S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/01/2019 - 05:58

హైదరాబాద్, అక్టోబర్ 31: ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా దశలవారీ ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని ఎఐసీసీ ఆదేశించినట్లు ఎఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ ఆర్‌సీ కుంతియా అన్నారు. ఈ కార్యక్రమం కింద ఈ నెల 8వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ధర్నాలు నిర్వహించాలన్నారు.

11/01/2019 - 05:57

హైదరాబాద్, అక్టోబర్ 31: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జాక్టో వివిధ కార్యక్రమాల్లో పాల్గొందని, సీఎం హామీ ఇచ్చినట్టు వెంటనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని జాక్టో నేతలు గురువారం నాడు కోరారు.

11/01/2019 - 05:57

హైదరాబాద్, అక్టోబర్ 31: మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించేందుకు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. మహిళలు యోగా నేర్చుకోవాలని ఆమె కోరారు. నడవడం కంటే పరుగెత్తం, వేగంగా నడవడం అలవాటు చేసుకోవాలన్నారు. తెలంగాణలో మహిళలు సంప్రదాయ పద్థతుల్లో ఆత్మగౌరవంతో హుందాగా ఉంటారని, తమిళ, తెలంగాణ సంస్కృతుల మధ్య పెద్ద వ్యత్యాసం కనపడదని ఆమె అన్నారు.

11/01/2019 - 05:56

హైదరాబాద్, అక్టోబర్ 31: రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి వి నిరంజన్‌రావు తన పదవి కాలం ముగియకముందే గురువారం స్వచ్చందంగా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణకు నిరంజన్‌రావు చేసుకున్న అభ్యర్థన మేరకు ఆయన్ను రిలీవ్ చేస్తూ సాధారణ పరిపాలనాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన పదవీ కాలం 2020, జనవరి 31న ముగియనుంది. అయితే మూడు నెలల ముందుగానే పదవి నుంచి తప్పుకోవడానికి కారణం ఏమిటన్నది తెలియరాలేదు.

11/01/2019 - 05:56

హైదరాబాద్, అక్టోబర్ 31: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిమ్స్‌లో నిరవధిక దీక్ష కొనసాగిస్తున్న కూనంనేని సాంబశివరావు వైద్యుల సూచన మేరకు గురువారం నాడు దీక్షను విరమింపచేశారు. సాంబశివరావు ఆరోగ్యం క్షీణించిందని, ఆందోళనకరంగా ఉందని వైద్యులు పేర్కొనడంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సహా పలువురు నేతలు ఆస్పత్రికి వెళ్లి సాంబశివరావు దీక్షను విరమించపచేశారు.

11/01/2019 - 05:51

హైదరాబాద్, అక్టోబర్ 31: ఆర్టీసీ సమ్మెను విరమించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని రాష్ట్ర హైకోర్టు సూచించినా ఫలితం దక్కలేదని, ఇక మీరే మాకు దిక్కు అంటూ అఖిలపక్ష నేతలు గవర్నర్‌ను కోరారు. గురువారం అఖిలపక్ష నేతలు గవర్నర్ కలసి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని వారు సూచించారు.

11/01/2019 - 05:34

వరంగల్, అక్టోబర్ 31: వరంగల్ నగరంలోని హన్మకొండ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తన్న ఏ.రవీందర్‌కు గురువారం సాయత్రం గుండె పోటు వచ్చింది. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన రవీందర్ హన్మకొండ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్టీసీ సమ్మెతో తీవ్ర మనస్థాపానికి గురై అస్వస్థతకు గురై గుండె పోటు రావడంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

11/01/2019 - 05:32

హైదరాబాద్, అక్టోబర్ 31: ఇంజనీరింగ్ యూజీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన వారు తమ ఒరిజినల్ సర్ట్ఫికెట్ల కోసం వారు చదివిన కాలేజీలకో లేదా సంబంధిత యూనివర్శిటీలకో తప్పనిసరి వచ్చి తీసుకోవల్సిన అవసరం ఇక మీదట ఉండదు. జేఎన్‌టీయూ హైదరాబాద్ అభ్యర్ధుల నివాసాలకే వారి సర్ట్ఫికెట్లను పంపించాలని నిర్ణయించింది. చాలా మంది గ్రాడ్యూయేట్లు చదువు పూర్తయిన తర్వాత విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు.

11/01/2019 - 05:29

హైదరాబాద్, అక్టోబర్ 31: సాంకేతిక పరిజ్ఞానం తోడ్పాటుతో వివిధ భవనాల నిర్మాణాలకు అనుమతుల మంజూరును సరళీకృతం చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. గురువారం ఇక్కడ ఆయన భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం వౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

11/01/2019 - 05:28

వరంగల్, అక్టోబర్ 31: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం వరంగల్ అర్బన్ జిల్లాలోని ఏనుమాముల మార్కెట్ యార్డులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నెలకొల్పిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

Pages