S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/01/2019 - 01:28

హైదరాబాద్: శాసనసభ కార్యదర్శి వేదాంతం నరసింహాచార్యుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ సాధారణ పరిపాలనశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసిం ది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన పదవిలోనే కొనసాగుతారని ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి పేర్కొన్నా రు. నరసింహాచార్యులు అక్టోబర్ 31న పదవీ విరమణ చేశారు. అయితే ఆయన సేవలను ఉపయోగించుకోవడానికి పదవీ కాలాన్ని పొడిగించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

11/01/2019 - 01:28

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై మరింత ముందుకే వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమ్మె నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర మంత్రివర్గం శనివారం సమావేశం కాబోతుంది. ప్రగతిభవన్‌లో శనివారం సాయంత్రం 3 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరగనుంది.

, ,
10/31/2019 - 23:26

కరీంనగర్: హైదరాబాద్‌లో జరిగిన సకల జనుల సమరభేరి సభకు బుధవారం హాజరై గుండెపోటుతో మృతి చెందిన కరీంనగర్ 2-డిపో డ్రైవర్ ఎన్.బాబు మృతదేహం గురువారం కరీంనగర్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో అఖిలపక్షాలు బంద్‌కు పిలుపునివ్వడం, దీంతో అగ్గి రాజుకొని ఆర్టీసీ కార్మికుల, అఖిలపక్షాల ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. ఇక చావో రేవో తేల్చుకొనేందుకు బాబు ఇల్లు వేదికైంది.

10/31/2019 - 23:22

శ్రీరంగాపురం, అక్టోబర్ 31: బతికుండగా ఉండటానికి ఎలాగూ సొంత ఆవాసం లేదు.. కనీసం చచ్చిన తర్వాతైనా అంతిమ సంస్కారాలు చేయడానికి ఆరడుగుల నేల కూడా లేని దుస్థితి వారిది. ఆ గ్రామంలో ఎవరైనా మరణిస్తే దహన సంస్కారాలకు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన దైన్యం తమదని వారు వాపోతున్నారు.

10/31/2019 - 23:20

మహబూబ్‌నగర్, అక్టోబర్ 31: మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న ఐటీ కారిడార్‌లో దేశ విదేశాల్లోని ప్రసిద్ధ పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పలువురు పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు చేశారని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

10/31/2019 - 23:18

సంగారెడ్డి, అక్టోబర్ 31: శిక్షా కాలం పూర్తయ్యాక సమాజంలో గౌరవంగా బతికేలా ఖైదీలకు ఉపాధి రంగాల్లో శిక్షణను ఇస్తూ తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ దేశానికే ఆదర్శంగా నిలిచిందని హోం, జైళ్లు, అగ్నిమాపక శాఖ మంత్రి ఎండీ.మహమూద్ అలీ పేర్కొన్నారు.

10/31/2019 - 23:16

సూర్యాపేట, అక్టోబర్ 31: ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్నంతా కొనుగోలు చేసేలా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని సీతారామ ఫంక్షన్‌హాల్‌లో ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలుపై గురువారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా మాట్లాడారు.

10/31/2019 - 05:40

హైదరాబాద్, అక్టోబర్ 30: ఆర్టీసీ కార్మికుల సమ్మెను పరిష్కరించేందుకు చొరవ తీసుకోకుండా, కోర్టుల ఆదేశాలను బేఖాతరు చేయడం సీఎం కేసీఆర్‌కు తగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఆర్టీసీ అంశంపై కోర్టులో వాదనలు జరుగుతుంటే, మరో పక్క ప్రైవేట్ బస్‌లకు పర్మిట్‌లు ఇవ్వడమేంటన్నారు. ఆర్టీసీలో కేంద్రం వాటా 30 శాతం ఉందన్నారు.

10/31/2019 - 05:38

హైదరాబాద్, అక్టోబర్ 30: ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణం ఆమోదించాలని, బస్సుల సమ్మెకు ముఖ్యమంత్రి ముగింపు పలకాలని నిమ్స్‌లో ఐదు రోజులుగా నిరవధిక దీక్ష కొనసాగిస్తున్న సీపీఐ సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. బుధవారం నాడు అనేక మంది వామపక్ష నేతలు కూనంనేనిని కలిసి పరామర్శించారు.

,
10/31/2019 - 05:36

హైదరాబాద్: ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారా అంటూ కాంగ్రెస్ రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆర్టీసీ జేఏసీ నేతృత్వంలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సభకు రేవంత్‌రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రేవంత్‌రెడ్డి సభలోకి వస్తున్న సమయంలోనూ, మాట్లాడుతున్న సమయంలోనూ కార్మికులు పెద్ద ఎత్తున హర్షద్వానాలు చేశారు.

Pages