S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/02/2019 - 22:47

గజ్వేల్, నవంబర్ 2: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయిన ఆర్టీసీ కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక చైర్మన్ మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ జీపీపీ డిపో వద్ద ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించి ఆయన మాట్లాడారు.

11/02/2019 - 16:48

ఖమ్మం: జిల్లాలో సత్తుపల్లి కేంద్రంగా సాగుతున్న దొంగనోట్ల ముఠా గుట్టును రట్టు చేశారు. దాదాపు రూ.7కోట్ల విలువ చేసే నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నగర పోలీసు కమిషనర్ ఇక్బాల్ మీడియాతో మాట్లాడుతూ అమాయకులకు డబ్బు ఆశ చూపి ఈ ముఠా తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో నకిలీ నోట్లను చెలామణి చేస్తుందని అన్నారు.

11/02/2019 - 12:38

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఆయన అప్పటికప్పుడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి ఆర్టీసీ సమ్మెపై నివేదికను ఇవ్వనున్నారు. కాగా లక్ష్మణ్ ఢిల్లీ వెళ్లే ముందు తెజస అధ్యక్షుడు కోదండరామ్ రెడ్డి, ఆర్టీసీ ఐకాసా అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డిని కలిసిన విషయం విదితమే.

11/02/2019 - 01:12

సిద్దిపేట, నవంబర్ 1 : రాష్ట్రంలో తొలిసారిగా సిద్దిపేట నియోజకవర్గంలో గొర్రెల హాస్టల్స్ నిర్మించామని...ఇదే తరహాలో బర్రెలకు హాస్టల్స్ నిర్మించి ఆదర్శంగా నిలవాలన్నదే తన సంకల్పమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. గొర్రెలు, బర్రెల హాస్టల్స్‌కు రెండు ఉద్దేశాలు, లక్ష్యాలున్నాయని, ఈ నిర్మాణాలతో రైతులకు, గ్రామ ప్రజలకు మేలు జరగాలన్నదే ప్రధాన లక్ష్యమని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.

11/01/2019 - 23:48

హైదరాబాద్, నవంబర్ 1: మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించనున్నట్టు అధికార వర్గాల సమాచారం. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అక్టోబర్ నెలాఖరులోనే షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. అయితే హైకోర్టు సింగిల్ బెంచ్ వద్ద కొన్ని కేసులు పెండింగ్‌లో ఉండడంతో షెడ్యూల్‌ను ప్రకటించలేదు.

11/01/2019 - 23:46

హైకోర్టులో ఆర్టీసీ ఎండీ వాదనలపై ఆర్టీసీ కార్మికుల జాక్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టీసీ గురించి మాట్లాడకుండా జీహెచ్‌ఎంసీ ఇబ్బందుల్లో ఉం దని చెప్పడం విడ్డూరమని కార్మిక సంఘాల జాక్ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. హైకోర్టులో వాదనల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభు త్వం కళ్లు తెరవాలని వ్యాఖ్యానించారు. ఇద్దరు ఐఏఎస్ లు ప్రభుత్వం చెప్పింది రాసుకొచ్చారని విమర్శించారు.

11/01/2019 - 23:21

హైదరాబాద్, నవంబర్ 1: విత్తనోత్పత్తికి తెలంగాణ రాష్ట్రం అత్యంత అనుకూలమైన ప్రదేశమని ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా యూరప్ కంపెనీలను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆహ్వానించారు. జర్మనీ పర్యటనకు వెళ్లిన మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం మూడో రోజు బోన్ పట్టణంలో జర్మన్ ప్లాంట్ బ్రీడర్స్ అసొసియేషన్‌తో సమావేశమయ్యారు.

11/01/2019 - 23:19

హైదరాబాద్, నవంబర్ 1: ఈ ఏడాది అక్టోబర్ నెల వరకు రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి శాతం తగ్గుముఖం పట్టిందని, దీనిని అధిగమించడానికి యుద్ధప్రాతిపదికన రోజూ 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో శుక్రవారం సింగరేణి సీఎండీ ఏరియాలో మేనేజర్లతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.

11/01/2019 - 23:19

హైదరాబాద్, నవంబర్ 2: రాష్ట్రప్రభుత్వం ఆరోగ్యశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, మాఫియా చేతిలో బందీ అయినట్లుగా అనిపిస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత ఎన్ రాంచందర్ రావు అన్నారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా వందలాది మంది డెంగ్యూ జ్వరం బారినపడి మరణిస్తున్నా, కేసీఆర్ సర్కార్క్ కనీస చర్యలు చేపట్టకపోవడం వెనక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు.

11/01/2019 - 23:18

హైదరాబాద్, నవంబర్ 1: రాష్ట్రంలోని బాలల హక్కులు, సంక్షేమం కోసం ఎంతవరకు వెళ్లి అయినా పనిచేస్తుందన్న నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపైన ఉందని గిరిజన సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బాలల హక్కుల సంరక్షణ రాష్ట్ర కమిషన్ నూతనంగా ఏర్పాటైన సందర్భంగా శుక్రవారం ఇక్కడ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయిల సమావేశంలో ఆమె ప్రసంగించారు.

Pages