శుక్రవారం నాడు పాల్గొన్నారు.

07/28/2017 - 04:07

అచ్చంపేట, జూలై 27: తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని పొందారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలంగాణలో పర్యటించిన సందర్భంలో తెలంగాణ పోలీసుల సేవలను మెచ్చుకుంటూ వీరి సేవలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని అన్నారని తెలిపారు.

07/28/2017 - 04:05

సిద్దిపేట, జూలై 27 : గత ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యాలయాలను, వైద్యాలయాలను భ్రష్టు పట్టిం చి..నిర్వీర్యం చేసి ...ప్రైవైటు రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాయని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మం త్రి హరీష్‌రావు ఆరోపించారు. ప్రభుత్వ విద్యాలయా ల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవటంతోపాటు ఇబ్బడి..ముబ్బడిగా ప్రైవేటు పాఠశాలలకు, కళాశాలలకు అనుమతులిచ్చి ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించారన్నారు.

Pages