S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/03/2019 - 02:50

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏను ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. శనివారం ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను ముఖ్యమంత్రి మీడియాకు వివరిస్తూ, ఉద్యోగులకు ఏటా రెండు డీఏలు ఇవ్వాల్సి ఉంటుందని, ప్రస్తుతానికి ఒక డీఏ ఇస్తున్నామన్నారు. 2019 జనవరి 1 నుండి 1 జూలై వరకు ఇవ్వాల్సిన 3.144 శాతం డీఏను ఇస్తామన్నారు.

11/03/2019 - 02:48

హైదరాబాద్, నవంబర్ 2: వంతెనల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రధాన జాతీయ రహదారుల్లో వెవల్‌కాజ్‌వేలు ఎక్కువగా ఉన్నాయని వాటిని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.2,495 కోట్లను కేటాయించారని మంత్రి తెలిపారు.

11/03/2019 - 02:47

హైదరాబాద్, నవంబర్ 2: బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు ‘్ధర్మికవరేణ్య’ బిరుదు ఇస్తున్నామని దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక సంపాదకులు ఎంవీఆర్ శర్మ తెలిపారు. దర్శనమ్ మాసపత్రిక నేతృత్వంలో ఏటా ‘గురువందమ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

11/03/2019 - 01:21

హైదరాబాద్, నవంబర్ 2: రాష్ట్రం లో పత్తి రైతాంగాన్ని కేంద్రం ఆదుకుంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ సహా య మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో పత్తి కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 50 లక్షళ ఎకరాల్లో 22 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోందన్నారు.

11/03/2019 - 02:25

హైదరాబాద్: తూర్పు కనుమలు భారత వారసత్వ సంపద అని, వాటిని కాపాడుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర మాజీ మంత్రి, అడవులు, పర్యావరణం, శాస్తస్రాంకేతిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ జైరాం రమేశ్ అన్నారు. పర్యావరణ పరిరక్షణకు మరిన్ని, లోతైన అధ్యయనాలు అవసరమని అభిప్రాయపడ్డారు.

11/03/2019 - 01:16

హైదరాబాద్, నవంబర్ 2: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. విలీనం చేయకూడదని మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రగతి భవన్‌లో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం రాత్రి 8 గంటల వరకూ కొనసాగింది. ఆ తర్వాత కేసీఆర్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వివరించారు.

,
11/02/2019 - 22:56

తాడ్వాయి, నవంబర్ 2: సమ్మక్క-సారలమ్మ జాతరను ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారమే నిర్వహిస్తామని ములుగు జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి అన్నారు. శనివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

11/02/2019 - 22:53

మహబూబ్‌నగర్, నవంబర్ 2: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు డీజీపీ తక్షణమే క్షమాపణ చెప్పాలని, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై పోలీసులు చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ నేతలు మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ చేపడుతున్న సంకల్పయాత్రలో భాగంగా శనివారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించారు.

11/02/2019 - 22:50

సంగారెడ్డి, నవంబర్ 2: సూర్యోదయంతో వికసించేది తామర పష్పం అయితే, చంద్రోదయంతో వికసించే సద్గుణం కలిగింది ఒక్క బ్రహ్మ కమలం మాత్రమే. దక్షిణ భారతదేశంలో చెరువులు, చిన్న చిన్న జలపాతాల్లో తామర పువ్వు లు కుప్పలు తెప్పలుగా పుష్పించి కనువిందు చేస్తే, అరుదుగా బ్రహ్మ కమలం వికసిస్తే ఆ కుటుంబానికి, ఇరుగుపొరుగు వారికి పట్టరాని ఆనందం కలగడం సహజమే.

11/02/2019 - 22:49

కరీంనగర్, నవంబర్ 2: ఎంపీనని తెలిసి ఖాకీలు కాలర్ పట్టుకొని చేయి చేసుకున్నా రాష్ట్ర హోంమంత్రి, డీజీపీలు ఏం చేస్తున్నట్టూ..? ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పోలీసులు గులాంలా? అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.

Pages