S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/12/2016 - 05:02

హైదరాబాద్, డిసెంబర్ 11: ‘రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేకుండా బాధపడకూడదన్నది నా అభిమతం. అందుకే నిబంధనల ప్రకారం సాధ్యం కాదంటున్నా మానవతా దృక్పథంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను దశల వారీగా క్రమబద్ధీకరించాలని నిర్ణయించాం’ వారం రోజుల కిందట విద్యుత్‌శాఖ ఉద్యోగుల సమ్మె నోటీసుపై స్పందిస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన ఇది. ‘ఒకే పని చేసే ఉద్యోగులకు ఒకేరకంగా వేతనం ఉండాలి.

12/12/2016 - 05:01

హైదరాబాద్, డిసెంబర్ 11: బిజెపి నేతల గొంతుల్లో వెలక్కాయ పడ్డ చందంగా పెద్ద నోట్ల రద్దు అంశం పడింది. ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని తెలంగాణ పార్టీ నేతలు గుర్తించారు. పెద్ద నోట్ల రద్దు చేయడం వల్లే నల్ల కుబేరులు బయట పడుతున్నారని ప్రచారం చేయడంతో పాటు మొబైల్, క్రెడిట్, డెబిట్ కార్డులు.

12/12/2016 - 05:00

పరకాల, డిసెంబర్ 11: నిషిద్ధ సిపిఐ మావోయిస్టు పార్టీ చర్ల-వెంకటపూర్ ఏరియా డివిజనల్ కమిటీ సభ్యుడు కుక్కల గణపతి అలియాస్ రాజు, అతని భార్య చెన్నూరి సర్వక్క అలియాస్ స్వరూప ఆదివారం భూపాలపల్లి జిల్లా ఎస్పీ భాస్కరన్ ఎదుట లొంగి పోయారు.

12/12/2016 - 04:57

హైదరాబాద్/బేగంపేట, డిసెంబర్ 11: హైదరాబాద్‌లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతోన్న కరుడుగట్టిన చైన్ స్నాచర్‌ను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 60 తులాల బంగారు ఆభరణాలు, బైక్, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గొలుసు దొంగతోపాటు దొంగ బంగారం కొనుగోలు చేసిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు టాస్క్ఫోర్స్ డిసిపి వై లింబారెడ్డి ఆదివారం విలేఖరులకు తెలిపారు.

12/12/2016 - 03:09

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైద్య రంగం గాడిలో పడిందని, ప్రజావైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి తెలిపారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ అలుమ్ని (పూర్వ విద్యార్థుల) అసోసియేషన్ గ్లోబల్ మీట్ ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడారు.

12/12/2016 - 03:07

హైదరాబాద్, డిసెంబర్ 11: నాగర్‌కర్నూలు, వనపర్తి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు సాగునీటిని, తాగునీటిని అందించేందుకు రూపొందించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు, నాగర్‌కర్నూలు, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మరికొన్నిప్రాంతాలకు సాగునీటిని, తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.

12/12/2016 - 03:05

సిద్దిపేట, డిసెంబర్ 11 : తెలంగాణ ఫిలిం చాంబర్స్‌కు కేంద్ర ప్రభుత్వం సినిమాలకు సెన్సార్, టైటిల్ రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని కల్పించిందని తెలంగాణ ఫిలిం చాంబర్స్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ వెల్లడించారు. తెలంగాణ ఫిలిం చాంబర్స్ స్థాపించిన రెండేళ్లలో మంచి ఫలితాలు సాధిస్తోందన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

12/12/2016 - 03:03

హైదరాబాద్, డిసెంబర్ 11:దేశంలో రెండవ నగదు రహిత గ్రామం ఇబ్రహీంపూర్ గ్రామం నిలిచినందుకు కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు ట్విట్టర్‌లో అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామం దేశంలో రెండవ నగదు రహిత గ్రామంగా నిలిచిందని తెలిపారు. వెంకయ్యనాయుడు ట్విట్టర్ అభినందనలకు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలుపుతూ రీ ట్విట్ చేశారు.

12/11/2016 - 07:07

కొత్తూరు, డిసెంబర్ 10: పోలీసుల తనిఖీల్లో 82.21 లక్షల కొత్త, పాత కరెన్సీ పట్టుబడినట్లు రంగారెడ్డి జిల్లా కొత్తూరు రూరల్ సిఐ మధుసూదన్ తెలిపారు. శనివారం ఇక్కడి పోలీస్ స్టేషన్‌లో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు.

12/11/2016 - 07:05

హైదరాబాద్/ ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 10: సీనియర్ పోస్టల్ అధికారి సుధీర్‌బాబు బంధువుల ఇళ్లల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని నాలుగు ఇళ్ళలో సోదాలు జరిగాయి. ఇబ్రహీంపట్నంలోని సుధీర్ బాబు బంధువు తులసీరాంనాయక్ ఇంట్లో జరిపిన సోదాలలో రూ. 70 లక్షల కొత్త రెండు వేల రూపాయల నోట్లను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు సుమారు రూ.

Pages