S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/28/2017 - 02:45

హైదరాబాద్, జూలై 27: తెలంగాణ రాష్ట్రంలో వర్తకులు, వాణిజ్యవేత్తలంతా తమ వ్యాపార భవనాలపై ఏర్పాటు చేసే సైన్‌బోర్డులపై ‘జిఎస్‌టిన్’ నెంబర్లు తప్పనిసరిగా రాయాలని రాష్ట్ర పన్నుల శాఖ కమిషనర్ వి. అనిల్‌కుమార్ తెలిపారు. జిఎస్‌టి పరిధిలోకి వచ్చే డీలర్లు, వ్యాపారులకు ఆయన గురువారం కొన్ని సూచనలు చేస్తూ, ప్రకటన చేశారు.

07/28/2017 - 02:44

హైదరాబాద్, జూలై 27: ‘అద్దెగర్భశిశువు’ (సరోగసి) లను అసలైన తల్లిదండ్రులకు (కమిషన్డ్ పేరెంట్స్) అప్పగించే అంశంపై రాష్ట్రప్రభుత్వమే సరైన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. అద్దెగర్భస్థశిశువులపై సూమోటోగా నమోదైన కేసు విచారణ సందర్భంగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి టి.

07/28/2017 - 02:44

హైదరాబాద్, జూలై 27: వ్యవసాయ, ఉద్యాన, పశుపోషణ రంగాల్లో బ్రెజిల్ సహకారం అవసరమని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. బ్రెజిల్ దేశం తరఫున తెలంగాణలో పర్యటించిన ఉన్నతాధికార బృందంతో తెలంగాణకు చెందిన వివిధ శాఖల అధికారులు చర్చలు జరిపారు. వ్యవసాయ, ఉద్యాన, పశుపోషణ, టూరిజం తదితర రంగాల్లో తెలంగాణ పరిస్థితి గురించి అధికారులు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు.

07/27/2017 - 23:11

హైదరాబాద్, జూలై 27: తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్ల బిఇడి కోర్సులో చేరేందుకు నిర్వహించిన ఎడ్‌సెట్ -2017 ప్రవేశపరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి గురువారం సాయంత్రం విడుదల చేశారు. 16వ తేదీన నిర్వహించిన పరీక్ష ఫలితాలను రికార్డు సమయంలో అనుకున్న సమయం కంటే ముందే విడుదల చేసినట్టు ఆయన చెప్పారు.

07/27/2017 - 23:11

హైదరాబాద్, జూలై 27: డ్రగ్స్ మాఫియా వ్యవహారాన్ని మొత్తం పర్యవేక్షించేందుకు అదనపు డిజి లేదా ఐజి స్ధాయి సీనియర్ ఐపిఎస్ అధికారిని నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం డ్రగ్స్ మాఫియా కేసును దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకుల్ సబర్వాల్‌పై పని భారం వత్తిడి పెరిగింది. పైగా ఈ కేసు వివిధ రాష్ట్రాలకు విస్తరించి ఉంది.

07/27/2017 - 02:30

న్యూఢిల్లీ, జూలై 26: స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం నాడు కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో జూపల్లి భేటీ అయ్యారు.

07/27/2017 - 02:29

హైదరాబాద్, జూలై 26: ఉద్యోగాల్లో జోనల్ వ్యవస్థ రద్దు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఆచరణ సాధ్యమేనా? జోనల్ వ్యవస్థ తలనొప్పులను తగ్గించుకోవడానికి రెండంచెల విధానాన్ని అమలు చేయాలన్న ప్రభుత్వ ఆలోచనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

07/27/2017 - 02:29

హైదరాబాద్, జూలై 26: తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరిస్తామని, ఉన్న పళంగా సమ్మెకు వెళ్లవద్దని రేషన్ డీలర్లకు రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ సివి ఆనంద్ సూచించారు. 2017 ఆగస్టు 1 నుండి సమ్మె చేస్తామంటూ డీలర్లు ప్రభుత్వానికి నోటీసు ఇవ్వడంతో కమిషనర్ స్పందించి, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులతో బుధవారం ఆయన చర్చించారు.

07/25/2017 - 02:42

హైదరాబాద్, జూలై 24: తెలంగాణ ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌కు గవర్నర్ నరసింహన్ సహా పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రాజ్‌భవన్ నుంచి మంత్రి కెటిఆర్‌కు గ్రీటింగ్‌తో పాటు అద్భుతమైన పూల మొక్కను బహుమానంగా పంపించారు. ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు.

07/25/2017 - 02:42

హైదరాబాద్, జూలై 24: అధికారిక కార్యక్రమాలు, శాఖల వారీగా సమీక్షలతో నిత్యం బిజీగా ఉండే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఒక సినిమా చూశారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్ సారధ్యంలో నిర్మించిన ‘్ఫదా’ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి కథాంశంగా లవ్ ఎంటర్‌టైనర్‌ను అద్భుతంగా తెరకెక్కించారని ముఖ్యమంత్రి అభినందించారు.

Pages