S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/13/2016 - 02:49

హైదరాబాద్, డిసెంబర్ 12: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు లక్షల పేద క్రైస్తవ కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నగరంలో లక్ష కుటుంబాలకు, జిల్లాల్లో మరో లక్ష కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 18న ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

12/13/2016 - 02:48

నాగార్జునసాగర్, డిసెంబర్ 12: నాగార్జునసాగర్ జలాశయం నుండి ఎడమకాల్వ ద్వారా విడుదల చేస్తున్న నీటిని సోమవారం నాడు డ్యాం అధికారులు నిలిపివేశారు. ఎడమకాల్వకు ఆరుతడి పంటలకు గాను నీటివిడుదల చేసిన అధికారులు గతంలో నీటివిడుదల నిలిపివేశారు.

12/13/2016 - 02:47

హైదరాబాద్, డిసెంబర్ 12: వారానికి ఒక పర్యాయం ప్రజల అవసరాలకోసం తాగునీటిని ఇవ్వడం కూడా గగనంగా ఉన్న వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని తాగునీటి సరఫరాకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ జిల్లాలు తరచూ కరవు బారిన పడుతుండటంతో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది.

12/13/2016 - 02:40

హైదరాబాద్, డిసెంబర్ 12: రవాణాశాఖలో వంద శాతం నగదు రహిత కార్యకలాపాలు నిర్వహించనున్నట్టు, దీని కోసం అవసరం అయిన ఏర్పాట్లు చేస్తున్నట్టు రవాణాశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి పూర్తి స్థాయిలో నగదు రహిత కార్యకలాపాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. నగదు రహిత కార్యకలాపాల్లో తెలంగాణ రవాణాశాఖ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచినట్టు చెప్పారు.

12/13/2016 - 02:40

హైదరాబాద్, డిసెంబర్ 12: ఎన్‌ఆర్‌ఐ పాలసీ తెస్తున్నామంటూ ఇచ్చిన హామీ ఏమైందని కాంగ్రెస్ నేత, తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంత వరకు కనీసం పాలసీని రూపొందించలేదని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో అన్నారు.

12/13/2016 - 02:39

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణలో రైతాంగాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని , రైతాంగ సమస్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పట్టింపే లేదని బిజెపి కిసాన్ మోర్చ అధ్యక్షుడు గోలి మధుసూధన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నాడు కిసాన్ మోర్చ రాష్ట్ర పదాధికారుల సమావేశం బిజెపి కార్యాలయంలో జరిగింది.

12/13/2016 - 02:39

హైదరాబాద్, డిసెంబర్ 12: గత మే నెలలో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఇటీవల మరణించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులను ప్రకటించారని , అందులో కొన్ని ఆస్తులు హైదరాబాద్‌లోనూ ఉన్నట్టు పేర్కొన్నారని దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని పేర్కొంటూ గరీబ్ గైడ్ ఎన్‌జిఓ ప్రతినిధి భార్గవి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

12/12/2016 - 05:10

ఆదిలాబాద్,డిసెంబర్ 11: వేటగాళ్ల ఉచ్చులో పడి కోటపల్లి మండలం అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతి చెందిన సంఘటన జరిగి వారం రోజులు గడవకముందే ఆదిలాబాద్ అటవీ డివిజన్ పరిధిలో మరో చిరుతపులి మృతి చెందిన సంఘటన కలకలం సృష్టిస్తోంది. అడవులకు నిలయమైన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వరసగా వన్యప్రాణులు బలవుతున్న సంఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది.

12/12/2016 - 05:08

మహబూబాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ రాష్ట్రంలో 2019లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్టశ్రాఖ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లాలో బిజెపి జెండా ఎగురవేద్దామని అన్నారు.

12/12/2016 - 05:06

కరీంనగర్, డిసెంబర్ 11: జిల్లాల పునర్విభజన అనంతరం తొలిసారిగా కరీంనగర్‌లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది.

Pages