S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/28/2017 - 04:03

సిద్దిపేట, జూలై 27 : దేశంలోని లౌకిక వాద పార్టీలు ఏకపై మత తత్వ పార్టీ బిజెపికి బుద్ది చెప్పాలని ఏఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపి వి.హ న్మంత్‌రావు పిలుపునిచ్చారు. బీహార్ లో లాలు ప్రసాద్‌పై కేంద్ర సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విహెచ్ ఆరోపించారు. గురువారం సిద్దిపేట జిల్లా పొన్నాల వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

07/28/2017 - 04:00

నల్లగొండ లీగల్, జూలై 27: భూవివాదంలో తన కేసును నీరుగార్చే రీతిలో వ్యవహరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తు వేధింపులకు పాల్పడుతున్న కోర్టు బెంచ్ క్లర్క్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం నల్లగొండ జిల్లా కోర్టులో ఓ మహిళ భవనంపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నంతో హల్‌చల్ సృష్టించింది.

07/28/2017 - 03:57

వరంగల్, జూలై 27: రాష్ట్రంలో అధికార పార్టీ విచ్చలవిడినతంతో వ్యవహరిస్తోందని, అధికారం ఉందనే అహంతో సమస్యలను ప్రస్తావిం చే ప్రతిపక్షాలపై తిట్లదండకానికి దిగటం, ప్రతిపక్ష పార్టీల నాయకులపై వేధింపులకు పాల్పడటం, కేసులు నమోదు చేయటం షరామామూలు కార్యక్రమంగా మారిపోయిందని రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

07/28/2017 - 03:44

న్యూఢిల్లీ, జూలై 27: నూతన రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారంనాడు టిఆర్‌ఎస్ ఎంపీలు, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, మంత్రి జగదీష్‌రెడ్డిలతో కలసి ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్టప్రతి భవన్‌లో రామ్‌నాథ్‌తో సమావేశమయ్యారు. రాష్టప్రతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రామ్‌నాథ్ కోవింద్‌కు కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

07/28/2017 - 03:36

హైదరాబాద్, జూలై 27: తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నది కెసిఆర్ కాదని, పలు మాఫియాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. భూమి, ఇసుక, డ్రగ్స్, గనుల మాఫియాలు రాష్ట్రంలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని అన్నారు.

07/28/2017 - 03:34

హైదరాబాద్, జూలై 27: ఎన్‌డిఎ ఉప రాష్టప్రతి అభ్యర్ధి ఎం వెంకయ్యనాయుడుకు గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో అఖండ స్వాగతం లభించింది. మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో బిజీ బిజీగా వెంకయ్యనాయుడు గడపనున్నారు. చెన్నై నుండి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న వెంకయ్యనాయుడుకు ఉప రాష్టప్రతికి లభించే స్వాగతం తరహాలోనే పార్టీ నేతలు అఖండ స్వాగతం పలికారు.

07/28/2017 - 03:30

హైదరాబాద్, జూలై 27: ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించడానికి పకడ్భంది ప్రణాళిక రూపొందించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సిఎస్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

07/28/2017 - 02:49

హైదరాబాద్, జూలై 27: పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్ ఇంటిపై ఏసిబి అధికారులు దాడి చేశారు. కూకట్‌పల్లి ఆదిత్యనగర్‌లో నివాసముంటోన్న తెలంగాణ పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్ ఎడ్ల గంగాధర్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్న అభియోగాలపై అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించింది. గంగాధర్‌రెడ్డి ఇంటితో సహ అతని బంధువులు, పలుచోట్ల ఆస్తులపై ఏసిబి ఆరా తీస్తోంది.

07/28/2017 - 02:47

హైదరాబాద్, జూలై 27: మున్సిపల్ కమిషనర్లకు అదనంగా మ్యారేజ్ ఆఫీసర్ హోదాను తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఇప్పటి వరకు సబ్ రిజిష్ట్రార్ మాత్రమే వివాహాలను నమోదు చేసుకుని, ధృవీకరణ పత్రం సమర్పిస్తున్నారు. ఇప్పుడు స్ధానిక సంస్థల్లోనూ వివాహ ధృవీకరణ పత్రాలను జారీ చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.

07/28/2017 - 02:46

హైదరాబాద్, జూలై 27: పాఠశాలలు మూసివేతకు నిరసనగా ధర్నా నిర్వహించిన తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. గన్ పార్కు వద్ద కమిటీ శాంతియుతంగా చేపట్టిన నిరసన ప్రదర్శనను పోలీసులు భగ్నం చేసి నేతలను అరెస్టు చేయడాన్ని తెలంగాణ టీచర్సు ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది.

Pages